pizza
Meelo Evaru Koteeswarudu Trailer launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 October 2016
Hyderaba
d

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి 'మీలో ఎవరు కోటీశ్వరుడుస‌. శృతిసోధి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా....

దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ - మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక్క ఐడియా కోటి రూపాయలు. ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్లు ఒక్క ఐడియాకే కోటి రూపాయలు ఇస్తున్నారంటే కారణమేంటి, దాని వెనుక కథేంటి అనేదే సినిమా. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. నవీన్‌చంద్ర, శృతిసోధిలతో పాటు పృథ్వి కీలకపాత్రలో నటిస్తున్నారు. అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ఇచ్చారు. నాగేంద్రకుమార్‌ మంచి కథను, డైలాగ్స్‌ను అందించగా, బాల్‌రెడ్డిగారి సినిమాటోగ్రఫీతో ప్రతి సీన్‌ను రిచ్‌గా చిత్రీకరించారు. సినిమా విడుదలైన తర్వాత క్రాంతి డైలాగ్స్‌కు చాలా మంచి పేరు వస్తుంది. రఘుబాబు, మురళీశర్మగారు, గౌతంరాజుగారు ఇలా మంచి టీం కుదిరింది. సినిమా దాదాపు పూర్తయ్యింది. ఈ నెల 5,6,7 వతేదిల్లో పృథ్వి, కల్యాణిలపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తాం. దాంతో మొత్తం సినిమా పూర్తవుతుంది. డబ్బింగ్‌ పూర్తయ్యింది. రీరికార్డింగ్‌ జరుగుతుంది. అక్టోబర్‌ 3వారం సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేశాం'' అన్నారు.

శృతిసోధి మాట్లాడుతూ - ''ఈ సినిమాలో యాక్ట్‌ చేయడం లక్కీగా భావిస్తున్నాను. రిచ్‌ గర్ల్‌ క్యారెక్టర్‌ చేశాను. చాలా మంచి రోల్‌. సినిమాలో వర్క్‌ చేయడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. దర్శకుడు సత్తిబాబుగారు నా నుండి మంచి నటననను రాబట్టుకున్నారు. దర్శకుడు అద్భుతమైన స్క్రీన్‌ప్లేను అందించారు. బాల్‌రెడ్డిగారు ప్రతి సీన్‌ను కలర్‌ఫుల్‌గా చూపించారు. నవీన్‌ చంద్ర చాలా టాలెంటెడ్‌ నటుడు'' అన్నారు.

పృథ్వి మాట్లాడుతూ - ''బెంగాల్‌ టైగర్‌ తర్వాత రాధామోహన్‌గారి బ్యానర్‌లో చేసిన సినిమా. సినిమా అంతా కామెడితో నిండి ఉంది. నవీన్‌చంద్రగారికి ఈ సినిమా మంచి పేరును తెచ్చి పెడుతుంది. సత్తిబాబుగారు, అండ్‌ టీం సినిమాను ఎలా రాసుకున్నారో అలాగే చేయించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇవివిగారి తర్వాత ఆ మార్క్‌ సినిమాలు చేస్తున్న సత్తిబాబుగారు మరోసారి ఆ ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తారు'' అన్నారు.

కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''నా బ్యానర్‌లో రూపొందుతోన్న ఆరో సినిమా. నాగేంద్రకుమార్‌గారు చెప్పిన ఐడియాతో కథను సిద్ధం చేశారు. ఇలాంటి కథను ఎవరు చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తే సత్తిబాబుగారైతే మంచి టైమింగ్‌తో సినిమాను తీస్తారని భావించాం. కథ వినగానే సత్తిబాబుగారు, విక్రమ్‌, క్రాంతి అందరూ కలిసి బ్రహ్మండమైన కథను సిద్ధం చేసి, సినిమాను తీశారు. మంచి టీం సహకారంతో చేసిన ఈ సినిమా బాగా వచ్చింది. సాంగ్‌ మినహా సినిమా పూర్తయ్యింది. గేమ్‌షో మూవీ కాదు, అందరినీ కడుపుబ్బా నవ్వించే సినిమా'' అన్నారు.

నవీన్‌చంద్ర మాట్లాడుతూ - ''రాధామోహన్‌గారు నాతో కామెడి జోనర్‌ మూవీ చేస్తాననగానే నేను లవ్‌, యాక్షన్‌ సినిమాలే చేశాను. కామెడి సినిమాలు చేయలేదని చెప్పాను. ఆయన సత్తిబాబుగారిని కలవమన్నారు. ఆయన్ను కలిసి కథ విన్నాను, నచ్చడంతో చేయడానికి అంగీకరించాను. సత్తిబాబుగానే అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారు. బాల్‌రెడ్డిగారు, గౌతంరాజుగారు వంటి మంచి టెక్నిషియన్స్‌తో వర్క్‌ చేయడం మరచిపోలేను. ఈ సినిమాలో నేనా, పృథ్విగారా హీరో అని తేల్చుకోవాల్సి ఉంది. శృతి వంటి డేడికేటెడ్‌ హీరోయిన్‌ ఈ సినిమాలో వర్క్‌ చేశాను. క్రాంతి మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ సినిమా ట్యాగ్‌లైన్‌ ఒక ఐడియా కోటి రూపాయలు. కోటి రూపాయలు అంటే డబ్బు కాదు, కోటి రూపాయల ఆనందాన్నిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

 

Glam gallery from the event

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved