pizza
Ram NRI teaser launch
`రామ్ (ఎన్‌.ఆర్‌.ఐ)` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 February 2017
Hyderaba
d

అలి రెజా, సీతా నారాయ‌ణ‌న్ హీరో హీరోయిన్లుగా మువ్వా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎన్‌.ల‌క్ష్మి నంద ద‌ర్శ‌క‌త్వంలో మువ్వ స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `రామ్‌(ఎన్‌.ఆర్‌.ఐ)`. ప‌వ‌ర్ ఆఫ్ రిలేష‌న్ షిప్‌..అనేది క్యాప్ష‌న్‌. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమవారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, టి.ప్ర‌స‌న్న‌కుమార్‌, సాయివెంక‌ట్‌, మేకా ర‌మేష్‌, విజ‌య్ చంద‌ర్‌, గీతాంజ‌లి, వ‌ర్మ, డైరెక్ట‌ర్ ల‌క్ష్మినంద‌, మువ్వ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొని టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

విజ‌య్ చంద‌ర్ మాట్లాడుతూ - ``కొద్ది గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. డైరెక్ట‌ర్ ల‌క్ష్మినంద పాత్ర‌ల‌న్నింటినీ చాలా చ‌క్క‌టి ఎమోష‌న్స్‌తో చిత్రీక‌రించారు. కొత్త హీరో అలీ చ‌క్క‌గా న‌టించాడు.కుటుంబ విలువ‌ల‌ను తెలియ‌జేసే చిత్రంగా అంద‌రి మ‌న్న‌న‌లను సినిమా పొందుతుంది`` అన్నారు.

టి.ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ - ``డ్యాన్స్ మాస్ట‌ర్ లారెన్స్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది మాగంటి గోపీనాథ్‌గారే.త‌ర్వాత లారెన్స్ మాస్ట‌ర్ డ్యాన్స‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా ఎంత పేరు తెచ్చుకున్నారో తెలిసిందే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్‌గారి చేతుల మీదుగా విడుద‌లైన ఈ టీజ‌ర్‌తో సినిమాకు మంచి క్రేజ్ ప్రారంభ‌మై సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ద‌ర్శ‌క నిర్మాత‌లు చేసిన ఈ ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సాయివెంక‌ట్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు నాకు ద‌గ్గ‌ర సంబంధం ఉంది. రియ‌ల్ట‌ర్‌గా, రాజ‌కీయ వేత్త‌గా ఉన్న వ్య‌క్తి నిర్మాత‌గా ఇండ‌స్ట్రీకి రావ‌డం అనేది చాలా మంచి ప‌రిణామం. అన్నీ ఎమోష‌న్స్‌ను క్యారీ చేసే చిత్ర‌మిది. మంచి కుటుంబ విలువ‌ల‌తో కూడిన చిత్ర‌మిది. అంద‌రికీ సినిమా బాగా న‌చ్చి సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సీనియ‌ర్ ఆర్టిస్ట్ గీతాంజ‌లి మాట్లాడుతూ - ``ఈ సినిమాలో విజ‌యచంద‌ర్‌గారి భార్య పాత్ర‌లో న‌టించాను. పాత్ర‌ల‌న్నీ మంచి సెంటిమెంట్‌తో ఒక‌దానికొక‌టి రిలేష‌న్‌తో కొన‌సాగే చిత్ర‌మిది. ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలించే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ - ``మంచి కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ మంచి ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రాల‌ను ఆద‌రిస్తే ఇంకా మంచి చిత్రాలు వ‌స్తాయి. త‌ప్ప‌కుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

నిర్మాత మువ్వ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ``నిర్మాత‌గా నాకు మొద‌టి చిత్రం. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నిర్మాత‌గా సినిమాను రూపొందించాల‌ని అనుకున్నాను. కుటుంబ విలువ‌లున్న ఈ సినిమాలో మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించి సినిమా చేశాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ల‌క్ష్మినంద మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం నాపై, నా క‌థ‌పై న‌మ్మ‌కంతో నిర్మాత నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చినందుకు నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌గారికి థాంక్స్‌. సామాజిక స్పృహ క‌లిగిన కుటుంబ క‌థా చిత్ర‌మిది. అన్నీ వ‌ర్గాల వారిని అల‌రించి చిత్రంగా నిలుస్తుంది`` అన్నారు.

అలి రెజా, సీతా నారాయ‌ణ‌న్‌, గీతాంజ‌లి, విజ‌య్‌చంద‌ర్‌, సూర్య‌, స‌నా, ర‌ఘు, జోగినాయుడు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః వీరబాబు బాసిన‌, సాహిత్యంః వై.రామాంజ‌నేయులు, ఆర్ట్ః జె.కె.మూర్తి, ఎడిట‌ర్ః కె.ర‌మేష్‌, మ్యూజిక్ః శ్రావ‌ణ్‌, సినిమాటోగ్ర‌ఫీః నాగ‌బాబు క‌ర్ర‌, నిర్మాతః మువ్వ స‌త్య‌నారాయ‌ణ‌, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ఎన్‌.ల‌క్ష్మి నంద‌.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved