04 June 2016
Hyderabad
పెద్ద చిత్రాలకు ముందుగానే ట్రైలర్స్, కొన్ని సీన్స్, ఆడియో ఫంక్షన్స్ చేసి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్తే అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అవ్వట్లేదు. ఈ మధ్యకాలంలో ఈ విధంగా చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అసలు పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ ఎందుకు..? ఏ మీ హీరోకు థియేటర్ కు ప్రేక్షకులను రప్పించే కెపాసిటీ లేదా..? ముందుగానే సినిమాను సగం చూపించేసి ప్రేక్షకుల ఆసక్తిని చంపేస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అవ్వడం వలన తిరిగి హీరోలు డబ్బులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతోంది. దయచేసి సినిమా విడుదలకు ముందు ఎలాంటి ఫంక్షన్స్ చేయొద్దని పెద్ద చిత్రాల నిర్మాతలకు తెలియజేస్తున్నానని అన్నారు దర్శకరత్న డా.దాసరి నారాయణరావు. కొత్త కొత్తగా సినిమా ఆడియో ఆవిష్కరణ లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై సమర్, అక్షిత, కిమయ ప్రధాన పాత్రల్లో గుండేటి సతీష్ కుమార్ దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ నిర్మిస్తోన్న చిత్రం 'కొత్త కొత్తగా ఉన్నది'. వంశీ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయ
ణరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను రసమయి బాలకిషన్ కిషన్ కు అందించారు. ఈ సందర్భంగా ఇంకా డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘’ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తవాళ్లతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుంకటే ఒకప్పుడు సినిమా అంటే హిట్, ఎబో ఏవరేజ్, బిలో ఏవరేజ్ అని ఉండేది. కాని ఇప్పుడు అలా లేదు. హిట్, ఫ్లాప్ అనే రెండింటి మీదే సినిమా ఆధారపడి ఉంటుంది. అయినా చిత్ర నిర్మాతలు ఎంతో నమ్మకంగా సినిమా చేశారు. ఈ చిత్ర దర్శకుడు గుండేటి సతీష్ కుమార్ కోడిరామకృష్ణ, రవిరాజా పినిశెట్టిల వద్ద కొన్ని చిత్రాలకు పని చేశాడు. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.
Kimaya Glam gallery from the event |
|
|
|
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘’సినిమా ఏదైనా ఒకటే కష్టముంటుంది. ఏ నమ్మకంతో అయితే ఈ సినిమాను దర్శక నిర్మాతలు స్టార్ట్ చేశారో అది నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే టైటిల్ లోనే కొత్తదనం చూపించారు. సినిమా కూడా కొత్తగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘’నిర్మాతల్లో ఒకరైన ప్రభాకర్ గారు రంగస్థల నటుడు. ఆయన నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. సతీష్ ఎంతో నమ్మకంతో సినిమాను రూపొందించాడు. వంశీ మ్యూజిక్ మెలోడియస్ గా ఉంది. తనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినందనలు’’ అన్నారు.
భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’అందరు కొత్తవాళ్ళతో చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి’’ అన్నారు.
దర్శకుడు గుండేటి సతీష్ మాట్లాడుతూ ‘’తెరపై నాకొక జీవితాన్ని ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. కొత్త కొత్తగా ఉన్నది ఒక ప్రేమ కథ. నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు.
నిర్మాతలు పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ మాట్లాడుతూ ‘’ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాం. కథ వినగానే నచ్చింది. వంశీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ ‘’నాకు ఈ సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ ఇచ్చిన అందరికి థాంక్స్’’ అన్నారు.
ఈ చిత్రానికి డైలాగ్స్: ఉదయ్ భగ్వథుల, ఆర్ట్: పి.ఎస్.వర్మ, ఎడిటర్: ఎస్.బి. ఉధవ్, సినిమాటోగ్రఫీ: జికె, మ్యూజిక్: వంశీ, నిర్మాతలు: పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: గుండేటి సతీష్ కుమార్.