బల్లెం వేణుమాధవ్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోప్యం'. 'ది సీక్రెట్' అనేది ఉపశీర్షిక. మాస్టర్ తరుణ్, ఇందు, ప్రియ, అనూష, నజియా ప్రధాన పాత్రధారులుగా తరుణ్ క్రియేషన్స్ పతాకంపై ఆర్.రఘు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటకిరిటీ డా.రాజేంద్రప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్రసమితి ప్రత్యేక ప్రతినిధి, మాజీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ డా.సముద్రాల వేణుగోపాలాచారి, బల్లెం వేణుమాధవ్, మాస్టర్ తరుణ్, లయన్ సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా....
పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ - ``బల్లెం వేణుమాధవ్‌తో నాకు బ్రదర్‌లాంటివాడు. ఈ సినిమాలో నటించిన తరుణ్ చాలా చిన్నవాడైనా ఎంతో ఈజ్‌తో నటించాడు. పాటలన్నీ బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ``సినిమాకు గోప్యం పనికిరాదు. అంతా ఓపెన్‌గా ఉండాలి. నటుడుగా నాకిది 40వ సంవత్సరం. నేను ఇంతకాలం కొనసాగుతున్నానంటే బల్లెం వేణుమాధవ్ వంటి వాళ్ళే కారణం. నాకు తమ్ముడు కంటే ఎక్కువ. తన దర్శకత్వం చేస్తూ నటించిన గోప్యం సినిమాలో పాటలు బావున్నాయి. సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలి. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
తరుణ్ మాట్లాడుతూ - ``గోప్యం సినిమాను ఎక్కవ కష్టపడి తీశాం. మెయిన్ లీడ్ చేశాను. నిర్మాత రఘుగారు నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. బల్లెం వేణుమాధవ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులకు నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుంది`` అన్నారు.
బల్లెం వేణుమాధవ్ మాట్లాడుతూ - ``తరుణ్ ఒక మ్యాజిక్. రఘుగారు రైటర్‌గా నన్ను పిలిచారు. ఓరోజు డైరెక్షన్ నన్నే చేయమని అన్నారు. అయితే నా స్వంత సంస్థలు ఉన్నాయని ఆయనతో అన్నాను. ఆయన మాటపై గౌరవంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించాను. రఘుగారు నిర్మాతగానే కాదు, దర్శకత్వ శాఖలో కూడా పనిచేశారు`` అన్నారు.
నిర్మాత రఘు మాట్లాడుతూ - ``ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి మధ్య నడిచే కథ. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బల్లెం వేణుమాధవ్‌గారు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. అందరి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తి చేశాం`` అన్నారు.