pizza
Black Money music launch
"బ్లాక్ మనీ" (అన్నీ కొత్త నోట్లే) ఆడియో విడుదల !!
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 April 2017
Hyderabad

"జనతా గ్యారేజ్, మన్యం పులి" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, "లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో" వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితురాలైన బ్యూటీ క్వీన్ అమలాపాల్ జంటగా నటించగా.. మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో "బ్లాక్ మనీ" పేరుతో అనువదిస్తుండడం తెలిసిందే.

మలయాళంలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన జోషి ఈ చిత్రానికి దర్శకుడు. "అన్నీ కొత్త నోట్లే" అన్న "ట్యాగ్ లైన్"తో.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని "మ్యాజిన్ మూవీ మేకర్స్" పతాకంపై యువ నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాతగా ఇది ఈయనకు తొలి ప్రయత్నం. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చారు. టీవీ మీడియా నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తి కలిగించే కథ-కథనాలతో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో 86 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

రితీష్ వెగా-అభిషేక్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైంది. స్వతహా రచయిత అయిన ఈ చిత్ర నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రంలో ఒక పాట కూడా రాయడం విశేషం. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి మంతు వినోద్ కుమార్ రెడ్డి సహ నిర్మాత.

ఫిలిం ఛాంబర్ ప్రివ్యూ ధియేటర్ లో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో.. చిత్ర నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్, సంభాషణల రచయిత వెన్నెలకంటి, ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి), ప్రముఖ యువ కథానాయకి సోనీ చరిష్టా పాల్గొన్నారు. ఆడియో బిగ్ సీడీని సోనీ చరిష్టా ఆవిష్కరించగా.. ధియేటర్ ట్రైలర్ మరియు ఆడియో సీడీలను బెక్కెం వేణుగోపాల్ (గోపి) విడుదల చేశారు.

మ్యాజిన్ మూవీ మేకర్స్ అధినేత-చిత్ర నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ.. "సినిమా తీయడం కంటే.. విడుదల చేయడం చాలా కష్టంగా ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో నా మిత్రుడు నీలం కృష్ణారెడ్డి (ఎన్ కే ఆర్) సహాయసహకారాలతో "బ్లాక్ మనీ" చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేస్తున్నాం. మలయాళంలో 86 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది. వెన్నెలకంటి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ" అన్నారు.

ముఖ్య అతిధి బెక్కెం వేణుగోపాల్(గోపి) మాట్లాడుతూ.. "సయ్యద్ నిజాముద్దీన్ వంటి ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్స్ పరిశ్రమకు చాలా అవసరం. స్వతహా రచయిత కూడా అయిన సయ్యద్ నిర్మాతగా బ్రహ్మాండంగా రాణిస్తారనే నమ్మకం ఉంది. మోహన్ లాల్ నటించే సినిమాలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మళయాళంలో జోషి ఎంత పెద్ద దర్శకుడో చెప్పనవసరం లేదు. ఈనెల 21న విడుదలవుతున్న "బ్లాక్ మనీ" ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను" అన్నారు.

మాటల రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరూ తమ సినిమా చాలా భిన్నమైన సినిమా అని చెబుతారు. కానీ.. "బ్లాక్ మనీ" నిజంగానే అత్యంత భిన్నమైన సినిమా. మీడియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధిస్తుంది. స్వతహా రైటర్ అయి ఉండి.. ఈ సినిమాలో ఉన్న పాటను అద్భుతంగా రాసిన సయ్యద్ గారు.. కావాలంటే మాటలు కూడా తానే రాసుకోవచ్చు. కానీ నాకీ అవకాశం ఇచ్చారంటే.. దాన్ని బట్టి సినిమా పట్ల ఆయనకు గల ప్రేమాభిమానాలు అర్ధం చేసుకోవచ్చు" అన్నారు.

ప్రముఖ యువ కథానాయకి సోనీ చరిష్టా మాట్లాడుతూ.. "సినిమాల పట్ల అవగాహన కల్పించుకోవడానికి.. డబ్బింగ్ సినిమాతో ఎంటరవుతున్న సయ్యద్ గారికి.. రేపు 21న రిలీజ్ అవుతున్న "బ్లాక్ మనీ" చిత్రంతో మంచి డబ్బులొచ్చి.. అతి త్వరలోనే స్ట్రెయిట్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు!!


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved