30 April 2015
Hyderaba
Puri Jaganandh launches 'Andhra Pori' first song at Radio Mirchi
A song of Aakash Puri's debut movie as hero,'Andhra Pori', was launched on Thursday at Radio Mirchi in Hyderabad.
Puri Jagannadh, who attended the event as chief guest, launched the song. Director Raj Madiraju, Aakash Puri, cinematographer Praveen Vanamali, Mahesh Chadalavada etc attended the event. Dr.Josyabhatla is the music director of this film and Ramesh Prasad is producing it under Prasad Productions banner.
Puri said, "When director Raj Madiraju narrated this story, I liked it very much. It is a teenage love story. I like 'Seethakoka Chiluka' movie very much and 'Andhra Pori' is such a love story. I am very happy that Raj Madiraju is introducing my son with this film. The audio is releasing through Aditya Music. I launched the 'Detthadi song now, which is one of my favourites in this album along with the title song. Suddala Ashok Tej penned the lyrics for this song. I hope 'Andhra Pori' will be a big hit'".
Raj Madiraju said, "I thank Puri Jagannadh sir for giving me Aakash and also for launching the first song. So much happened in between. Puri sir gave me a very good confidence that we can make a mass entertainer with a good teenage love story. Aakash Puri is a very obedient and lovely boy.I hope this film will be successful. I thank everyone who supported us".
Aakash said, "I thank director Raj Madiraju and Ramesh Prasad sir for giving me opportunity to act in this film. I also thank my dad for everything. We launched the Detthadi song today and it is a wonderful song. Josyabhatla gave very good tunes".
Ulka Gupta is the lead actress in this movie. Poornima, Eeshwari Rao, Aravind Krishna, Srimukhi, Uttej, Abhinaya, Sri Teja etc form the cast.
Music : Dr.Josya Bhatla, Art : Rajeev Nair, Editor : Srikar Prasad, Cinematography : Praveen Vanamali, Dance : Chandrakiran, Lyrics : Ramajogaiah Sastry, Suddhala Ashok Teja, Kittu Vissapragada, Krishna Madineni, Producer : Ramesh Prasad, Director : Raj Madiraju, PRO : Surendra K Naidu, Production designer : Mahesh Chadalavada, Publicity designer : Eeshwar Andhe
ఆంధ్రాపోరి’ సాంగ్ రిలీజ్ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూతన చిత్రం ‘ఆంధ్రాపోరి’. రమేష్ ప్రసాద్ నిర్మాత. రాజ్ మాదిరాజు దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జోశ్యభట్ల సంగీతం అందించిన ఈ సినిమాలోని తొలి పాటను ముఖ్య అతిథిగా పాల్గొన్న డాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురువారం హైదరాబాద్ లోని రేడియో మిర్చి సెంటర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘’డైరెక్టర్ రాజ్ మాదిరాజ్ నాకు స్టోరి చెప్పగానే బాగా నచ్చింది. ఇదొక టీనేజ్ లవ్ స్టోరి. నాకు చిన్నప్పుడు సీతాకోకచిలుక మూవీ బాగా నచ్చేది. అలాంటి ఒక ప్రేమకథా చిత్రమే ఆంధ్రాపోరి. రాజ్ మాదిరాజ్ దర్శకత్వంలో ఆకాష్ ఇంట్రడ్యూస్ కావడం చాలా ఆనందంగా ఉంది. జోశ్యభట్ల అందించిన సంగీతం బావుంది. ఈ ఆల్బమ్ లో నాకు ఇఫ్టమైన దేతడి... సాంగ్ ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. అలాగే టైటిల్ సాంగ్ కూడా నాకు బాగా ఇష్టం. సుద్ధాల అశోక్ తేజ్ గారు మంచి లిరిక్స్ ను అందించారు. ఆడియో, సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలవుతుంది’’ అన్నారు.
దర్శకుడు రాజ్ మాదిరాజ్ మాట్లాడుతూ ‘’పూరి జగన్నాథ్ గారికి థాంక్స్ ఎందుకంటే ఆకాష్ ను నా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు అలాగే ఈ సాంగ్ విడుదల చేసినందుకు. ఈ సినిమా రూపకల్పనలో పూరి జగన్నాథ్ గారు అందించిన సపోర్ట్ ను మరచిపోలేం. ఆయన అందించిన సపోర్ట్ తోనే మంచి మాస్ ఎంటర్ టైనర్ అయిన టీనేజ్ లవ్ స్టోరిని రూపొందించగలిగాం. ఇక ఆకాష్ పూరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందు సినిమాని తీసుకువస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.
ఆకాష్ పూరి మాట్లాడుతూ ‘’’మంచి టీనేజ్ లవ్ స్టోరి. మంచి రోల్ చేశాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ రాజ్ మాదిరాజ్ గారికి థాంక్స్. అలాగే నాన్నగారి సపోర్ట్ మరిచిపోలేం. ఆయనకి థాంక్స్. జోశ్యభట్ల మంచి మ్యూజిక్ అందించారు. దేత్తడి.. సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మ్యూజిక్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, మహేష్ చదలవాడ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె, పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు,సంగీతం: డా.జె., ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల,నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్.