22 October 2018
Hyderabad
రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `హలో గురు ప్రేమ కోసమే`. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సక్సెస్‌మీట్‌లో...
సాయికృష్ణ మాట్లాడుతూ - ``నేను, ప్రసన్న, త్రినాథరావు కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయమిది. మా హీరో రామ్ ఎనర్జీ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఆయన డాన్సులను అదరగొట్టారు. ఫైట్స్‌తో మెప్పించారు. ఆయన ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్‌ను దాటి.. పర్‌ఫెక్ట్ స్టార్ అయ్యారు`` అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ - ``సినిమా స్టార్ట్ కావడానికి కారణం రూపేశ్, డైరెక్టర్ త్రినాథరావు. ఆయనతో కలిసి నేను మూడు సినిమాలు చేశాం. వంద సినిమాలు మాటలు రాసిన పోసానిగారికి మాటలు రాయాలంటే వందసార్లు ఆలోచించుకోవాల్సి వచ్చింది. ప్రణీత ప్రతిరోజూ రిహార్సల్స్ చేసి నటించింది. మంచి కథతో ట్రావెల్ చేయాలనే అనుపమ ఈ సినిమాను ఒప్పుకుంది. తను రెండు రకాలుగా ప్రవర్తించాలి. అందువల్ల ప్రతి సీన్‌ను చెక్ చేసుకుని నటించింది. సెట్స్‌లో నాలుగు రోజుల పాటు ఎంతో కష్టపడి సినిమా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ టూర్స్ కారణంగా మ్యూజిక్ చేయలేనని చెప్పేశాడు. అయితే చివరకు ఆయన్ను కన్విన్స్ చేశాం. లైవ్ కన్‌స్టర్స్ పూర్తి చేసుకున్న తర్వాత మా సినిమాకు ఆర్.ఆర్ అందించడానికి ఆయనెంత కష్టపడ్డారో నాకు తెలుసు. దిల్‌రాజు, శిరీశ్, లక్ష్మణ్‌గారికి థాంక్స్. రామ్ అన్న!.. హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చారని ఓ రైటర్‌గా చెప్పగలను పదేళ్ల తర్వాత సినిమా చూసినా కూడా రామ్ తర్వాత మరొకరు ఈ సినిమా చేయలేరనిపించేంత చక్కగా నటించారు. ఎమోషన్స్ చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా చేశారు. సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ``డైరెక్టర్‌గా, ఆర్టిస్ట్, రైటర్‌గా 34 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్‌ను చూస్తే.. ఏ కోశాన డైరెక్టర్ లుక్‌లో కనపడడు. ఈయన దర్శకత్వంలో మూడు సినిమాలు చేస్తే.. ఈ సినిమాతో కలిపి మూడు సినిమాలు హిట్ అయ్యాయి. సినిమాను కంఫర్ట్‌బుల్‌గా తీస్తారు. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. రామ్ ఐ లవ్ యు`` అన్నారు.
ప్రణీత మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారి ప్రొడక్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్. త్రినాథరావుగారు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. రామ్ ప్రతి ఒక్కరినీ సెట్‌లో కంఫర్ట్‌గా ఉంచుతారు`` అన్నారు.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ``సినిమా చూపిస్త మావ, నేను లోకల్ ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే.. మూడు సినిమాలు.. మూడు విజయాలు. ఓ డైరెక్టర్‌గా ఇంత కంటే ఏం కావాలి..చాలా హ్యాపీగా ఉంది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇంత మంచి కథను ఇచ్చి, స్క్రీన్‌ప్లే ఇచ్చి నాతో ట్రావెల్ చేసిన ప్రసన్నకుమార్‌కి థాంక్స్. అలాగే సపోర్ట్‌గా ఉన్న సాయికృష్ణకు థాంక్స్. సినిమాటోగ్రాఫర్ విజయ్ కె.చక్రవర్తి వంటి సూపర్ కెమెరామెన్‌ను ఇచ్చారు దిల్‌రాజుగారు. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన విజయ్ చక్రవర్తికి థాంక్స్. అలాగే ఆర్ట్ వర్క్ అందించిన సాహిసురేశ్‌కి థాంక్స్. తను ఎంతో ఎఫర్ట్ పెట్టి చేశారు. ఎడిటర్ శ్రీనుగారికి, మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి థాంక్స్. ఈ మధ్య కాలంలో ప్రకాశ్‌రాజ్‌గారితో చాలా ఎక్కువ వర్కింగ్ డేస్ చేసిన యూనిట్ మాదే. దేవిశ్రీప్రసాద్‌గారితో రెండో సినిమా. ఓ వర్క్‌ను ఆయనకు అప్పగిస్తే.. ఆ డిపార్ట్‌మెంట్ నుండి ఎలాంటి సమస్యలు రాకుండా అవుట్‌పుట్ ఇచ్చేస్తాడు. శ్రీమణిగారికి థాంక్స్. ఎవరేం చెప్పినా పట్టించుకోకండి.. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీరు సినిమా ఎలా తీయాలనుకుంటున్నారో అలా తీయండి చాలు. అనుపమ, ప్రణీతకు థాంక్స్. బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ - ``సినిమా గురించి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ్, త్రినాథరావు, దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు సహా అందరికీ థాంక్స్`` అన్నారు.
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ - ``అరవింద్‌గారితోనే నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు ఆయన మా సక్సెస్‌మీట్‌కు రావడం ఆనందంగా ఉంది. సినిమా విషయానికి వస్తే.. సాయికృష్ణ, ప్రసన్న, త్రినాథరావు సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అకీరా కురసోవాతో ఇద్దరు రైటర్స్ ఉంటారు. ఒకరు సీన్స్ చెబుతుంటే.. మరొకరు గ్రాఫ్ చెబుతుంటారు. అలాగే త్రినాథరావుగారు ప్రసన్న, సాయికృష్ణలను సెట్ చేసుకున్నారేమో.. హ్యాట్రిక్ హిట్ సాధించేశారు. నేచురల్‌గా సన్నివేశాలు కనపడేలా ఆర్ట్ వర్క్ అందించిన సాహిసురేశ్‌గారికి.. హీరో తండ్రి పాత్రలో నటించిన పోసాని కృష్ణమురళిగారికి.. ప్రణీత, అనుపమకి థాంక్స్. శతమానం భవతి నిజాయతీ, డేడికేషన్ గురించి సతీశ్ వేగేశ్న ఎప్పుడూ చెబుతుండేవారు. ఆమెతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రామ్‌గారితో మా బ్యానర్‌లో చేసిన రెండో సినిమా. దసరాకు మాకు హిట్ అందించారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు ప్రతి క్షణం తను పనిచేస్తున్న సినిమాల గురించే ఆలోచిస్తుంటారు. మంచి టీమ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.
హీరో రామ్ మాట్లాడుతూ - ``ప్రేక్షకులు ఈ దసరాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆనందమేసింది. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సాయికృష్ణగారు స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్ అయితే.. ప్రసన్న మాటలు చూసి చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. తనకు చాలా మంచి భవిష్యత్ ఉంది. సాహిసురేశ్‌గారు చాలా ఎఫర్ట్‌తో ఆర్ట్ వర్క్ ఇచ్చారు. చంద్రబోస్‌గారు, శ్రీమణిగారు చాలా మంచి పాటలు రాశారు. విజయ్ చక్రవర్తి చాలా బ్యూటీఫుల్ విజువల్స్. పోసానిగారికి థాంక్స్. దేవిశ్రీ ఎంతో కష్టమైనా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తనతో నేను చేసిన ఆరో సినిమా ఇది. అనుపమ బ్రిలియంట్ యాక్ట్రెస్. త్రినాథ్‌రావుగారు.. చాలా ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్. ఆయన ముందు ఆడియన్. తర్వాతే డైరెక్టర్. అలాగే సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``దిల్‌రాజు మా కుటుంబ సభ్యుడు. స్క్రిప్ట్‌ను నమ్ముకుని ట్రావెల్ చేసే అతి తక్కువ మంది దర్శకుల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. ఇతను రామ్‌ను చాలా బ్యాలెన్డ్‌గా చేయించారు. తను స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదా సరదాగా ఉంటాయి. ఈ సినిమాను సెటిల్డ్‌గా చేయించారు. హర్షిత్.. నా దగ్గర పిల్లా నువ్వు లేని జీవితం సినిమాకు నా దగ్గర పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది. అలాగే శిరీశ్, లక్ష్మణ్‌లకు అభినందనలు. యూనిట్‌కు కంగ్రాట్స్`` అన్నారు.