pizza
NATS Medical Camp at Shirdi Sai Baba Temple, Queens, New York
దీపావళి రోజు నాట్స్ సేవా పథం
న్యూయార్క్ లో తెలుగు వారికి ఉచిత వైద్య సేవలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

31 October 2016
USA

అమెరికాలో ఉచిత వైద్య శిబిరాలతో తెలుగువారికి ఉచిత సేవలందిస్తున్న నాట్స్  తెలుగు ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.  న్యూయార్క్ లో వరుస ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్న నాట్స్ స్థానిక తెలుగు సంఘం టీ.ఎల్.సీ.ఏ. తో కలిసి మరో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. క్వీన్స్ లోని శ్రీ  షిరిడి సాయి బాబా దేవాలయం వేదికగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 100 మందికి రోగులకు ఉచిత  వైద్య సేవలు అందించడం జరిగింది. దీపావళి పండుగ రోజు  కూడా వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉచిత వైద్య సేవలు అందించారు. ఆరోగ్య బీమా లేని ఎక్కువ మంది తెలుగువారు ఈ శిబిరానికి తరలివచ్చారు. రక్తపోటు, మధుమేహ పరీక్షలు కూడా ఈ శిబిరంలోనే నిర్వహించి వారికి కావాల్సిన  మందులను డాక్టర్లు సూచించారు. న్యూయార్క్ లోని  ప్రముఖ గుండె వైద్యులు డాక్టర్ శరత్ భూమి, ప్రవీణ పరుచూరు గుండె పరీక్షలు కూడా నిర్వహించారు. 50 ఏళ్ల వయస్సుకుపై బడిన  26 మందికి కార్డిక్, ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలు కూడా చేసి వారికి విలువైన వైద్య సేవలు అందించారు. సురేష్ సహని  ఎకో  కార్డియోగ్రామ్ మిషన్ ను దీని కోసం స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఈ పరీక్షలకు తన వంతు సహకారం అందించారు. దాదాపు వందమందికి ఇదే శిబిరంలో ప్లూ వ్యాక్సిన్ కూడా అందించడం జరిగింది. వాల్ గ్రీన్ ఫార్మసీ నాయకత్వంలో మార్వన్ ఈల్ తాబీబ్, జోసీ,లారోచ్, మన్ ప్రీత్  తదితరులు ఈ ప్లూ వ్యాక్సిన్ అందించారు.

డాక్టర్ మధు కొర్రపాటి నాయకత్వంలో శరత్ భూమి, దుర్గామద్దినేని, శైలజ కల్వ, జ్యోతి జాస్తి, ప్రవీణ పరుచూరు, జానకి కనుమిల్లి తదితర వైద్యులు రోగులకు పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు.

 సత్యం గులివిందల నాయకత్వంలో శ్రీ షిరిడి సాయి బాబా ఆలయ వాలంటీర్లు ఇక్కడ వచ్చిన వారికి టిఫిన్, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జయదేవ్ మెరుగుల, దీప్తి గులివిందల, వినీత్, డాక్టర్ శశిభూషణ్ శసపు కూడా తమ విలువైన సహకారం అందించారు. ఈ వైద్యశిబిరం కోసం పనిచేసిన విద్యార్ధులకు  వాలంటరీ సర్టిఫెకెట్లను టీఎల్ సీఏ నాయకత్వం అందించింది. సత్య చల్లపల్లి, గూడురు శ్రీనివాస్, హరీ శంకర్ రాసపుత్ర, ప్రసాద్ కోయ తదితరులు టీఎల్ సీఏ నుంచి హజరై తమ పూర్తి సహకారాన్ని మద్దతును అందించారు.

త్వరలోనే న్యూజెర్సీలో కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి  ప్లూ వ్యాక్సీనేషన్  కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు నాట్స్ తెలిపింది.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved