pizza
Esha Kode, the reigning Miss Teen India USA represented USA at the Miss/Teen/Mrs Worldwide 2019 at The Leela Mumbai on September 2 - 7, 2019 and won the title of Miss Teen India Worldwide 2019 title.
ఈషా కోడెకు మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ అందాల పోటీల్లో సత్తా చాటిన తెలుగు అందం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

8 September 2019
USA

 

She is one of the 7 miss teen worldwide contestants out of 39 total contestants between Miss/Teen/Mrs Worldwide pageants. The pageants represent different countries of Indian diaspora such as USA, Canada, Australia, South Africa, UAE, Oman, Fiji, Mauritius, Malaysia, India, Singapore, Hungary, Guyana, Germany, Suriname, Kenya, Guadeloupe, Costa Rica, Ireland and Nepal.

The competition was over 5 days starting from the contestants arriving in Mumbai, India on September 2, 2019 and going through rigorous practices, contestant bonding, for first 3 days followed by an evening gown competition and talent competition on September 5, 2019. The grand finale on September 7, 2019 in a grand Indian attire filled with extravagant fanfare that includes talent showcase among the down-selected top 10, 7 and 4 contestants of Miss, Mrs and Teen categories. Further Q&A round qualifies the final selection of the winners and the crowning of the top 3 in each category.

Esha performed a semi-classical dance to a Bollywood fusion melody "Naino wale..", Deepika Padukone's song from movie Padmavat. Esha selected this tune as she regards Deepika Padukone as the first Bollywood to publicly talk about the Mental Health Stigma which is close to her heart and thrives to promote awareness of the same through her non-profit organization Happy2Thrive in the future.

Esha aspires to be a pediatric cardiac surgeon and at the same time follow her passion to promote the mental health awareness. She is born into a normal Indian family that migrated to USA in the 90s and is the first generation kid growing up in a country where hard work makes your dreams come true. She loves her younger brother very much.

Congratulations Esha!!


ముంబాయి: సెప్టెంబర్ 7: అందాల పోటీల్లో తెలుగుఅందం మెరిసింది.. ప్రవాస భారతీయుల్లో ఎవరు అందాల సుందరి అనే పోటీల్లో తెలుగు ఆణిముత్యానికి కిరీటం దక్కింది. సెప్టెంబర్ 2 నుంచి7వ తేదీవరకు ముంబాయిలో జరిగిన మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 పోటీల్లో ఈషా కోడె సత్తా చాటి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.. భారతదేశం నుంచి వలస వెళ్లి వివిధ దేశాల్లో నివాసముంటున్న ప్రవాస భారతీయుల్లో యుక్త వయస్సు యువతుల మధ్య ఈ పోటీ జరిగింది. అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఓమెన్, ఫిజి, మారిషస్, మలేషియా, సింగపూర్, హంగేరి,గునియా, జర్మనీ, సురనమ్, కెన్యా, గ్వాండ్, కోస్టారికా, ఐర్లాండ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చిన యుక్త వయస్సు అమ్మాయిల మధ్య ఈ పోటీ జరిగింది. ఇలా 39 మంది ఈ పోటీల్లో పాల్గొంటే వారిలో 7 గురు మిస్ టీన్ వరల్డ్ వైడ్ కంటెస్టంట్లు ఉన్నారు. వీరిలో ఈషా కోడె కూడా ఒకరు. ఐదు రోజుల పాటు వీరి మధ్య జరిగిన పోటీల్లో ఈషా కోడె విజేతగా నిలిచి మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 టైటిల్ దక్కించుకున్నారు.

ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మొదటి మూడు రోజులు ఈవినింగ్ గౌన్ కాంపిటీషన్ జరిగింది..సెప్టెంబర్ 7 నాడు ఫైనల్ పోటీలు జరిగాయి. పోటీకి వచ్చిన వారిలో టాప్ 10, టాప్ 7, టాప్ 4 కేటగిరీలుగా చేసి వారికి క్వశ్చన్, అండ్ ఆన్సర్ రౌండ్ నిర్వహించారు. ఇందులో వారి ప్రతిభను పరీక్షించి ప్రతి కేటగిరి నుంచి ఒక్కరిని ఫైనల్ గా టాప్ త్రీకి సెలక్ట్ చేశారు. ఆ తర్వాత వీరి మధ్య కూడా పలు పోటీలు పెట్టారు. పద్మావతి సినిమాలోని దీపికా పడుకొనే పాట "నయనో వాలే" కు ఈషా కోడె నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. నిరాశ,ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో నడిచేందుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా దీపికా పడుకునే చేస్తున్న కృషి తనకు స్ఫూర్తినిచ్చిందని అందుకనే ఆమె పాటను తాను ఎంచుకున్నానని ఈషా తెలిపారు. తాను కూడా భవిష్యత్తులో ఇలాంటి హ్యాపీ2 థ్రైవ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈషా పేర్కొన్నారు.. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పిడియాట్రిక్ కార్డియక్ సర్జన్ కావాలనేది తన లక్ష్యమని వివరించారు. ఈషాకు భారతీయతపై తనకున్న మక్కువ, సేవాభావంపై ఉన్న నిబద్ధత కూడా అనుకూలంగా మారడంతో మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 కిరీటం సొంతమైంది.

ఈషా కోడె మన అచ్చతెలుగమ్మాయి.90 వ దశకంలో ఈషా కుటుంబం తెలుగునేల నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఏ దేశమేగినా ఎందుకాలిడిన మన భారతీయ వారసత్వాన్ని కాపాడుతూ.. ఆమె తల్లిదండ్రులు ఈషాను పెంచారు. మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, మానవత్వ విలువలను ఆమెకు ఒంటబట్టేలా చేశారు. ఇదే ఈనాడు ఆమె ఉన్నతికి దోహదపడింది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved