pizza
O Pilla Nee Valla teaser launched by mesmerizing star Sharwanand
మెస్మ‌రైజింగ్‌ స్టార్ శ‌ర్వానంద్ చేతుల‌మీదుగా `ఓ పిల్లా నీ వ‌ల్లా` టీజ‌ర్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 February 2017
Hyderaba
d

Helmed by Kishore, including the new cast of Krishna Chaitanya, Rajesh Rathod, Monika Singh and Shalu Chourasiya is the Movie O Pilla Nee Valla. In a private event recently, Ace Director Puri Jagannadh had launched the motion poster of OPNV, which was received rave reviews and appreciations from both the fans and filmy circles.

Now the Teaser of OPNV has been released by none other than the Mesmerizing Star and a youth icon Sharwanand whose recent claim to fame has been the superhit film Sathamanam Bhavathi. Speaking at this event, Sharwanand had commented that the teaser of O Pilla Nee Valla looks very gripping and interesting. He also commented that the Telugu audience would welcome such freshness and innovation and hoped for the film to be a resounding success. He also wished the Director of the movie for a job well executed.

Director of the movie Kishore had commented saying that O Pilla Nee Valla is one of a kind film with all the elements of Love, Action and Comedy. He also noted that the music given by Madhu Ponnas and the cinematography by Shoeb Ahmed would be the strengths of the film. He said the team is all set for the audio release in the month of Feb and the movie release in the month of March.

The Cast of the movie includes Krishna Chaitanya, Rajesh Rathod, Mounika Singh, Shalu Chourasiya, Surya Srinivas and others. The lyrics of the movie have been penned by Krishna Madeneni and Karunakar Addigarla and the Choregraphy by Jitendra. O Pilla nee valla has been co- produce by Mourya and the Editor of the Movie is Anil Kinthada. Music has been composed by Madhu Ponnas and the film has been Produced/Directed by Kishore who also happens to have given its dialogues, screenplay and story

మెస్మ‌రైజింగ్‌ స్టార్ శ‌ర్వానంద్ చేతుల‌మీదుగా `ఓ పిల్లా నీ వ‌ల్లా` టీజ‌ర్ లాంచ్‌

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా ప్ర‌ధాన‌తారాగ‌ణం. ఇటీవ‌లే టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `ఓ పిల్లా నీ వ‌ల్లా` పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించింద‌ని ప్ర‌శంసించారంతా. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ని `శ‌త‌మానం భ‌వ‌తి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో తారాప‌థంలోకి దూసుకొచ్చిన మెస్మ‌రైజింగ్ స్టార్ శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ``టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తెలుగు ప్రేక్ష‌కులు వైవిధ్యాన్ని, కొత్త‌ద‌నాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ద‌ర్శ‌కనిర్మాత కిషోర్‌కి అభినంద‌న‌లు`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిది. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో,మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాం. పూరి ఆవిష్క‌రించిన పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అలాగే మెస్మ‌రైజింగ్ స్టార్‌ శ‌ర్వానంద్ లాంటి స‌క్సెస్‌ఫుల్ హీరో మా సినిమా టీజ‌ర్‌ని ఆవిష్క‌రించ‌డ‌మే ఓ పెద్ద స‌క్సెస్‌గా భావిస్తున్నాం. శ‌ర్వాకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చౌరాసియా , సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved