pizza
Dhada Puttistha music launch
`ద‌డ పుట్టిస్తా` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 July 2016
Hyderabad

నాయ‌ని పృథ్వి రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో పి.జె.ఆర్‌, ఎన్‌.పి.ఆర్ క్రియేటివ్ వ‌ర్క్స్‌, లికి డ్రీమ్‌, స‌త్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం `ద‌డ‌పుట్టిస్తా`. విన్ని వియాన్‌, నేహ‌, హ‌రిణి, ఆన్య హీరో హీరోయిన్లుగా హ‌రీష్‌.ఇ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఎ.థామ్స‌న్ మార్టిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా....

కొడాలి నాని మాట్లాడుతూ ``ఒక మంచి టీం క‌లిసి చేసిన ఈ ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్ కావాలి. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటూ యూనిట్‌ను అబినందిస్తున్నాను`` అన్నారు.

హ‌రీష్.ఇ మాట్లాడుతూ ``నాకు ద‌ర్శ‌కుడుగా తొలి ప్ర‌య‌త్నం హీరో హేమంత్(విన్ని వియాన్‌) నన్ను న‌మ్మి నాకు అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

విన్ని వియాన్ మాట్లాడుతూ ``మంచి ల‌వ్ ఎంట‌ర్ టైన‌రే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. సినిమా బాగా వ‌చ్చింది. స‌హ‌కారం అందించిన యూనిట్ స‌భ్యుల‌కు థాంక్స్‌`` అన్నారు.

Glam galleries from the event

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.థామ్స‌న్ మార్టిన్ మాట్లాడుతూ ``సంగీతం అందించ‌డానికి మంచి స్కోప్ ఉన్న మూవీ. అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``హీరో హేమంత్‌తో నాకు చాలా కాలంగా మంచి ప‌రిచ‌యం ఉంది. త‌ను డిస్ట్రిబ్యూష‌న్‌తో పాటు ఎగ్జిబిట‌ర్‌గా కూడా వ‌ర్క్ చేసేవాడు. ఈ సినిమాతో హీరోగా కూడా మారాడు. ఈ సినిమాకు త‌న‌కు మంచి పేరును తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సి.జె.శోభ మాట్లాడుతూ ``సాంగ్స్ బావున్నాయి. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ధ‌న‌రాజ్‌, వ‌ర్ష‌, క్రాంతి కిర‌ణ్‌, ధీర‌జ్‌, నాయిని పృథ్విరెడ్డి, వంశీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved