18 April 2018
Hyderabad
విజయ్ దేవరకొండ హీరోగా జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `టాక్సీవాలా`. ఎస్.కె.ఎన్ నిర్మాత. రాహుల్ సంక్రితియాన్ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో
రాహుల్ సంక్రితియాన్ మాట్లాడుతూ - ``ది ఎండ్` తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. జీఎ2, యువీ పిక్చర్స్ కాంబినేషన్‌లో నిర్మితమవుతోన్న చిత్రం. అలాగే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం రావడం గొప్ప అవకాశం. ఎక్కడా తగ్గకుండా సినిమాను కంప్లీట్ చేశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సీజీ వర్క్ జరుగుతోంది. మూవీ చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.
మాళవికా నాయర్ మాట్లాడుతూ - `` నా క్యారెక్టర్ గురించి నేను ఎక్కువగా ఇప్పుడు మాట్లాడలేను. క్రేజీ స్టోరీ. డిఫరెంట్ స్టోరీ. అందుకనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను`` అన్నారు.
ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ - ``నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నా తొలి సినిమా ఇది. ఇంతకు ముందు రెండు, మూడు షార్ట్ ఫిలింస్ మాత్రమే చేశాను. విజయ్‌తో చేయడం ఆనందాన్నిచ్చింది. తను ఎంతో సపోర్టివ్. తెలుగులో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను`` అన్నారు.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ - ``తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ ముందు వరుసలో ఉంటాయి. అల్లు అరవింద్‌గారు ఉత్సాహం, టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలని బన్నీ వాసు, నాకు నిర్మాతలు ఉండే అవకాశాన్ని కల్పించారు. ఒకప్పుడు గీతా ఆర్ట్స్‌లో వచ్చిన చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారి సినిమాలకు బ్యానర్స్ కట్టేవాడిని. ఇప్పుడు ఆ బ్యానర్‌లో నిర్మాతగా నా పేరు రావడమనేది గొప్ప విషయంగా భావిస్తున్నాను. టాక్సీవాలా ఓ డిఫరెంట్ మూవీ. రాహుల్ సంక్రితియాన్‌తో రెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. రేపు సినిమా విడుదలైన తర్వాత సినిమాయే మాట్లాడుతుంది. అర్జున్ రెడ్డిలాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత మా సినిమాలో నటించారు. బాగా కష్టపడే హీరో. తనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ప్రియాంక్ అనే తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. అలాగే మాళవికా నాయర్ కీలకపాత్రలో నటించింది`` అన్నారు.
బన్నీ వాసు మాట్లాడుతూ - ``మంచి టాలెంట్ ఉన్నవారు, ప్యాషన్ ఉన్న వారి కోసం అల్లు అరవింద్‌గారి ఆశీర్వాదంతో జీఏ2 స్టార్ట్ చేశాం. టాక్సీవాలా కథ నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో నాకు.. యు.వి.క్రియేషన్స్ సపోర్ట్ ఇచ్చారు`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``ఈ సినిమా నాకొక కొత్త ఎక్స్‌పీరియెన్స్. విజయ్ దేవరకొండ కథ విని ఎగ్జయిట్ అయ్యాడు. తన యూత్ ఐకాన్‌గా ఉన్నాడు. తను, రాహుల్ కలిసి సినిమాను చేశారు. సినిమా బాగా వచ్చిందని అంటున్నారు. ఎస్.కె.ఎన్ నిర్మాతగా విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డితో స్టార్ట్ చేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక విజయ్ దేవరకొండ జెన్యూన్ ఆర్టిస్ట్. నా కొడుకులతో సమానం. తనకు గొప్ప భవిష్యత్ ఉంటుంది. ప్రియాంక అనే తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. విచిత్రమైన సబ్జెక్ట్. కొత్త కాన్సెప్ట్. కొత్త కథలతో వచ్చే వారిని జీఏ 2 ఎంకరేజ్ చేస్తుంది. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ఆరు నెలల క్రితం విడుదలైన బాహుబలి విడుదలైన తర్వాత అందరూ కను రెప్పలు వెగరేసి ఎవరూ ఈ తెలుగు ఇండస్ట్రీ అని గొప్పగా చూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న బాహుబలికి తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న బాధాకరమైన విషయాలను బయటకు తీస్తున్నారు. నేను నాతో సహా అందరికీ చేసే విన్నపం ఏంటంటే.. ఈ ఇండస్ట్రీలోనే మనం ఉంటున్నాం. ఆధారపడి ఉన్నాం. ఇండస్ట్రీలో తప్పులు జరగడం లేదని అనడం లేదు. ఒకరిద్దరు తప్పులు చేసేవాళ్లు ఉన్నారు. దాన్ని పెద్ద క్రైమ్ కింద చేసేసి.. తెలుగు సినిమా ఇండస్ట్రీని అవమానించే పరిస్థితికి తీసుకెళ్లిపోతున్నారు. మన ఇండస్ట్రీ చిన్న బుచ్చుకునే మాట్లాడవద్దు`` అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ``నా సినిమా పోస్టర్ మీద గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ పేరు ఉండటం గర్వంగా ఉంది. నటుడుగా మారిన తర్వాత ఏం చేయాలనే దాన్ని ఓ లిస్ట్ రాసుకున్నాను. అందులో రెండు టిక్స్ పడ్డాయి. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ యంగ్ టీం. అరవింద్‌గారు మాకు పూర్తి స్వేచ్చనిచ్చారు. న్యూ ఏజ్ సినిమా. అన్ని ఎలిమెంట్స్ ఉన్న హై కాన్సెప్ట్ స్ట్రెస్ బస్టర్. క్రేజీ సూపర్ స్క్రిప్ట్. సినిమా సమ్మర్‌లో మే 18న విడుదలవుతుంది. సినిమా చూసి అందరూ పక్కా నవ్వుకుని చస్తారు`` అన్నారు.