pizza
PSV Garuda Vega 126.18M trailer launch
`పిఎస్‌వి గ‌రుడవేగ 126.18 ఎం` ట్రైల‌ర్ విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 October 2017
Hyderabad

యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. పూజా కుమార్‌, శ్ర‌ద్ధాదాస్‌, కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్వ‌క‌త్వంలో కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద‌మూరి బాల‌కృష్ణ ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...

నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ ``ప్ర‌వీణ్ స‌త్తార్ తీసే సినిమాల‌కు ఒక‌దానితో ఒక‌టికి ఎక్క‌డా సంబంధం ఉండ‌దు. ఆయ‌న ప్ర‌తి చిత్రం కొత్త‌గా ఉంటుంది. స‌కుటుంబ‌స‌ప‌రివార స‌మేతంగా ప్రేక్ష‌కులు వ‌చ్చి సినిమాను చూసే విధంగా ద‌ర్శ‌కుడు సినిమాల‌ను తీస్తున్నారు. రాజ‌శేఖ‌ర్‌గారు విల‌క్ష‌ణ న‌టుడు. క‌థ‌నంలోగానీ, క‌థ‌లోగానీ, పాత్ర‌ల్లోగానీ, పెర్ఫార్మెన్స్ లో గానీ కొత్త‌ద‌నాన్ని ఆహ్వానిస్తుంటారు. నిర్మాత బావుంటేనే చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ బావుంటుంద‌ని మా జ‌న‌రేష‌న్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో ఎంత ఖ‌ర్చుపెడుతున్నారు? ఎందుకు ఖ‌ర్చుపెడుతున్నారో తెలియ‌దు. కొత్త‌ద‌నాన్ని అభిమానించే వారు ఈ సినిమాను హిట్ చేయాలి. గ్రాఫిక్స్, ఫొటోగ్ర‌ఫీ బావున్నాయి. అంద‌రూ క‌ష్ట‌ప‌డి చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. స్ప‌ర్థ‌యా వ‌ర్ధ‌తే విద్య అని న‌మ్ముతాను. ఈ న‌మ్మ‌కంతోనే కొన్ని సినిమాల్లో ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లు కూడా చేశాను. భ‌విష్‌య‌త్తులోనూ ఇలాంటి సినిమాలు చేయ‌డానికి ఉత్సాహాన్ని క‌లుగ‌చేస్తున్న అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు. నిర్మాత‌లు పెట్టిన డ‌బ్బులకు పైగా త‌ప్ప‌కుండా రావాలి. జీవిత‌, శివానీ, శివాత్మిక‌ల‌కు కూడా అభినంద‌న‌లు. ఇండ‌స్ట్రీ కంపెనీల్లా త‌యార‌య్యాయి. ఇలాంటి త‌రుణంలో శివానీ, శివాత్మిక‌లాంటి వారు ముందుకొచ్చి చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంటున్నందుకు వారికి ఆశీస్సులు తెలియ‌జేస్తున్నా. ఈ సినిమాలో క‌నిపించ‌ని అదృశ్య శ‌క్తి జీవిత‌గారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 3న విడుద‌ల కానుంది`` అని చెప్పారు.

రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ``మా బాల‌య్య‌గారికి ధ‌న్య‌వాదాలు. ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు.. బాల‌య్య ఎక్క‌డికి వెళ్లినా అదృష్ట‌మ‌ని. జీవిత వెళ్లి మాట్లాడిన వెంట‌నే ఆయ‌న వ‌స్తున్నాన‌ని అన్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు క‌థ చెప్పిన‌ప్పుడు ఆయ‌న చెప్పింది, చెప్పిన‌ట్టు చేస్తారా? అని అడిగా. ఆయ‌న స‌రేన‌న్నారు. నా జీవితంలో నేను ఏ సినిమాకూ ప‌డ‌ని క‌ష్టాన్ని ఈ సినిమాలో నేను చేసేలా చేశారు. న‌న్ను బెండ్ తీసి చేయించారు. ఈ సినిమాకు చాలా క‌ష్ట‌ప‌డ్డా. ప్ర‌వీణ్ గారు చెప్పింది చేశారు. చెప్పింది చూపించారు. ప్రొడ‌క్ష‌న్‌, డైర‌క్ష‌న్‌, పోస్ట‌ర్ డిజైన్ నుంచి బిజినెస్ కూడా మా ద‌ర్శ‌కుడే చేస్తున్నారు.`` అని చెప్పారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ ``శివాని, శివాత్మిక పుట్టిన‌ప్ప‌టి నుంచి నా చేతుల మీదుగా పెంచాను. వాళ్లు ఏ రోజు కాస్త ఎమోష‌న్స్ లో ఉన్నా.. జీవిత వ‌చ్చి న‌వ్వితే సెట్ అయ్యేది. ప్ర‌వీణ్ స‌త్తారు నా ఆఫీసుకు వ‌చ్చి క‌థ చెప్పిన‌ప్పుడు పెద్ద డైర‌క్ట‌ర్ అవుతాడ‌ని చెప్పా. ఈ సినిమా ఫోటోగ్రాఫ‌ర్ అంజీ చాలా బాగా చేశారు. హీరోయిన్లు డిఫ‌రెంట్ పాత్ర‌లు చేశారు. త‌ప్ప‌కుండా హిట్ సినిమా అవుతుంది. మా ముర‌ళి క‌న్నా నాకు ఎక్కువ స్వాతంత్రం మా బావ రాజశేఖ‌ర్‌తో ఉంది`` అని చెప్పారు.రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``హాలీవుడ్ సినిమాలాగా ఉంది చూడ్డానికి. రాజ‌శేఖ‌ర్‌గారి ఫ్యామిలీ నా కుటుంబంలాంటిది. రాజ‌శేఖ‌ర్‌గారి అమ్మ‌గారు బాల‌కృష్ణ‌గారి రూపంలో ఉన్న‌ట్టు అనిపిస్తోంది`` అని అన్నారు.

పోకూరి బాబూరావు మాట్లాడుతూ ``టి.కృష్ణ త‌ప్ప నాతో పాటు, యూనిట్ అంద‌రూ రాజ‌శేఖ‌ర్‌ని హీరోగా అప్పుడు వ‌ద్ద‌న్నాం. కానీ టి.కృష్ణ మాత్రం ఒప్పుకోలేదు. `వందేమాత‌రం` ఆయ‌న‌తోనే చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎంత పేరు తెచ్చుకున్నారో అంద‌రికీ తెలిసిందే. బాల‌య్య‌బాబులాంటి వ్య‌క్తి చేతుల మీదుగా ట్రైల‌ర్ రిలీజ్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇంత‌కుముందు ప్ర‌వీణ్ సినిమాల‌న్నీ నేల‌మీద న‌డిచిన‌ట్టు ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికో పోయింది అని అనిపిస్తుంది. హ్యూమన్ ఎమోష‌న్స్ కూడా ఉన్న సినిమా ఇది. గ‌రుడ‌వేగ అనే టైటిల్ కూడా బావుంది. ఈసినిమాలో ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నేను ప‌ని చేసిన అన్ని హీరోలు అంద‌రిలోకీ నాకు ఇష్ట‌మైన హీరో రాజ‌శేఖ‌ర్‌`` అని తెలిపారు.

చ‌ల‌ప‌తి రావు మాట్లాడుతూ ``రాజ‌శేఖ‌ర్‌గారిని ప్ర‌వీణ్ మోకాళ్ల మీద చేయించాడ‌ట‌.. జీవితంలో మోకాళ్ల ప్రాముఖ్య‌త చాలా ఉంటుంది`` అని తెలిపారు.

శ్ర‌ద్ధాదాస్ మాట్లాడుతూ ``టీజ‌ర్‌లో రాజ‌శేఖ‌ర్‌గారిని చూసిన‌ప్పుడు నాకు హాలీవుడ్ ఆర్టిస్ట్ గుర్తుకొచ్చారు. నేను ప్ర‌వీణ్‌తో గుంటూరు టాకీస్‌లో `రివాల్వ‌ర్ రాణి` పాత్ర‌లో న‌టించాను. ఆ సినిమా కూడా బాల‌కృష్ణ‌గారి చేతుల మీదుగా విడుద‌లైంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. హిస్ట‌రీ రిపీట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను జర్న‌లిస్ట్ గా న‌టించాను`` అని చెప్పారు.

పూజాకుమార్ మాట్లాడుతూ ``ఈ సినిమా చాలా బావుంటుంది. ప్ర‌వీణ్‌తో ఏ న‌టులైనా న‌టించాల‌నుకుంటారు. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ఇంకో రేంజ్‌కి తీసుకెళ్తుంది. నాకు తెలుగు రాక‌పోయినా రాజ‌శేఖ‌ర్‌గారు స‌పోర్ట్ చేసిన తీరును మ‌ర్చిపోలేను`` అని అన్నారు.

జీవిత మాట్లాడుతూ ``బాల‌కృష్ణ‌గారిని పిల‌వ‌గానే వ‌చ్చారు. మేం ఇంటి నుంచి ఎన్ని గంట‌ల‌కు బ‌య‌లుదేరాలో కూడా ఆయ‌నే ముహూర్తం పెట్టారు`` అని చెప్పారు.

ప్ర‌వీణ్ స‌త్తార్ మాట్లాడుతూ ``బాల‌కృష్ణ‌గారికి హ్యూజ్ థాంక్స్. గుంటూరు టాకీస్ సినిమాను రూ.2 కోట్ల‌తో తీశారు. పాతిక కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ సినిమాను పాతిక కోట్ల‌తో చేశాం. ఎన్ని కోట్లు క‌లెక్ట్ చేస్తుందో చూడండి అని తెలిపారు. మా ద‌ర్శ‌కుల శాఖ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఆర్ట్ డైర‌క్ట‌ర్ కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మా ఎడిట‌ర్ కూడా నా తొలి సినిమా నుంచి ఆయ‌నే చేస్తున్నారు. సీవీ రావు గారు నా తొలి సినిమా నుంచి నాతో ఉన్నారు. ఆయ‌న వీఎఫ్ఎక్స్ చేశారు. డీఐ కూడా చేశారు. దీనికి ఓ మూల‌స్థంభం ఉంది. ఆ స్థంభం జీవిత‌గారు. ఆవిడ ఓర్పు గురించి ఓ పుస్త‌కం రాయొచ్చు. ఆమె అస‌లు నిద్ర‌పోతుందా? అని నా అనుమానం. ఆమె ఎప్పుడూ కాంప్ర‌మైజ్ కాలేదు. మంచి సినిమా కావాల‌ని కోరుకున్నారు. క‌మ్‌బ్యాక్ ఆఫ్ రాజ‌శేఖ‌ర్‌గారు అని న‌మ్మారు`` అని తెలిపారు.రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌, ఎడిటింగ్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా, నిర్మాత: కొటేశ్వ‌ర్ రాజు, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌వీణ్ స‌త్తారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved