pizza
Tej I Love U trailer launch
`తేజ్ ఐ ల‌వ్ యు` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


25 June 2018
Hyderabad

Supreme Hero Sai Dharam Tej's latest is a breezy romantic entertainer 'Tej' (I Love You) with Anupama Parameswaran as his leading lady. Creative Producer K.S. Rama Rao is producing this film under his Creative Commercials Movie Makers banner in Karunakaran's Direction. The film is releasing.worldwide on July 6th.

FIlm's Theatrical Trailer was released on Monday Evening in a special event. The trailer was unveiled by Sai Dharam Tej along with Distributor Dileep Tandon in the presence of Tollywood PRO's, BA Raju, Vamsi Kaka, Nayudu, Phani, Eluru Srinu, Jilla Suresh, Aanad, Duddi Srinu. 'Creative Commercials' first film 'Abhilasha' was launched in the presence of Journalists. Senior Journalist Mikkilijeni Jagadeesh Babu Clapped while another Senior Journalist I.Arjuna Rao switched on the camera for 'Abhilasha' back then. Since then, Producer KS Rama Rao is having good relationships with journalists.. Trailer of 'Tej I Love You' too released in the presence of PRO's. Hero Sai Dharam Tej, Producer KS Rama Rao Presented prizes for the winners of 'Tej I Love You' contest.

Indra Films Distributor Dileep Tandon said, " Trailer is extraordinary. This film which is being made in the combination of Sai Dharam Tej & Karunakaran will definitely become a super hit."

Writer Darling Swamy said, " Trailer looks too good. The film carries a very good love feel. Karunakaran garu is on the verge of scoring a very good success. KS Rama Rao garu will get a very good amount of money with this film. Thanks to Rama Rao garu for giving me this opportunity to write dialogues for this film. Tej gave an extraordinary performance. Cameraman Andrew visuals look very beautiful. Gopi Sundar has composed very good music. Music has already become a grand success. Songs will haunt you after listening to them. I believe the film will make us proud."

Cameraman Andrew Said, " Film came out very well. It will definitely become a big hit."

Producer KS Rama Rao said, " Total credit of the film belongs to Sai Dharam Tej. Along with him Karunakaran, Andrew, Darling Swamy, Gopi Sundar shares the credit. When Tej gave me his dates to make a film, We couldn't find a proper story for more than one and a half years. One day Sai Dharam Tej called me and said that he liked a story and asked me to listen to it. He said that if I like the story then we will proceed with it. Then Karunakaran came and narrated me this story. I liked it very much and we initiated this project. The story carries pleasantness. I believed that youth will love this film. Final output surpassed my expectations. The film has a very good feel. I made many super hit films in my banner. This film will be one of the best and will join the list of super hits from my banner. Darling Swamy penned superb dialogues. Andrew's cinematography stands as a major highlight of the film. Gopi Sunder composed beautiful tunes. Thanks to him. Thanks to my Artists, Technicians for making a very good film in my banner."

Hero Sai Dharam Tej said, " I came to know that during the launch of Creative Commercials first film 'Abhilasha', camera was switched on and first clap was given by Journalists. I am very happy that in a similar manner, the Trailer of 'Tej I Love You' is launched in the presence of all PRO's. Karunakaran garu gave me a very good opportunity with a very good character. We started this film once KS Rama Rao garu liked the script. We feel that we have made a very good film. Gopi Sundar's Music, Saahi Suresh's Art Direction, Andrew Camerawork, Darling Swamy Dialogues are main assets for the film. Thanks to everyone for their co-operation. I am confident that everyone will love 'Tej' ".

Co-Producer Vallabha and Distributors graced this event.

Sai Dharam Tej & Anupama Parameswaran playing the lead roles while principle cast involves Jayaprakash, Pavitra Lokesh, Prudhvi, Surekha Vani, Viva Harsha, Josh Ravi, Arun Kumar.

Lyrics : Chandra Bose, Ramajogayya Sastry, Pothula Ravikiran, Gosala Rambabu, Stunts : Venkat, Production Executive : Sateesh, Production Controller : Mohan, Chief Co-Director : Chalasani Ramarao, Editor : S.R.Sekhar, Art : Saahi Suresh, Music : Gopi Sundar, Cinematography : Andrew.I, Dialogues : Darling Swamy, Co-Producer : Vallbha, Producer : K.S. Rama Rao, Story, Screenplay, Direction : A.Karunakaran

`తేజ్ ఐ ల‌వ్ యు` ట్రైల‌ర్ విడుద‌ల‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై

6న విడుద‌ల‌వుతుంది. సోమ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మూవీ పి.ఆర్‌.ఒ లు బి.ఎ.రాజు, వంశీ కాక‌, నాయుడు, ఫ‌ణి, ఏలూరు శ్రీను, జిల్లా సురేశ్, ఆనంద్‌, దుడ్డి శీను అంద‌రి స‌మక్షంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిలీప్ టాండ‌న్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `తేజ్ ఐ ల‌వ్ యు` కాంటెస్ట్ విజేత‌ల‌కు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, నిర్మాత కె.ఎస్‌.రామారావు బ‌హుమ‌తుల‌ను అందించారు.

ఇంద్ర ఫిలింస్ డిస్ట్రిబ్యూట‌ర్ దిలీప్ టాండ‌న్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ ఎక్స్‌టార్డిన‌రీగా ఉంది. సాయిధ‌ర‌మ్‌, క‌రుణాక‌ర‌ణ్‌క ఆంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుంది`` అన్నారు.

రైట‌ర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. సినిమాలో ల‌వ్‌ఫీల్ ఉంది. క‌రుణాక‌ర‌న్‌గారికి మంచి హిట్ కావాలి. కె.ఎస్‌.రామారావుగారికి ఈ సినిమాతో బాగా డ‌బ్బులు రావాలి. నాకు డైలాగ్స్ రాసే అవ‌కాశం ఇచ్చిన రామారావుగారికి థాంక్స్‌. తేజ్ ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్‌ఫార్మెన్స్ చేశాడు. కెమెరామెన్ అండ్రూ విజువ‌ల్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. గోపీసుంద‌ర్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఆల్ రెడీ పాట‌లు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సాంగ్స్ అన్ని హంటింగ్‌గా ఉన్నాయి. మా టీంకు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నాను`` అన్నారు.

కెమెరామెన్ అండ్రూ మాట్లాడుతూ - ``మూవీ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ``ఈ సినిమా టోట‌ల్ క్రెడిట్ అంతా సాయిధ‌ర‌మ్‌కే చెందుతుంది. అలాగే క‌రుణాక‌ర‌ణ్‌, అండ్రూ, గోపీసుంద‌ర్‌, డార్లింగ్ స్వామిల‌కు కూడా ద‌క్కుతుంది. నాకు తేజ్ డేట్స్ ఇచ్చి ఏడాదిన్న‌ర స‌మ‌యం వ‌ర‌కు మంచి క‌థ‌లు దొర‌క‌లేదు. ఆ స‌మ‌యంలో సాయిధ‌ర‌మ్ నాకు ఫోన్ చేసి నేనొక క‌థ విన్నాను. నాకు న‌చ్చింది. మీరు కూడా వినండి.. మీకు న‌చ్చితే సినిమా చేద్దాం అన్నారు. క‌రుణాక‌రన్ వ‌చ్చి క‌థ చెప్పాడు. నాకు న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. క‌థ‌లో మంచి ఫీల్ ఉంది. యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని అనుకున్నాను. కానీ సినిమా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానిక‌న్నా బాగా వ‌చ్చింది. సినిమాలో మంచి ఫీల్ క‌న‌ప‌డుతుంది. నా బ్యాన‌ర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేశాను. వాటికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా మా బ్యాన‌ర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. డార్లింగ్‌స్వామి డైలాగ్స్ చాలా బాగా రాశాడు. అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్ అవుతుంది. గోపీసుంద‌ర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త‌న‌కు థాంక్స్‌. ఒక మంచి సినిమా తీయ‌డానికి స‌హాయ‌ప‌డిన నా న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు.

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ``అభిలాష‌` సినిమా ప‌బ్లిసిటీ పి.ఆర్‌.ఒలు, జ‌ర్న‌లిస్టుల‌తోనే స్టార్ట్ అయ్యిందని విన్నాను. మ‌ళ్లీ అలాగే పి.ఆర్‌.ఒ ల స‌మ‌క్షంలో ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. క‌రుణాక‌ర‌ణ్‌గారు మంచి అవ‌కాశం ఇచ్చారు. మంచి పాత్ర ఇచ్చారు. కె.ఎస్‌.రామారావుగారికి క‌థ న‌చ్చాకే ఈ సినిమా చేశాం. మంచి సినిమా తీశామ‌నే ఫీలింగ్ క‌లిగింది. గోపీసుంద‌ర్‌గారి సంగీతం, సాహిసురేశ్ ఆర్ట్‌డైరెక్ష‌న్‌, అండ్రూ కెమెరావ‌ర్క్‌, డార్లింగ్ స్వామి మాట‌లు సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. స‌హ‌కారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. అంద‌రికీ సినిమా న‌చ్చుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాను`` అన్నాను.

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved