pizza
Iddaram music launch
`ఇద్ద‌రం` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 June 2016
Hyderabad

జ‌వాన్ అండ్ కాస్పియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై సంజీవ్‌, సాయికృప జంట‌గా సుధాక‌ర్ వినుకొండ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ఇద్ద‌రం. కిర‌ణ్ శంక‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను బుధవారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. హీరో న‌వ‌దీప్ తొలి ఆడియో సీడీని అందుకున్నారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ ``ఈ సినిమా ప్రోమోను ముందే చూశాను. చాలా బాగా అనిపించింది. సందీప్‌తో నాకు మంచి ప‌రిచ‌య‌మే ఉంది. సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడ‌నిపించింది. అలాగే నాకెంతో ఇష్ట‌మైన న‌టుడు రంగనాథ్‌గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. పాట‌లు, సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

న‌వ‌దీప్ మాట్లాడుతూ ``ట్రైల‌ర్‌, పాట‌లు చాలా బావున్నాయి. సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌నిపించింది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు సుధాక‌ర్ మాట్లాడుతూ ``మనం పేప‌ర్స్‌లో గ్యాంగ్ రేప్స్ గురించిన వార్త‌ల‌ను చ‌దువుతూనే ఉంటాం. ఆ గ్యాంగ్ రేప్ చేసేవాళ్ల‌లో ఒక మంచి వ్య‌క్తి ఉంటే ఏమ‌వుతుంద‌నే కాన్సెప్ట్‌తో చేసిన సినిమాయే ఇది. మంచి రొమాంటిక్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ మూవీ. సినిమాను జూలై 1న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

స‌హ నిర్మాత శివ‌దీప్ స్వామి మాట్లాడుతూ ``కిర‌ణ్‌శంక‌ర్‌గారు మంచి మ్యూజిక్ అందించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కులు మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ ``సంగీతం చేసే అవ‌కాశం నాకు క‌ల్పించిన సుధాక‌ర్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

హీరో సంజీవ్ మాట్లాడుతూ ``వెల్‌క‌మ్ ఒబామా త‌ర్వాత నేను యాక్ట్ చేసిన మూవీ. మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ, సుధాక‌ర్‌గారు ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమాను రూపొందించారు. ఈ సినిమా మా అంత‌టికీ మంచి పేరు తీసుకొస్తుంద‌ని భావిస్తున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి మాట‌లుః టైం నాని, సినిమాటోగ్ర‌ఫీః ఎస్‌జె.సిద్ధార్థ్‌, ఎడిట‌ర్ః నాగేంద్ర‌కుమార్‌, సంగీతంః కిర‌ణ్ శంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిర‌ణ్ సిరిగిరి, స‌హ నిర్మాత‌లుః శివ‌దీప్ స్వామి, గంగిరెడ్డి, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వంః సుధాక‌ర్ వినుకొండ‌.

Glam gallery from the event

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved