pizza
Ammayi Aaruguru music launch
అమ్మాయి ఆరుగురు  ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

05 March 2016
Hyderabad

రామచంద్ర, ఆశాలత జంటగా అక్షయ్ ప్రత్యూష ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జి.మురళీ ప్రసాద్ దర్శకత్వంలో రామచంద్ర దోసపాటి నిర్మాతగా రూపొందిన చిత్రం అమ్మాయి ఆరుగురు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ బసిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ సినిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి, సాయివెకంట్, ఆశాలత, నిర్మాత రామచంద్ర దోసపాటి, దర్శకుడు జి.మురళి ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ వడ్డేల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

బెక్కంవేణుగోపాల్ ఆడియో సీడీలను విడుదల చేయగా తొలి సీడీని బసిరెడ్డి అందుకున్నారు.

సాయివెంకట్ మాట్లాడుతూ ‘’చిన్న సినిమా అయినా చక్కగా తీశారు. డైరెక్టర్ మురళితో మంచి పరిచయం ఉంది. అన్నీ విభాగాలను బాగా హ్యండిల్ చేయగలడు. తనతో త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమా చేస్తాను. పాటలు చాలా బావున్నాయి. వందేమాతరంగారు మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ ‘’సినిమాను తెరకెక్కించిన చిత్రయూనిట్ సభ్యులకు దర్శక నిర్మాతలకు సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’అన్నారు.

బసిరెడ్డి మాట్లాడుతూ ‘’మురళి చాలా కష్టపడే తత్వమున్న వ్యక్తి, ప్రతిభావంతుడు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘’నా బ్యానర్ లో నేను కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటాను. నా ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో కూడా చాలా మంది కొత్తవారికి సపోర్ట్ చేశాం. ఇప్పుడు వారందరూ మంచిపోజిషన్ ఉన్నారు. ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు మురళి స్క్రిప్ట్ వర్క్ బాగా చేస్తాడు. ప్రొత్సాహం అవసరం, ఆడియో, సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుతున్నాను’’ అన్నారు.  

దర్శకుడు మురళి ప్రసాద్ మాట్లాడుతూ’’ రెండు సినిమాలు చేశాను. మూడ సినిమా మంచి కథ కుదిరింది. అందరి మిత్రుల సహకారంతో సినిమాను అనుకున్న సమయంలో విడుదల చేస్తున్నాం. బసిరెడ్డిగారు డిజిటల్ మీడియా పరంగా ఫుల్ సపోర్ట్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్ గారు మంచి సంగీతం అందించారు. మంచి హర్రర్ కాన్సెప్ట్ మూవీ. ఆరుగురు డబ్బున్న అబ్బాయిలు ఓ జంటను చంపేస్తారు. ఆ జంటలో అమ్మాయి దెయ్యంగా మారి ఆరుగురు యువకులపై ఎలా ప్రతీకారం తీర్చుకునిందనేదే కథ. యాక్టర్స్ తో పాటు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ బాగా సపోర్ట్ చేశారు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’’అన్నారు.

జూ.రేలంగి, రవి, మాస్టర్ అక్షయ్, జబర్ దస్త్ రాము, శ్రీనివాసరెడ్డి, రసూల్, యన్.యమ్.నజీర్, శేఖర్ బాబు, మునీంద్ర, అంజలి, శోభ, చంద్రమౌళి, కౌశిక్, కామాక్షి, పూనమ్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కథ-అక్షయ్ ప్రత్యూష ఎంటర్ టైన్మెంట్స్, మాటలు- సాయికుమార్ రెడ్డి, కెమెరా- వడ్డేల్లి సుధీర్, ఎడిటర్- నందమూరి హరి, సంగీతం- వందేమాతరం శ్రీనివాస్, ఆర్ట్ – వెంకటేష్, నిర్మాత, పర్యవేక్షణ – రామచంద్ర దోసపాటి, దర్శకత్వం – జి.మురళిప్రసాద్. 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved