pizza
Aditya Music Launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 November 2014
Hyderabad

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టి .రాజయ్య చేతులమీదుగా 'ఆదిత్య'(క్రియేటివ్ జీనియస్ ) ఆడియో విడుదల

నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ 'ఆదిత్య' ఆడియో రాయదర్గ లోని ఒయాసిస్ స్కూల్ అఫ్ ఎక్స్లెన్స్ లో వందలాది విద్యార్దుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి టి.రాజయ్య హాజరుకాగా ,

హై కోర్ట్ న్యాయ మూర్తి బి .చంద్ర కుమార్, నటుడు సుమన్, జాకి, ఒయసిస్ స్కూల్ కార్యదర్శి పి.సుబ్బా రెడ్డి,

ఒయసిస్ స్కూల్ కరెస్పాండంట్ డాక్టర్ .యన్.బి.సుదర్శన్ ఆచార్య , స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి కామేశ్వరి పాల్గొన్నారు . ఈ కార్యక్రమాని నిర్వహించిన ఆదిత్య చిత్ర నిర్మాత , దర్శకులు భీమగాని సుధాకర్ గౌడ్ అతిడులను ఆహవ్నించి పూల మాలలతో సత్కరించారు.

ముందుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టి .రాజయ్య ' ఆదిత్య ' ఆడియో సిడి ని విడుదల చేసి, హై కోర్ట్ న్యాయ మూర్తి బి .చంద్ర కుమార్ కు అందచేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ఈ చిత్ర ప్రారంబం మరియు ఈ రోజు ఆడియో రిలీజ్ నా చేతుల మీదుగా జరగడం చాల ఆనందంగా వుంది. మిత్రుడు సుధాకర్ గౌడ్ ఎంతో డబ్బు హెచిన్చి చిన్న పిల్లలతో కస్టపడి ఈ చిత్రాన్ని తీసాడు. తప్పక ప్రజాదరణ పొందుతుందని నా నమ్మకం. చిత్ర కథ గురించి నాకు చెప్పాడు. మన సమాజంలో రేపటి పౌరులుగా నిలబడే ఈనాటి విద్యార్దులు ఎలా ప్రయోజకులు గా తీర్చి దిద్దవలసిన భాద్యత ఉపాధ్యాయులది. అలాంటి భాద్యత చిత్ర రూపం అందిస్తున్న సుధాకర్ అభినందనీయుడు. ఇక్కడ పిల్లలే కాదు వాళ్ళ తల్లి దండ్రులు కూడా వున్నారు కాబట్టి చెపుతున్నాను. పిల్లల లోని దాగివున్న సృజనను మీరు కూడా వెలికి తీయడానికి ప్రయత్నిచండి. వాళ్ళ జీవిత లక్షం ఏమిటో గ్రహించండి. వాళ్ళలో వున్నా కృషి పట్టుదలకి మీ సహకారం అందిచండి. రేపు తప్పక మన దేశానికీ అభివృద్ధి పదం లో నడిపే పౌరుడిగా పేరు తెచుకుంటాడు. అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ - ఇక్కడకు వచ్చిన విద్యార్దులకు పేరెంట్స్ కు అభినదనలు. మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్ లో జాయిన్ చేసాము మా భాద్యత ఆయిపాయింది. అను కోకండి. ఇక్కడ టీచర్స్ ఉంటారనుకోండి. వాళ్ళు చెప్పే చదువు చెపుతారు కాని పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం మర్కల్ తెచుకుంతున్నారు. అని మీరు అప్పుడప్పుడు స్కూల్ కి వచ్చి పరిసిలించాలి.నా ఫ్రెండ్ సుధాకర్ గౌడ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా లో నేను చాల ముఖ్య మైన పాత్ర పోసిస్తున్నాను. నేను చాల సినిమాల్లో చేశాను కాని చిన్న పిల్లలు నటించిన చిత్రం లో చేయలేదు. ఈ చిత్రం ద్వార నా కోర్కె నెరవేర్చారు సుధాకర్. ఆయనకు థాంక్స్. మంచి కథతో సమాజానికి ఒక సందేశం ఇచే కథ ఇది. పిల్లలు నా మీద ఒక పాటకూడా చిత్రీకరించారు. పాటలో చైల్డ్ లేబర్ లేకుండా చేయడం. మురికివాడ వున్నా పిల్లలు కూడా చదవాలి అనే సారంశం తో వస్తుంది ఆ పాట. నేను టి కృష్ణ గారి చిత్రాల్లో నటించిన అనుభూతి మళ్లి చిత్రంతో పొందాను. వందేమాతరం గారి మ్యూజిక్ లో అద్బుత మైన లిరిక్స్ అందించారు, మంచి లొకేషన్స్ లో భాగ కర్చుపెట్టి తీసారు అన్నారు.

నిర్మాత దర్శకుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ఈ ఆడియో ఫంక్షన్ కు విచేసిన అతిదులకు ఈ కార్యక్రమాని ఇంత ఘనంగా జరుపుకునేందుకు సహకరించిన ఒయాసిస్ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కి విద్యార్దులకు నా థాంక్స్ . ఈ భూమిది కులం ఆ ఆకాశానిది మతం కులము మతము లేనేలేదు మనమంతా భారతీయులం. ఇది నా సినిమా అని గొప్పగా చెప్పడం లేదు. ఇది మనందరి సినిమా అని గట్టిగ చెప్పగలను. ఎందుకంటె మనం పెద్దవారం మనం ఏమిచేసిన మన పిల్లల కోసం కస్తాపడతము. ఒక విద్య సంస్త్ర అదినేత గా ఈ చిత్రం ద్వార ఒక మంచి జరగాలని సాధుధ్యుసం తో బడ్జెట్ కి వెనుకాడకుండా, చిన్న పిల్లల సినిమా ఏ కదా అని తక్కువ బడ్జెట్ తో వస్తున్న చిత్రం కాదు ఇది.

మెసేజ్ వున్నా పక్క కమర్షియల్ చిత్రం అందుకనే కొత్తగా పరిచయం చేసిన పిల్లలతో పాటు పాత్రలకి సరిపడా నటినటులను ఎంపిక చేసుకున్నాను. బ్రహ్మనడం గారు యమ్.ఎస్ . నారయనగారు, సుమన్ ఆశిష్ విధ్యార్ది. లాంటి వారితో ఈ సినిమా చేశాను. ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారం లో విడుదల చేస్తాము . ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల్లో అన్ని పాటశాలలో ఈ చిత్రాన్ని ప్రదశిస్తము. ఎందుకంటె విధ్యార్ది దశలో స్కూల్స్ ఎలాంటి భాద్యత వహించాలో తెలిపే చిత్రం ఇది. ఒక పతంశ్యం ఇది. మెసేజ్ ఓరి య మ్ టాడ్ చిత్రం అయిన ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని వున్నాయి. మంచి సాంగ్స్ , కామెడీ , వుంది . ఈ చిత్రం తప్పక ప్రజాదరణ పొందుతుందని నా నమ్మకం అన్నారు.

అనంతరం అతిదులను చిత్ర నిర్మాత దర్శకుడు సుధాకర్ గౌడ్ సాలువాలతో శిల్ద్ లతో సత్కరించారు. అంకర్, నటి అనిత చౌదరి వ్యక్యతగా వ్యవహరించిన ఈ సభలోహై కోర్ట్ న్యాయ మూర్తి బి .చంద్ర కుమార్, జాకి, ఒయసిస్ స్కూల్ కార్యదర్శి పి.సుబ్బా రెడ్డి,ఒయసిస్ స్కూల్ కరెస్పాండంట్ డాక్టర్ .యన్.బి.సుదర్శన్ ఆచార్య , స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి కామేశ్వరి మాట్లాడారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved