pizza
Kousalya Krishnamurthy music launch
`కౌస‌ల్య కృష్ణ‌మూర్తి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 July 2019
Hyderabad

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌`. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సినిమా ట్రైల‌ర్‌, బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను ఇండియ‌న్ మ‌హిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా...

ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడు సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అంటే క్రియేటివిటీ. రామారావు అన్న‌య్యకి సినిమాలంటే ప్యాష‌న్‌. అదే ప్యాష‌న్‌తోనే ఈ సినిమాను నిర్మించారు. ఆయన తెలుగులో రీమేక్ చేసిన సినిమాల‌న్నీ చాలా పెద్ద విజ‌యాల‌ను సాధించాయి. అలాగే `కౌస‌ల్య కృష్ణ‌మూర్తి`లో యాక్ట్ చేసిన మా అమ్మాయి ఐశ్వ‌ర్య‌, మా హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారికి అభినంద‌న‌లు. రాజేంద్ర ప్ర‌సాద్‌గారికి తండ్రి పాత్ర‌కు ఎంచుకోవ‌డం అనేది రామారావుగారు చేసిన గొప్ప ప‌ని. ఈ ఫంక్ష‌న్‌కి రియ‌ల్‌స్టార్ మిథాలీ రాజ్‌ను పిలిచి ఫంక్ష‌న్‌ను చేయ‌డం గొప్ప విశేషం. పాజిటివ్ ఎన‌ర్జీని క్రియేట్ చేసింది. కె.ఎస్‌.రామారావుగారు మెగాస్టార్‌గారితో, అలాగే ఇత‌ర స్టార్ హీరోల‌తో ఎన్ని సినిమాలు చేసినా ఆయ‌న‌కు చిన్న సినిమాలే మైండ్ బ్లోయింగ్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. మా రామారావు అన్న‌య్య ఎన్నో సెన్సేష‌న‌ల్ హిట్స్‌ను చూసేశాడు. ఈ సినిమా స‌క్సెస్ అయితే కొడుకు స‌క్సెస్‌ను చూసి ఎంజాయ్ చేయ‌డానికి నాంది అవుతుంది. అన్నింటిని మించి మా ద‌ర్శ‌కుడు మా భీమినేని అన్న‌య్య ఈ సినిమాతో ఇంకా హై రేంజ్‌కు చేరుకుంటాడ‌ని భావిస్తున్నాను. ఒక కుటుంబంలాంటి సినిమా. ఒక బాధ, ఎమోష‌న్ ఉండే సినిమా. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. త‌మిళంలో ఐశ్వ‌ర్య‌కు ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులో అంతే కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఉపాధ్య‌క్షుడు కె.అశోక్‌కుమార్ మాట్లాడుతూ - ``ఈ సినిమాతో రామారావుగారు ఈ సినిమాతో పెద్ద స‌క్సెస్‌ను కొట్ట‌బోతుంద‌ని అర్థ‌మవుతుంది. ఓ రియ‌ల్ స్టోరిని బేస్ చేసి తీసిన సినిమా. రామారావుగారికి సినిమాలంటే ప్యాష‌న్‌. సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా వెనుకాడ‌రు. ఆయ‌న బాట‌లోనే వ‌ల్ల‌భ కూడా న‌డుస్తున్నాడు. ఇలాంటి వారికి హిట్ వ‌స్తే ఇండ‌స్ట్రీ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

తెలంగాణ ఎఫ్‌.డి.సి చైర్మ‌న్ పుస్కూరు రామ్మోహ‌న్‌రావు మాట్లాడుతూ - ``ప్రొఫెష‌న‌ల్‌, ప్యాష‌నేట్ ఫిలిమ్ మేక‌ర్ అయిన రామారావుగారికి అభినంద‌న‌లు. ఆయ‌న త‌న‌యుడు వ‌ల్ల‌భ‌గారి తొలి సినిమా ఇద‌ని అంటున్నారు. త‌న‌కు నిర్మాత‌గా పెద్ద విజ‌యం ద‌క్కాలి. మంచి ట‌చింగ్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

నిర్మాత జీవీజీ రాజు మాట్లాడుతూ - ``వ‌ల్ల‌భ‌కు ఆల్ ది బెస్ట్‌. నాకు రామారావుగారంటే ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌న తీసిన సినిమాలు, ఆయ‌న ఇచ్చిన హిట్స్ అలాంటివి. అలాగే భీమినేని శ్రీనివాస‌రావుగారితో కూడా క‌లిసి ప‌నిచేశాను. ఐశ్వ‌ర్య రాజేశ్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామ‌ర్‌. ఈ సినిమా త‌ర్వాత మా మిస్ మ్యాచ్ ఈ సినిమా త‌ర్వాత విడుద‌ల‌వుతుంది. ఆమెకు ఈ సినిమాతో పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమా గ్రాండ్ స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

కార్తీక్ రాజు మాట్లాడుతూ - ``క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌లో పనిచేయ‌డ‌మే గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. కె.ఎస్‌.రామారావుగారు, వ‌ల్ల‌భ‌గారికి థ్యాంక్స్‌. నా కెరీర్ ఫ‌స్ట్ హిట్ ఇక్క‌డి నుండే స్టార్ట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను. ఇక‌పై అంద‌రూ న‌న్ను కౌస‌ల్య కృష్ణ‌మూర్తి కార్తీక్ అనే పిలుస్తార‌ని అనుకుంటున్నాను. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి వ‌ద్ద నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాం. నా లైఫ్‌లో నేను క‌లిసిన బెస్ట్ వ్య‌క్తి ఐశ్వ‌ర్యా రాజేశ్‌. అలాగే భీమినేనిగారి రూపంలో నాకొక మంచి బ్ర‌ద‌ర్ దొరికారు. అలాగే మా కెమెరామెన్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ స‌హా అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడుతూ - ``కె.ఎస్‌.రామారావుగారు ఈ ఇండ‌స్ట్రీకి 40 ఏళ్ల క్రితం వ‌చ్చారు. చాలా గొప్ప సినిమాలు నిర్మించారు. ఆయ‌న తీసిన సినిమాలు చూసి ఇలాంటి గొప్ప సినిమాలు మ‌నం ఎప్పుడు తీద్దామా? అనేంతగా తీశారు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది నిర్మాత‌లు వ‌చ్చారు... వెళ్లిపోయారు. కానీ ఆయ‌న మాత్రం సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న నిర్మాణ సార‌థ్యంలో కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి విజ‌య‌వంత‌గా విడుద‌ల‌వుతుంది. రాజేంద్ర ప్ర‌సాద్‌తో నేను మూడు సినిమాలు చేశాను. చాలా డేడికేష‌న్ ఉన్న న‌టుడు. ఏ ర‌సానైనా అద్భుతంగా పండించ‌గ‌ల న‌టుడు. త‌మిళంలో యాక్ట్ చేసిన ఐశ్వ‌ర్యా రాజేశ్ తెలుగులోనూ న‌టించింది. అలాగే భీమినేని రేప‌టి పౌరులుతో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. త‌న‌తో మంచి అనుబంధం ఉంది. ఎన్నో గొప్ప సినిమాలు చేశాడు. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

క్రాంతి మాధ‌వ్ మాట్లాడుతూ - ``ఓ క్రికెట‌ర్‌పై రూపొందిన సినిమాను చూడ‌బోతున్నందుకు ఆనందంగా ఉంది. టీజ‌ర్ చూశాను. చాలా బావుంది. మ‌న‌దేశ సంస్కృతిలో రైతుకు చాలా పెద్ద పీట వేశాం. అలాంటి సంస్కృతి మ‌రెక్క‌డా లేదు . వంద‌కోట్ల మంది దేవుళ్ల‌కు అన్నం పెట్టే బ్ర‌హ్మా రైతు మాత్ర‌మే. అడ‌గందే అన్నం పెట్ట‌ని అమ్మ‌కు కూడా ప‌స్తులుండి అన్నం పెట్టేవాడే రైతు. ఇది కేవ‌లం క్రికెట‌ర్ క‌థే కాదు.ఓ రైతు, ఓ తండ్రికూతురు క‌థ కూడా. దేశానికి వెన్నెముక‌లాంటి రైతు పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్‌గారు ఎలా న‌టించార‌నేది నేను కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐశ్వ‌ర్యారాజేశ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. డేడికేటివ్ యాక్ట్రెస్‌. క్యారెక్ట‌ర్ ప్ర‌కారం డైరెక్ట‌ర్ ఏం చెబుతాడో దాన్ని అలాగే చేస్తుంది. త‌ను స్మితాపాటిల్‌లాంటి న‌టి. రామారావుగారి బ్యాన‌ర్‌లో నేను చేస్తున్న రెండో సినిమా. డైరెక్ట‌ర్‌గారికి రామారావుగారు ఇచ్చేంత ఫ్రీడ‌మ్ మ‌రెవ‌రూ ఇవ్వ‌లేరు. భీమినేనిగారు గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సంగీతాన్ని త‌న సినిమాల‌తో అందించారు. వ‌ల్ల‌భ‌గారికి కంగ్రాట్స్‌`` అన్నారు.

అరుణ్‌రాజా కామ‌రాజా మాట్లాడుతూ - ``నేను త‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేశాను. తెలుగులో భీమ‌నేనిగారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. నేను విజువ‌ల్స్ చూశాను. చాలా మందికి చాలా క‌ల‌లుంటాయి. అలాంటి క‌ల‌లు క‌న్న ఓ అమ్మాయికి ఆమె త‌ల్లిదండ్రులు ఎలా స‌పోర్ట్ చేశార‌నేదే ఈ సినిమా. నిజ‌మైన క‌ల‌లు ఎప్పుడూ స‌క్సెస్ అవుతాయి`` అన్నారు.

నిర్మాత కె.ఎ.వ‌ల్ల‌భ మాట్లాడుతూ - ``మా సినిమా నిర్మాణంలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ఇండియ‌న్ లేడీ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ - ``ఈ వేడుక‌కి నన్ను ఆహ్వానించిన కె.ఎస్‌.రామారావుగారికి థ్యాంక్స్‌. నేను బెంగ‌ళూరులో ఉంటే న‌న్ను అక్క‌డి ప్ర‌త్యేకంగా క‌లిశారంటే సినిమా ప‌ట్ల ఆయ‌న క‌మిట్ మెంట్‌, ప్యాష‌న్ ఏంటో అర్థ‌మ‌వుతుంది. టీజ‌ర్ చూశాను . చాలా బాగా నచ్చింది. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంది. నాకు ఎంతో బాగా న‌చ్చింది. మూవీ హ్యూజ్ స‌క్సెస్ అవుతుంది. త‌ల్లిదండ్ర‌లు ఓ అమ్మాయి క‌ల‌లు నేర‌వేర్చ‌డానికి ఎంత దోహ‌ద‌ప‌డ‌తార‌నేది ఈ సినిమాలో చూపించాం. త‌మిళంలో సినిమా చేసిన కణ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు. ఎందుకంటే ఉమెన్ క్రికెట్‌ను ఓ మాధ్య‌మం ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌చ్చితంగా అంద‌రికీ చేరుతుంద‌ని భావిస్తున్నాను. ఉమెన్ క్రికెట్ అనే ఆట‌ను అంద‌రూ ఎంక‌రేజ్ చేయాలని చెప్పే చిత్రం. అలాగే మ‌రో వైపు రైతుల క‌ష్టాల‌ను ఆవిష్క‌రింప చేసే చిత్రం. మా అమ్మ‌గారు త‌మిళ చిత్రాన్ని చూశారు. ఆమెకు ఎంత‌గానో న‌చ్చింది. నా టీమ్ మెట్స్‌కు ఈ సినిమాను చూడ‌మ‌ని చెబుతాను. అంద‌రూ క‌నెక్ట్ అవుతార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

న‌టకిరిటీ డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``ఏ న‌టుడికైనా ఉండే కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామ‌నే దానికంటే, ఎన్ని సినిమాలు గుర్తున్నాయ‌నేదే లెక్క అని నా అభిప్రాయం. ఎన్ని సినిమాలు గుర్తుండేలా తీశామ‌నేదే లెక్క‌. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అంటే.. నేను ఈ బ్యాన‌ర్‌లో ఛాలెంజ్ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఇదే బ్యాన‌ర్‌లో పుణ్య‌స్త్రీలో అద్భుత‌మైన పాత్ర చేశాను. ఇదే కంపెనీలో ముత్య‌మంతముద్దు అనే సినిమా చేశాను. అలాంటి డిఫ‌రెంట్ చేశానంటే కార‌ణం కేవ‌లం ప్రొడ్యూస‌రే నా నమ్మ‌కం. ఎందుకంటే టేస్ట్ అనేది ప్రొడ్యూస‌ర్ ద‌గ్గ‌ర నుండే స్టార్ట్ కావాలి. అది రామారావుగారిలో ఉంది. టేస్ట్‌కు, డ‌బ్బుకు సంబంధం లేదు. ఆర్టిస్టుల్లో మంచి పాత్ర‌లు చేయాల‌నే టేస్ట్ న‌చ్చితే మామూలు పాత్ర‌లు ఆన‌వు. బ్ర‌తుకుదెరువు కోసం కొన్ని సినిమాలు చేసినా కె.ఎస్‌.రామారావులాంటి వ్య‌క్తి మాత్ర‌మే గుండెమీద చెయ్యి వేసుకుని నేను నిర్మాత‌ను అని చెప్ప‌గ‌లిగే ధైర్యం ఉంటుంది. వ‌ల్ల‌భ వ‌చ్చినా ఆయ‌న‌లో నిర్మాత‌గా టేస్ట్ పోలేదు అన‌డానికి కౌస‌ల్య కృష్ణ‌మూర్తే ఓ ఉదాహ‌ర‌ణ‌. ఆయ‌న ఎప్ప‌టికీ నిలిచిపోయే నిర్మాత‌. నాక‌న్నా నాకు వ‌చ్చిన అవ‌కాశం గొప్ప‌ది.. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే పాత్ర‌ల‌కు త‌గిన న‌టులే దొరికారు. న‌టుల‌ను ఎంపిక‌కు భీమినేని శ్రీనివాస‌రావు, రామారావుగారే కార‌ణం. ఓ ప్ర‌త్యేక‌మైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న నేను చాలా ఎంజాయ్ చేస్తూ న‌టించాను. భీమినేని చాలా అంద‌మైన హింస పెడుతూ న‌టింప చేశారు. అద్భుతంగా న‌టింప‌చేశారు. ఓరిజిన‌ల్‌గా ఉన్న అన్ని అంశాల‌ను మిస్ కాకుండా, అంత కంటే ఎక్కువ‌గానే ఈ సినిమాలో చూపించార‌ని అనుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ - ``ఈ సినిమా చేయ‌డానికి ముఖ్య కార‌ణం కె.ఎస్‌.రామారావుగారే. ఆయ‌న ద‌గ్గర నుండి ఫోన్ చేయ‌గానే, ఆయ‌న్ని మ‌రుస‌టి రోజు క‌లిశాను. ఆరోజు నుండి ఈరోజు వ‌ర‌కు సినిమాను అద్భుతంగా ప్రేమించి చేశాం. అరుణ్‌రాజ్‌గారు ఎంతో త‌ప‌న ప‌డి, ఎన్నో లేయ‌ర్స్‌ను పొందుప‌రిచి చేసిన సినిమా ఇది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను శివ‌కార్తీకేయ‌న్ ప్రొడ్యూస్ చేస్తూ ఆయ‌న గెస్ట్ రోల్ చేస్తూ న‌టించాడు. త‌మిళంలో పెద్ద హిట్ అయిన సినిమా ఇది. దిబునిన‌న్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. త‌మిళంలో ఫ్లెవ‌ర్‌ను మిస్ కాకుండా చేయాల‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్నాను. త‌మిళంలో స‌త్య‌రాజ్‌గారు చేసిన పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తార‌ని ఆలోచించ‌గానే రాజేంద్ర ప్ర‌సాద్‌గారు అనుకుని ఆయ‌న్ని దృష్టిలో పెట్టుకుని స‌న్నివేశాలు రాసుక‌న్నాను. రాజేంద్ర ప్ర‌సాద్‌గారి పెర్ఫామ‌న్స్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అద్భుతంగా న‌టించారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌ట‌న చూసి నాకే ఏడుపొచ్చేసింది. నిర్మాత రామారావుగారు చాలా మంచి ఆర్టిస్టుల‌ను ఇచ్చారు. ఇప్ప‌టి త‌రానికి త‌గిన‌ట్లు ఆలోచ‌న‌ల‌ను మార్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నారు. టాప్ టెన్ ప్రొడ్యూస‌ర్స్‌లో ఒక‌రు. డెఫ‌నెట్‌గా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

ఐశ్వ‌ర్యారాజేశ్ మాట్లాడుతూ - ``త‌మిళంలో 25 సినిమాలు త‌ర్వాత తమిళంలో నేను చేసిన ఫిమేల ఓరియెంటెడ్ మూవీ క‌ణ‌. ఈ విష‌యంలో అరుణ్ రాజ్‌గారికి థాంక్స్‌. నాన్న‌, తాత‌య్య‌, అత్త‌య్య తెలుగు సినిమాలు చేశారు క‌దా! మీరెందుకు తెలుగు సినిమాలు చేయ‌డం లేదని అడిగిన‌ప్పుడు మంచి క‌థ ఉన్న సినిమాతో తెలుగులో లాంచ్ కావాల‌నుకున్నాను. 25 సినిమాలు త‌ర్వాత క‌ణ ఎలాగైతే అవ‌కాశం వ‌చ్చిందో.. తెలుగులో తొలి సినిమానే కౌస‌ల్య కృష్ణ‌మూర్తిగా వ‌చ్చింది. ఇలాంటి లాంచ్ అంద‌రికీ దొరుకుతుందా? అని నాకు తెలియ‌దు. కణ సినిమా టీజ‌ర్ కె.ఎస్‌.రామావుగారికి చూపించాను. ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి ఈసినిమాను కొని 3 వారాల్లోనే షూటింగ్ స్టార్ట్ చేశారు. క‌ళ్లు మూసి తెరిచేలోగా సినిమా విడుద‌లవుతుంది. ఓరిజిన‌ల్ కంటెంట్ పోకుండా డైరెక్ట‌ర్ భీమినేని వంద‌శాతం న్యాయం చేశారు. త‌మిళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ అంతే పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్‌గారు నా తండ్రి పాత్ర‌లో.. ఝాన్సీ పాత్ర‌లో నా త‌ల్లి పాత్ర‌లో న‌టించారు. అంద‌రూ ఎంతో బాగా న‌టించారు`` అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ``ఈ సినిమా చేయ‌డానికి ముఖ్య కార‌ణం అరుణ్‌రాజ్ కామ‌రాజ్‌. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో మా బ్యాన‌ర్‌లో ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు ఆమె అంత‌కుముందు త‌మిళంలో చేసిన కొన్ని చిత్రాల‌ను చూశాను. ఆ సినిమాలు నేష‌న‌ల్ లెవ‌ల్లోనే కాదు.. ఇత‌ర దేశాల్లోనూ మంచి పేరొచ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలోనూ గొప్ప క్యారెక్ట‌ర్ చేసింది. ఆ స‌మ‌యంలో క‌ణ టీజ‌ర్‌ను త‌ను నాకు పంపింది. ఆ టీజ‌ర్‌ను నాకు పంపింది. చూసిన నాకు న‌చ్చింది. వెంట‌నే ఆమెకు ఫోన్ చేసి ఈ సినిమాను నేను తెలుగులో చేయాల‌నుకుంటున్నాను రైట్స్ కావాల‌ని అడ‌గ్గానే ఆమె వ్య‌క్తిగ‌తంగా నాకోసం ఆమె త‌మిళ నిర్మాత‌లను రిక్వెస్ట్ చేసింది. త‌మిళంలో సినిమావిడుద‌లైన కొన్నిరోజుల త‌ర్వాత తెలుగులో రైట్స్‌ను నాకే వ‌చ్చింది. త‌మిళంలో సినిమాను చూసిన మా యూనిట్ అంద‌రూ చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమాలో అరుణ్‌రాజ్‌గారు యూత్ క్రికెటర్‌ను ఎంత‌బాగా చూపించారో, అంతే బాగా మ‌రో ప‌క్క రైతుక‌ష్టాల‌ను అద్భుతంగా స్క్రీన్‌ప్లేతో చూపించారు. అంద‌రూ న‌టీన‌టులు అద్భుతంగా న‌టించారు. శిబుదిన‌న్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అండ్రూగారు చాలా మంచి విజువ‌ల్స్‌ను అందించారు. అరుణ్‌రాజ్‌గారు, శివ‌కార్తీకేయ‌న్ స‌హా ఎంటైర్ యూనిట్ అద్భుతమైన సినిమా చేశారు. దాన్ని అలాగే తెలుగులో మేం రూపొందించాం. సావిత్రిగారు, శార‌ద‌గారు నుండి ఇప్ప‌టి స‌మంత వ‌ర‌కు నేను తెలుగులో గొప్ప న‌టీమ‌ణులను చూశాను. వారేవ‌రికీ తీసిపోని గొప్ప పెర్ఫామ‌ర్ ఐశ్వ‌ర్యా రాజేశ్‌. భీమినేని శ్రీనివాస‌రావుగారు చెప్పిన దానికంటే గొప్ప పెర్ఫామ‌ర్‌. సినిమాను 35 రోజులు భ‌యంక‌ర‌మైన క్లైమేట్‌లో సినిమాను చేశాం. అంద‌రూ మంచి ప్రొడ‌క్ట్ కోసం క‌ష్ట‌ప‌డ్డారు. త‌మిళంలోలాగానే తెలుగులోనూ సినిమా పెద్ద హిట్ అవుతుంది. భీమినేని శ్రీనివాస‌రావుగారికి థ్యాంక్స్‌. ఆయ‌న ఎంతో జాగ్ర‌త్త‌గా, కూల్‌గా త‌న‌కు కావాల్సిన ఎలిమెంట్స్‌ను రాబ‌ట్టుకున్నారు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థ్యాంక్స్‌`` అన్నారు.

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజ కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved