జెమిని ఫిలిం సర్క్యూట్స్ సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘మదగజరాజా’. సుందర్.సి దర్శకుడు. తమటం కుమార్ రెడ్డి నిర్మాత. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. బిగ్ సీడీని విశాల్, వరలక్ష్మి ఆవిష్కరించారు. ఆడియో సీడీలను విశాల్ విడుదల చేసి, తొలి సీడీని వరలక్ష్మికి అందించారు. ఈ సందర్భంగా ...
విశాల్ మాట్లాడుతూ‘’సినిమా లేట్ గా వచ్చినా లెటెస్ట్ గా వస్తున్న సినిమా ఇది. సుందర్.సి గారి దర్శకత్వంలో నేను చేసిన మొదటి సినిమా. ముందే రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాలతో విడుదల ఆలస్యమైంది. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మనోబాల కామెడి సెకండాఫ్ లో హైలైట్ అవుతుంది. నేను, విజయ్ ఆంటోని, విష్ణువర్ధన్ క్లాస్ మేట్స్. ఆ సమయంలో నేను డైరెక్టర్, విజయ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాం. నేను హీరోనయ్యాను. కానీ విజయ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, హీరో అయ్యారు. అంజలి, వరలక్ష్మి అద్భుతంగా నటించారు. సుందర్.సి దర్శకత్వంలో ప్రతి ఏడాది ఓ సినిమా చేయాలనుకుంటారు. అంత బాగా ఎంజాయింగ్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉండే సినిమా’’అన్నారు.
డైరెక్టర్ సుందర్.సి మాట్లాడుతూ‘’విశాల్ చాలా ఎనర్జిటిక్ హీరో. సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. నిజానికి మా కాంబినేషన్ లో మగమహారాజు కంటే ముందే రావాల్సిన సినిమా. కమర్షియల్ ఎంటర్ టైనర్. అంజలి, వరలక్ష్మి ప్రాతలు చక్కగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని మాట్లాడుతూ‘’మంచి మ్యూజిక్ కుదిరింది. విశాల్ ఈ సినిమాలో పాట కూడా పాడారు’’ అన్నారు.
ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ‘’విశాల్ పందెంకోడి తెలుగులో అప్పట్లో ఎలాంటి సక్సెస్ ను అందుకుందో ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని సాధించాలి’’ అన్నారు.
తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ‘’ మా బ్యానర్ పై వచ్చిన డా.సలీం, జిల్లా చిత్రాలు మంచి సక్సెస్ ను సాధించాయి. ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.
వరలక్ష్మి మాట్లాడుతూ‘’ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా విడుదల కోసం చాలా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
సదా(స్పెషల్ సాంగ్),సోనూసూద్, సుబ్బరాజు, సంతానం శరత్ సక్సేనా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, మ్యూజిక్: విజయ్ ఆంటోని, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, కో ప్రొడ్యూసర్: రొక్కం సోమశేఖర్ రెడ్డి, నిర్మాత: తమటం కుమార్ రెడ్డి, డైరెక్టర్: సుందర్.సి.