`
pizza

3BHK Thank You Meet
'3 BHK'కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత క్రౌడ్ చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమాని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్ యూ: 3 BHK థాంక్ యూ మీట్ లో హీరో సిద్ధార్థ్

You are at idlebrain.com > News > Functions
Follow Us


08 July 2025
Hyderabad

హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన చిత్రం జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

థాంక్ యూ మీట్ లో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రేక్షకులకు చేరిందంటే దానికి కారణం మీడియా. ముందుగా మీడియా వారందరికీ థాంక్యూ. ఒక స్వీట్ ఫిల్మ్ ని ఆడియన్స్ దగ్గరికి చేరవేశారు. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఒక క్లాసిక్ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఈ సినిమాకి ఉన్నాయి. ఈ సినిమాలో పార్ట్ కావడం గర్వంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్క్రిప్టు చదివిన వెంటనే మా నాన్నగారిని కౌగిలించుకున్నాను అని చెప్పాను. తర్వాత ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్ని రిలేట్ చేసుకునేలాగా ఉంటాయని అన్నాను. ఆ రెండిటిని ఆడియన్స్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని మెసేజ్లు పెడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ప్రతి కొడుకు థియేటర్ కి వెళ్లి తండ్రిని చూడగలుగుతున్నాడు. ప్రతి తండ్రి కొడుకుని చూడగలుగుతున్నాడు. ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం నాకు. గెలుపు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ సంతృప్తి వేరు. అలాంటి ఆనందాన్ని డైరెక్టర్ శ్రీ గణేష్ ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమాలో ప్రభు క్యారెక్టర్ లాగే నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను. ప్రభు పాత్ర చాలా విషయాలు నాకు చాలా విషయాలు నేర్పింది. ఓడిపోవడం పర్మినెంట్ కాదని డైరెక్టర్ ఈ సినిమాతో చాలా అద్భుతంగా చూపించాడు. అరుణ్ విశ్వా చాలా మంచి కంటెంట్ ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్. వారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. శ్రీ గణేష్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ గా చాలా క్లియర్ విజన్ తో ఉంటాడు. ఈ సినిమాకి రెండో రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మేము ఏపీ తెలంగాణలో థియేటర్స్ విజిట్ చేయబోతున్నాం. ఫస్ట్ వీక్ తర్వాత ఇంత క్రౌడ్ చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి చాలా థాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ కి నేను రుణపడి ఉన్నాను. శరత్ కుమార్ గారు దేవయాని గారు ఈ సినిమా చేయకపోతే ఇంత అందంగా వచ్చేది కాదు. ప్రతి ఇంట్లో ఉండే తల్లిదండ్రులని వాళ్ళు మా కళ్ళ ముందుకు తీసుకువచ్చారు. మితా చెల్లెలు క్యారెక్టర్ కి ప్రాణం పోసింది. చైత్ర నాలుగు సీన్స్ చేసి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు తీసుకుంది (నవ్వుతూ) అమృత్ రామ్నాథ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఆల్బమ్ మెమొరబుల్ గా ఉండిపోతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి ఎంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’అన్నారు

యాక్ట్రెస్ దేవయాని మాట్లాడుతూ...అందరికి నమస్కారం. ఈ సినిమాకి అద్భుతంగా సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు. చాలా గొప్ప రివ్యూస్ వచ్చాయి. సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. మంచి సినిమాని తీయడం ఒక ఎత్తు ఆ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో మీడియా వారందరికీ కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీరందరూ మా గృహప్రవేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ) విశ్వ గారు ఎక్సలెంట్ ప్రొడ్యూసర్. శ్రీ గణేష్ అద్భుతమైన ఫ్యామిలీ సినిమా ఇచ్చాడు. మా అబ్బాయి సిద్ధార్థ ఎక్సలెంట్ పర్ఫార్మర్. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఈ సినిమాతో మా అబ్బాయి సిద్ధార్థ వచ్చాడు నవ్వుతూ. ప్రభు పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ'అన్నారు.

యాక్ట్రెస్ చైత్ర మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. సినిమా చూసిన అందరికీ థాంక్యు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సిద్ధార్థ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ'అన్నారు

డైరెక్టర్ శ్రీ గణేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియా నుంచి చాలా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. రివ్యూలు చదివినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా గొప్పగా కనెక్ట్ అయింది. నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం .రాజమౌళి గారు త్రివిక్రమ్ గారు సుకుమార్ గారు ఇలా అందరూ దర్శకులు వర్క్ నాకు ఇష్టం. వాళ్ళందరి నుంచి నేను స్ఫూర్తిని పొందాను. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా టీమ్ అందరికీ థాంక్యూ .చంద్రబోస్ గారు అద్భుతమైన పాట ఇచ్చారు. రాకేందు మౌళి తెలుగులో చాలా అద్భుతమైన మాటలు రాశారు. మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. సినిమాని చాలా గొప్పగా రిలీజ్ చేశారు. సినిమా గ్రాండ్ గా రీచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాకు జెర్సీ సినిమా చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సందర్భంగా నాని గారికి డైరెక్టర్ గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు తమిళ్ సినిమా. ఇంత గొప్ప సినిమాతో కెరీర్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పాటలు చాలా ఎమోషనల్ కనెక్షన్స్ తో ఉంటాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంతో పాట విన్నప్పుడు ఒక సోల్ ఫుల్ కనెక్షన్ వచ్చింది. ఆ బ్యూటీ తెలుగులో వుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి థాంక్యూ. ఈ సినిమా నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. సినిమాకి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ'అన్నారు.

నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా రిలీజ్ అయి అయిదో రోజు ఇది. తమిళ్ తెలుగులో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇంకా అద్భుతంగా పిక్ అప్ అవుతుంది. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు నుంచి చాలా అద్భుతమైన మెసేజ్లు వస్తున్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సిద్ధార్థ తో నాకు చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. మేము భవిష్యత్తులో కలిసి ఇంకెన్నో సినిమాలు చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved