16 July 2016
Hyderabad
ఆది, నమిత ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వరలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ బ్యానర్స్‌పై వీరభద్రం దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్, సాయికుమార్, కొరటాల శివ, కోనవెంకట్, అనిల్ రావిపూడి, రఘుబాబు, జీవిత, రాజ్‌తరుణ్, బి.వి.ఎస్.రవి, సుధీర్‌బాబు, కె.కె.రాధామోహన్, సందీప్‌కిషన్, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. కొరటాల శివ తొలి ఆడియో సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా....
తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ - ''ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది. దర్శకుడు వీరభద్రం, నిర్మాతలు వెంకట్, రామ్, థమన్, ఆది, సాయికుమార్‌గారు సహా అందరికీ అభినందనలు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్ర నిర్మాతల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. అందరికీ మంచి బ్రేక్ వచ్చే సినిమా అవుతుంది. ఇప్పటి యంగ్‌స్టర్స్ లో చాలా టాలెంట్ ఉంది. అందరినీ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత దర్శకులకు ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీకి తన సహాయ సహకారాలను అందిస్తుంది. చిన్న సినిమాల కోసం ప్రభుత్వం ఐదవ ఆటను కేటాయిస్తుంది, అలాగే సింగిల్ విండో సిస్టంను తీసుకొచ్చాం. అలాగే శ్రీమంతుడులాంటి సినిమా తీసిన కొరటాల, ఇప్పుడు జనతాగ్యారేజ్ సినిమా చేస్తున్నారు. ఆయన చిన్న హీరోలను కూడా ఆయన ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. ఆదికి మంచి టాలెంట్ ఉంది. బాగా ఫైట్స్, డ్యాన్సులు చేస్తున్నాడు. ప్రభుత్వం ఇండియన్ సినిమాను హైదరాబాద్‌లో తీసేలా ప్రిపేర్ అయ్యి ఉందని తెలియజేస్తున్నాను. ఒక్కొక్కటిగా నేరవేరుస్తూ వస్తున్నాం. టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ - ''సినిమా పెద్ద విజయం సాధించాలని, ఆది కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ - ''ప్రేమకావాలి అంటూ ఆది మీ ముందుకు వచ్చిన చుట్టాలబ్బాయి ఆదికి ఇది ఎనిమిదవ సినిమా. వీరభద్రం నాకు ఇష్టమైన దర్శకుడు. నేను, ఆది ఎప్పటినుండో కలిసి పనిచేయాలి, అయితే మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ స్క్రిప్ట్ వచ్చింది. కలిసి చేశాం. కుటుంబ మంతా కలిసి చూసే సినిమా. థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. నమిత చాలా మంచి పెర్‌ఫార్మెన్స్ చేసింది. నిర్మాతలిద్దరూ రామలక్ష్మణులు. వారి రామబాణంలాంటి ఈ సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
ఆది మాట్లాడుతూ - ''వీరభద్రంగారు ఒకటిన్నర సంవత్సరంపాటు కష్టపడి సినిమాను చేశారు. ఆయనే ఇద్దరు నిర్మాతలను తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేశారు. సూపర్‌హిట్ కొడుతున్నామనే పాజిటివిటీతో సినిమాను డైరెక్ట్ చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. ఇది నా ఎనిమిదో సినిమా. థమన్ రిథమ్‌కు డ్యాన్స్ చేయాలనుకున్న కోరిక ఈ సినిమాతో తీరింది. నాన్నతో కలిసి సినిమా చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం'' అన్నారు.
Namitha Pramod Glam gallery from the event |
|
|
|
వీరభద్రం మాట్లాడుతూ - ''తొలిసారి సాయికుమార్‌గారు, ఆది కలిసి నటించారు. ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పూలరంగడు, అహ నా పెళ్ళంట సినిమా తర్వాత అలాంటి ఎంటర్‌టైనింగ్ సినిమాల తరహాలో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.
నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ - ''చాల ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఆదికి, వీరభద్రంగారికి థాంక్స్. చాలా కష్టపడి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం'' అన్నారు.
రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ - ''చుట్టాలబ్బాయి నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. ఇలాంటి సినిమాలను ఎన్నింటినో చేయాలని కోరుకుంటున్నాం. వీరభద్రంగారు డేడికేషన్, ఎఫర్ట్ తో సినిమా చేశారు. కష్టపడి, ఇష్టపడి సినిమాను చేశాం, సినిమా బాగా వచ్చింది'' అన్నారు.
రఘుబాబు మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో హీరో తింగర బాబాయ్ క్యారెక్టర్‌లో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. చాలా రోజుల తర్వాత డైరెక్టర్ వీరభద్రంగారు అందరూ చూడదగ్గ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాతలు కేవలం సినిమాపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చారు. మంచి సినిమా చేయాలని వారు చేసిన ప్రయత్నమే 'చుట్టాలబ్బాయి'. ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం'' అన్నారు.
కోనవెంకట్ మాట్లాడుతూ - ''ఒక పిక్చర్ సక్సెస్ ఆడియో ఫంక్షన్‌లోని పాజిటివ్ వైబ్‌ను చూసి చెప్పవచ్చు. వీరభద్రం ఈ సినిమాకు చుట్టాలబ్బాయి అనే టైటిల్ ఎందుకు పెట్టాడో కానీ ఆది నిజంగానే నాకు చుట్టాలబ్బాయే. యూనిట్‌కు, వీరభద్రంకు,నిర్మాతలకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ''సాయికుమార్‌గారితో పటాస్ సినిమా నుండి మంచి ర్యాపో ఉంది. జయాపజయాలకు అతీతంగా ఆది నటుడుగా ఎదుగుతున్నాడు. ఈ సినిమా తనకు మంచి బ్రేక్ కావాలి. వీరభద్రంగారు మంచి కామెడి టైమింగ్ ఉన్న దర్శకుడు. తనతో సహా నిర్మాతలు, యూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి'' అన్నారు.
బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ - ''ఈ సినిమాకు నాకు స్పెషల్. ఎందుకంటే నేను, వీరభద్రం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. కామెడి, సెంటిమెంట్‌పై మంచి గ్రిప్ ఉన్న దర్శకుడు. సాయికుమార్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. పాజిటివ్ టైటిల్‌తో విడుదలవుతున్న ఈ చిత్రం నిర్మాతలకు మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
రాజ్‌తరుణ్ మాట్లాడుతూ - ''సాయికుమార్‌గారు, ఆది కలిసి యాక్ట్ చేసిన ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆదికి సినిమాలంటే ప్యాషన్. తనకు చాలా మంచి పేరు తెచ్చే సినిమా కావాలి. దర్శక నిర్మాతలకు హిట్ తెచ్చే చిత్రం కావాలి. అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
సుధీర్‌బాబు మాట్లాడుతూ - ''ఆది తన టాలెంట్‌ను ఎక్కడా ఫుల్‌గా ఉపయోగించినట్లు అనిపించలేదు. ఈ సినిమాలో వీరభద్రంగారు ఆదిలోని టాలెంట్‌ను ఫుల్‌గా వాడుకున్నట్లు కనపడింది. దర్శక నిర్మాతలు సహా టీంకు అభినందనలు''అన్నారు.
కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''సాంగ్స్, ట్రైలర్ చూస్తుంటే నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపిస్తుంది. ఆది వెర్సటెయిల్ ఆర్టిస్ట్. సాయికుమార్‌గారు, ఆది కలిసి చేసిన సినిమా. వీరభద్రంగారు అన్నీ ఎలిమెంట్స్‌ను చూపించగల దర్శకుడు. అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
సందీప్‌కిషన్ మాట్లాడుతూ - ''ఆది రీసెంట్ ఫిలింస్‌లో బెస్ట్ ఫిలింగా ఇది నిలుస్తుంది. ఆదిని వీరభద్రంగారు చక్కగా చూపించారు. మంచి నిర్మాతలు. థమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ''నిర్మాతలు కొత్తవారు. వారికి ఈ సినిమా సందర్భంగా స్వాగతం చెబుతున్నాను. సినిమాను రిచ్‌గా నిర్మించారు. ఆది కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుంది. దర్శకుడు వీరభద్రంకు ఈ సినిమా మంచి సినిమాగా నిలుస్తుంది. ఎంటైర్ టీంకు బెస్ట్ విషెష్'' అన్నారు.
జీవిత మాట్లాడుతూ - ''సాయికుమార్‌గారికి, మా కుటుంబానికి ఉన్న రిలేషన్ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాను ఆడియెన్స్ పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను'' అన్నారు.
ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ - ''ఆదితో ఎప్పుడో పని చేయాల్సింది కానీ కుదరలేదు. ఈ సినిమాతో తనతో పనిచేసే అవకాశం కలిగింది. ఆది ఫెంటాస్టిక్ డ్యాన్సర్. లవ్ లీ సినిమా కానీ, ఈ సినిమా కానీ తన డ్యాన్సులకు మంచి పేరు తెస్తుంది. వీరభద్రంగారు మంచి వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం మరచిపోలేని జర్నీ. నిర్మాతలు వెంకట్, రామ్‌లు అమెరికా నుండి ఇక్కడకు వచ్చి సినిమా చేశారు, వారికి అభినందనలు. రామజోగయ్యగారు, వరికుప్పల యాదగిరి మంచి సాహిత్యాన్ని అందించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలకశంకర్, చమ్మక్ చంద్ర, రచ్చరవి, గిరిధర్, అనితనాథ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవాని ప్రసాద్, నిర్మాతలు: వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్.