pizza
Natakam Teaser launch
'నాటకం' టీజర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us


3 September 2018
Hyderabad

రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'నాటకం'. శ్రీసాయి దీప్‌ చాట్ల, రాధిక శ్రీనివాస్‌, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు గోపీచంద్‌ మలినేని, హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో...

మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్‌ మాట్లాడుతూ ''పూర్తి స్థాయి పల్లెటూరి కథ. నాకు కథ నచ్చడంతో అంజిగారిని సినిమాటోగ్రఫీ చేయమని అడిగాను. ఆయన కూడా కథ నచ్చడంతో కెమెరా వర్క్‌ అందించారు'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ అంజి మాట్లాడుతూ ''కథ వినగానే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అని నాకు అనిపించలేదు. కంటెంట్‌ బావుందని అనిపించింది. ఆశిష్‌గాంధీ, ఆషిమా చక్కగా నటించారు'' అన్నారు.

శివ సెల్యూలాయిడ్‌ సురేశ్‌ మాట్లాడుతూ ''ఆర్‌ ఎక్స్‌ 100' సినిమా తర్వాత చాలా సినిమాలు చూసినా.. ఈ సినిమా కంటెంట్‌ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాం. డైరెక్టర్‌ కల్యాణ్‌ సహా ఎంటైర్‌ టీమ్‌కు అభినందనలు'' అన్నారు.

నిర్మాత రిజ్వాన్‌ మాట్లాడుతూ ''సినిమా ఇలా ఉంటుంది.. అలా ఉంటుందని ముందే చెప్పను కానీ.. అందరికీ నచ్చే సినిమా అవుతుందని గట్టి నమ్మకం ఉంది. మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది'' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''సినిమాని చాలా కష్టపడి చేశాం. అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. దర్శకుడు అండ్‌ టీం మంచి సపోర్ట్‌ అందించారు. త్వరలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ''టీజర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇది తప్పకుండా పెద్ద సినిమా అవుతుంది. అంజి విజువల్స్‌, సాయికార్తీక్‌ మ్యూజిక్‌ సహా ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు సినిమాకు పెద్ద ఎసెట్‌ అవుతుంది'' అన్నారు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ ''టీజర్‌ చాలా బావుంది. బోల్డ్‌గా ఉంది. మా సినిమా బావుంది.. చూడండని ఒకప్పటిలా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. సినిమా బావుంటే అందరూ ఆదరిస్తున్నారు. సినిమా అంటే ఇది కదా! అని వేరే ఇండస్ట్రీలు అనుకునే స్థాయికి తెలుగు సినిమా వచ్చింది. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

అనిల్‌ సుంకర మాట్లాడుతూ ''సాయికార్తీక్‌కు ఈ కథ, సినిమా బాగా నచ్చింది. అందుకనే ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించి.. ఇందులో పనిచేసిన వారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను అందరూ ఆదరిస్తున్నారు. క్రిటికల్‌గా బావుంటూ, కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతున్నాయి'' అన్నారు.

హీరో ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ ''సినిమా టీజర్‌ చూసి 'ఆర్‌ ఎక్స్‌ 100', 'అర్జున్‌ రెడ్డి'లా ఉంటుందని అనుకోవద్దు. ఇది డిఫరెంట్‌ సినిమా. అంజిగారి విజువల్స్‌, సాయికార్తీక్‌ మ్యూజిక్‌ మాకు ప్లస్‌ అయ్యాయి. ఇక సినిమా మేకింగ్‌లో సపోర్ట్‌ చేసిన నిర్మాతలకు థాంక్స్‌. దర్శకుడు కల్యాణ్‌ సినిమాను బాగా మౌల్డ్‌ చేశాడు'' అన్నారు.

డైరెక్టర్‌ కల్యాణ్‌ జి.గోగణ మాట్లాడుతూ ''సినిమాను ఓ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తీశాను. టీజర్‌లో కంటెంట్‌ నుండి 5 శాతం మాత్రం చూపించాం. 95 శాతం కంటెంట్‌ సినిమాలో చూడాల్సిందే. సినిమాను తక్కువలో తీయలేదు.. తక్కువగా తీయలేదు. అదిరిపోయేలా తీశాం. కథ విన్న సాయికార్తీక్‌గారు మ్యూజిక్‌ చేయడానికి అంగీకరించడమే కాదు... అంజిగారిని సినిమాటోగ్రఫీ చేయడానికి ఒప్పించారు. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved