pizza
Krishnashtami music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 January 2015
Hyderabad

రాజ‌మండ్రి లో ఘ‌నంగా జ‌రిగిన సునీల్ క్రిష్ణాష్ట‌మి ఆడియో వేడుక‌

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన తాజా చిత్రం క్రిష్ణాష్ట‌మి. వాసు వర్మ దర్శకత్వం లో, ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రంలో సునీల్ స‌ర‌స‌న నిక్కి గల్రాని మరియు డింపుల్ చోపడే న‌టించారు. దినేష్ సంగీతాన్నిఅందించిన‌ క్రిష్ణాష్ట‌మి ఆడియో ఫంక్ష‌న్ రాజ‌మండ్రి జి.ఐ.ఇ.టి కాలేజీ విద్యార్ధినీ విద్యార్థులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా హాజ‌రైన‌ డైరెక్ట‌ర్స్ వంశీ పైడిప‌ల్లి, హారీష్ శంక‌ర్ క్రిష్టాష్ట‌మి ఆడియో సి.డి. ని ఆవిష్క‌రించారు.
ఈ కార్య‌క్ర‌మంలో గైట్ విద్యార్ధులు కోసం నిర్వ‌హించిన‌ షార్ట్ ఫిలిమ్స్ అండ్ స్టోర్ట్స్ కాంటెస్ట్ విన్న‌ర్స్ కు డైరెక్ట‌ర్స్ వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్ షీల్డ్స్ బ‌హుక‌రించారు.

హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ...క్రిష్ణాష్ట‌మి నాకు నాలుగ‌వ సినిమా. దిల్ రాజు గారి బ్యాన‌ర్ లో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. క్రిష్ణాష్ట‌మి నా ఫేవ‌రేట్ ఫెస్టివ‌ల్ అండ్ ఫేవ‌రేట్ మూవీ అన్నారు.

కెమెరామెన్ ఛోటా కె నాయుడు మాట్లాడుతూ...దిల్ రాజు గారి సినిమా అన‌గానే మంచి క‌థ ఉంటుంది. ఈ సినిమాలో కూడా మంచి క‌థ ఉంది. బ్రుందావ‌నం, మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ ...ఇలా సునీల్ తో వాసు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాం అని దిల్ రాజు గారు చెప్పిన వెంట‌నే స‌రే అన్నాను. ఈ సినిమాలో కొత్త సునీల్ ని చూస్తారు. దిల్ రాజు గారి సినిమాల్లో ది బెస్ట్ ఆడియో ఇది. ఈ సినిమా కోసం యాక్ష‌న్, డాన్స్, సాంగ్స్...ఇలా ప్ర‌తిదీ ది బెస్ట్ అనేలా చేసాం. ఓ హిందీ సినిమాని చూసామా అనే ఫీలింగ్ క‌లిగించేలా క్రిష్టాష్ట‌మి ఉంటుంది అన్నారు.

హీరోయిన్ నిక్కి గల్రాని మాట్లాడుతూ...రాజ‌మండ్రిలో గోదావ‌రి, ఆవ‌కాయ నాకు బాగా న‌చ్చింది. క్రిష్టాష్ట‌మి సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన దిల్ రాజు గారికి ధ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే ప‌ల్ల‌వి అనే క్యారెక్ట‌ర్ కి నన్ను సెలెక్ట్ చేసినందుకు డైరెక్ట‌ర్ వాసు వ‌ర్మ గారికి థ్యాంక్స్. సునీల్ గారి నుంచి చాలా నేర్చుకున్నాను. దినేష్ గారు చాలా మంచి ఆడియో ఇచ్చారు. ఈ టీమ్ తో వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. రాజ‌మండ్రిలో షూటింగ్ చేసిన‌ప్పుడు చాలా ఎంజాయ్ చేసాను. సినిమా చూసాకా మీరంద‌రూ బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.

డైరెక్ట‌ర్ వంశీ పైడి ప‌ల్లి మాట్లాడుతూ...నేను ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి కార‌ణం వాసువ‌ర్మ‌. నా ప్ర‌తి సినిమాకి ఫ‌స్ట్ థ్యాంక్స్ కార్డ్ లో వాసు వ‌ర్మ పేరే వేస్తాను. వాసు వ‌ర్మ లాంటి మంచి వ్య‌క్తిని ఎక్క‌డా చూడ‌లేదు. మా అంద‌రి స‌క్సెస్ వెన‌క వాసు వ‌ర్మ ఉన్నారు. క్రిష్టాష్ట‌మి మంచి విజ‌యం సాధిస్తుంది. ఇక నిర్మాత దిల్ రాజు గారి గురించి చెప్పాలంటే...సినిమా స‌క్సెస్ కాక‌పోయినా...మ‌ళ్ళీ అవ‌కాశం ఇచ్చి ప్రోత్స‌హించ‌డం అనేది దిల్ రాజు గారి గొప్ప‌త‌నం. ఈ సినిమా ద్వారా సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న దినేష్ కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
రాజ‌మండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మాట్లాడుతూ...గోదావ‌రి బుల్లోడు సునీల్ న‌టించిన క్రిష్టాష్ట‌మి మంచి హిట్ అవ్వాలి. దిల్ రాజు గారి సినిమాల‌న్ని చూసాను. ముఖ్యంగా వంశీ పైడిప‌ల్లి తీసిన బ్రుందావ‌నం సినిమాని 10 సార్లు చూసాను. ఈ ఆడియో వేడుక‌ను రాజ‌మండ్రిలో నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ దినేష్ మాట్లాడుతూ...నా ఫ‌స్ట్ ఆడియో కాలేజ్ లో రిలీజ్ కావ‌డం సంతోషంగా ఉంది. నేను చాలా సినిమాల‌కు కీ బోర్డ్ ప్లేయ‌ర్ గా వ‌ర్క్ చేసాను. నేను వ‌ర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అంద‌రికీ ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. రాజు గారు నా డ్రీమ్ ప్రొడ్యూస‌ర్. నా మొద‌టి సినిమా రాజు గారి బ్యాన‌ర్ లో చేస్తాన‌ని అనుకోలేదు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంచుకున్న డైరెక్ట‌ర్ వాసు వ‌ర్మ కి థ్యాంక్స్ అన్నారు.

జి.ఐ.ఇ.టి కాలేజీ ఛైర్మెన్ చైత‌న్య‌ రాజు మాట్లాడుతూ...దిల్ రాజు గారు ఓ విశ్వ‌విద్యాల‌యం లాంటి వారు.ఎన్నో మంచి చిత్రాల‌ను అందించారు. యంగ్ డైరెక్ట‌ర్ వాసు వ‌ర్మ‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దినేష్, ఛోటా కె నాయుడు గార్ని అభినందిస్తున్నాను.ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ...గోదావ‌రి జిల్లా వారికి వెట‌కారం ఎక్కువ అంటుంటారు. కానీ...సినిమా వాళ్లంటే మ‌మ‌కారం ఎక్కువ అని అర్ధం అయ్యింది. సునీల్ మాయ‌తో మాట్లాడితే ఎంత ఎన‌ర్జి వ‌స్తుందే మాట‌ల్లో చెప్ప‌లేను. ఎంత ఎదిగినా చాలా సింపుల్ గా ఉంటాడు. క‌మెడియ‌న్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఈరేంజ్ కి ఎద‌గ‌డం అంటే మామూలు విషయం కాదు. గబ్బ‌ర్ సింగ్ త‌ర్వాత నా చుట్టు చాలా మంది ఉన్నారు. కానీ రామ‌య్య వ‌స్తావ‌య్య త‌ర్వాత నాతో ఉన్న‌ది మాత్రం దిల్ రాజు, శిరీష్,ల‌క్ష్మ‌ణ్‌. ఈ ముగ్గురు ఇచ్చిన స‌పోర్ట్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. వంశీ ఎంత బిజీగా ఉన్నా...ఇక్క‌డ‌కు వ‌చ్చాడంటే కార‌ణం వాసు వ‌ర్మ‌. వంశీయే కాదు వినాయ‌క్, సుకుమార్...ఇలా చాలా మంది వాసు వ‌ర్మ స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నారు అంటే వాసు వ‌ర్మ ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్ల‌లేదు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ దినేష్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లో గువ్వా గోరింక సాంగ్ చేసాడు. ఇది దినేష్ కి రెండో సినిమా. క్రిష్టాష్ట‌మి పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

డైరెక్ట‌ర్ వాసువ‌ర్మ‌మాట్లాడుతూ...జోష్ త‌ర్వాత నేను ఓ క‌థ చేసి ఇంత బ‌డ్జెట్ అనుకుంటుంటే..రాజు గారు ఓ క‌థ విను అన్నారు. క‌థ విన్న ఆత‌ర్వాత సునీల్ తో ఈ సినిమా నువ్వు చేస్తున్నావ్ అన్నారు. ఈ సినిమాకి మార్కెట్ ఎంత అవుతుంది అని ఆలోచించ‌రు. క‌థ‌కి ఎంత అవుతుంది అనే ఆలోచిస్తారు. సినిమా తీయాలంటే టీమ్ మొత్తం స‌పోర్ట్ చేయాలి. ఛోటా కె నాయుడు గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఎంత‌గానో స‌పోర్ట్ చేసారు. సినిమా అంటే సునీల్ కి చాలా ప్రాణం. సునీల్ తో వంద సినిమాలు తీసినా బోర్ కొట్ట‌దు. ఈ సినిమాతో సినిమా తీయడం ఇంత ఈజీ యా అనిపించింది.దినేష్ కి ఫ‌స్ట్ సినిమా అయిన‌ప్ప‌టికీ 100 సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ లా ట్యూన్స్ ఇచ్చారు. సీతారామ శాస్త్రి గారికి 3 మినిట్స్ క‌థ గురించి చెబితే అద్భుత‌మైన పాట అందించారు. అలాగే అనంత శ్రీరామ్, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, బాలాజీ కూడా మంచి పాట‌లు అందించారు. ఈ సినిమాకి స‌హ‌క‌రించిన అంద‌ర‌కీ థ్యాంక్స్ అన్నారు.

హీరో సునీల్ మాట్లాడుతూ...రాజు గారి ఇంట్లో నేను పుట్టాను అనేంత రేంజ్లో ఈ సినిమా తీసారు. రాజు గారి రుణం ఎన్ని జ‌న్మ‌లు ఎత్తినా తీర‌దు. ఇంత మంది న‌న్ను చూడ‌డానికి వ‌స్తార‌ని అనుకోలేదు. చోటా కె నాయుడు, వాసు వ‌ర్మ గారు చూపించినంత అందంగా ఎవ‌రూ చూపించ‌లేదు. వంశీ, హ‌రీష్ వ‌చ్చినందుకు ఆనందంగా ఉంది. రెండున్న‌ర గంట‌ల పాటు న‌వ్వించే సినిమా క్రిష్టాష్ట‌మి అన్నారు

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...సినిమా అనేది మాకు పెద్ద వీక్ నెస్. అలాగే సినిమాని స‌క్సెస్ చేయాల‌ని వీక్ నెస్. క్రిష్టాష్ట‌మి స‌క్సెస్ అవ్వాలి మా కోసం కాదు డైరెక్ట‌ర్ వాసు వ‌ర్మ కోసం. మా సంస్థ నుంచి మంచి స‌క్సెస్ ఇచ్చే పంపించాల‌నుకుంటున్నాను. అలాగే డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ ని కూడా స‌క్సెస్ ఇచ్చే పంపిస్తాను.ప్ర‌తి ఒక్క‌రు సొంత సినిమాలా ఫీల్ అయి వ‌ర్క్ చేసారు. సునీల్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన క్యారెక్ట‌ర్ ల కాకుండా కొత్త‌గా చేసాడు. క‌ష్ట‌ప‌డితే ఖ‌చ్చితంగా మంచి రిజ‌ల్ట్ వ‌స్తుంది. ఫిబ్ర‌వ‌రి 5 ఈ సినిమా విడుద‌ల చేస్తున్నాం. అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది అన్నారు.




Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved