pizza
Maaya Chitram music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 December 2014
Hyderabad

వినయ్ రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘మాయాచిత్రం’. కళావతి సమర్పిస్తున్నారు. టేక్ కేర్ యువర్ హార్ట్ బీట్ అనేది ఉపశీర్షిక. వినయ్ రాజ్, రుక్షర్ మిర్, వైశాలి పటేల్ కీలక పాత్రధారులు. జి.వినయ్ రాజ్ దర్శకత్వం వహించారు. జి.వెంకన్న నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. జి.వెంకన్న, కళావతి ఆవిష్కరించారు. ఆడియో సీడీలను మధుర శ్రీధర్, రఘుకుంచె సంయుక్తంగా విడుదల చేశారు. మానస్ అందుకున్నారు.

రఘుకుంచె మాట్లాడుతూ ‘‘హారర్ ట్రెండ్ నడుస్తోంది. లిమిటెడ్ బడ్జెట్లో, మంచి కథతో, చక్కటి సౌండ్ ఎఫెక్ట్స్ తో తీసే హారర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. హీరో, హీరోయిన్లకు ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ ‘‘మాయ సినిమా చేసే సమయంలో ఈ పోస్టర్ ను చూశాను. చాలా వైవిధ్యంగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. హారర్ హవా సాగుతున్న ఈ రోజుల్లో గీతాంజలిలా ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలి’’ అని అన్నారు.

మానస్ మాట్లాడుతూ ‘‘హారర్ సినిమాలు తీయాలంటే విజన్ ఉండాలి. ఈ దర్శకుడికి మంచి విజన్ ఉంది’’ అని తెలిపారు.

సన్ని మాట్లాడుతూ ‘‘నా రెండో సినిమా ఇది. పాటలు, రీరికార్డింగ్ బాగా కుదిరాయి’’ అని చెప్పారు.

వినయ్ రాజ్ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే నాకు బాగా ప్యాషన్. అందుకే మా నాన్న పర్మిషన్ తీసుకుని సినిమా మొదలుపెట్టాను. సీజీ వర్క్ కు ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. దాదాపు 25 నిమిషాల సీజీ కనిపిస్తుంది. సన్ని మంచి పనితనాన్ని కనబరిచాడు. రుక్షర, వైశాలి చక్కగా నటించారు. ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్లను బాలాజీ, మంజునాథ్ తీసుకున్నారు. జనవరి 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, హీరోయిన్లతో పాటు మిగిలిన యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

చిత్రం శ్రీను, చిన్న, షకలక శంకర్, తడాఖా భాస్కర్, సన్ని, చిట్టిబాబు, బంటి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం; ఎ.ఆర్.సన్ని, ఎడిటింగ్; యాదగిరి, ఆర్ట్; శ్రీనివాసులు, ప్రొడ్యూసర్; జి.వెంకన్న, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; జి.వినయ్ రాజ్.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved