pizza
Dhana Dhan music launch
‘ధనాధన్’ పాటలు విడుదల

‘ధనాధన్’ పాటలు విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 February 2016
Hyderabad

తమిళంలో విజయవంతమైన ఢమాల్ ఢమాల్ చిత్రాన్ని మూవీ మేకర్స్ బ్యానర్ పై తెలుగులో ధనాధన్ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. వైభవ్, రమ్యా నంబీశన్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీ దర్శకుడు. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని నిర్మాతలు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు. నాగబాబు ఆడియో సీడీలను ఆవిష్కరించగా, తొలి సీడీని కోదండరామిరెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా...

నాగబాబు మాట్లాడుతూ ‘’నిర్మాతల్లో ఒకరైన శివ నాకు పరిచయస్థుడే. ఈ సినిమా హక్కులు తీసుకునే ముందు నాకు చెప్పాడు. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. తమిళంలో సక్సెస్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. తమిళంలో విజయం సాధించిన ఈచిత్రం తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.

కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘’తమిళంలో ఢమాల్ ఢమాల్ అనే పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ వైభవ్ కు మంచి పేరును తెచ్చింది. ఇప్పుడు ధనాధన్ పేరుతో తెలుగులో విడుదలవుతున్న ఈ చిత్రం ఇక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధించాలి. దర్శక నిర్మాతలకు లాభాలు రావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

నిర్మాతలు శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో క్వాలిటీ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాం. నాగబాబుగారు ఎంతో అండగా నిలబడ్డారు. తెలుగులో సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నాం. తమిళంలోలాగానే తెలుగులో కూడా సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుందనుకుంటున్నాం’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, మల్టీడైమన్షన్ వాసు, సురేష్ కొండేటి, చేతన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే, చార్లీ, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్.థమన్, పాటలు: రాణీ పులోమజాదేవి, మాటలు: శివపార్వతి, నిర్మాతలు: శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని, కథ, దర్శకత్వం: శ్రీ.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved