pizza
Manalo Okadu music launch
'మనలో ఒకడు' ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 August 2016
Hyderaba
d

ఆర్పీ పట్నాయక్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మనలో ఒకడు'. నువ్వు నేను ఫేమ్‌ అనిత కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్‌ మూవీ పతాకంపై జి.సి.జగన్‌ మోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి వపార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితజె.డి.లక్ష్మీనారాయణప్రతాని రామకృష్ణ గౌడ్‌గొల్లపూడి మారుతీరావుచంద్ర సిద్ధార్థ్‌బెనర్జీఅశ్విన్‌బాబు,టి.ఆదిత్యసంతోషం సురేష్‌వరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

బిగ్‌ సీడీఆడియో సీడీలను జె.డి.లక్ష్మీ నారాయణ విడుదల చేశారు.

గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ - ''నేను సినిమా రంగంలోకి వచ్చి 53 సంవత్సరాలు అయ్యాను. మీడియాకు వచ్చి 56 సంవత్సరాలైంది. ఆర్‌.పి.పట్నాయక్‌ ఈ రెండింటిని కలిసి ఈ సినిమాను రూపొందించాడు. కత్తి కంటే కలం పదునైందని అంటారు కానీ ఈ రెండింటి కంటే పదునైంది సినిమా. చెప్పే మీడియాఅమ్మే మీడియా కావడం,ఎంతో కొంత చెప్పాల్సిన మీడియా ఆ రహస్యాన్ని విప్పకుండా వ్యాపారంగా చూస్తేమనలో ఒకడు..మనలాంటి ఒకడు గొంతు విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక స్పృహ అనేది మీడియాకు ఉండాల్సిన లక్షణం. కానీ దాంట్లో వ్యాపారం కలిసి ఉండటం వల్ల ఆ సామాజిక స్పృహ నష్టపోతుంది. దీని వల్ల బలమైన మాధ్యమాన్ని సామాన్య మానవుడు నష్టపతున్నాడని నాకు అనిపిస్తుంది. ఈ నిజాన్ని గట్టిగా పట్టుకుని 24 ఫ్రేమ్స్‌తో చెప్పగల ఏ నిర్మాత అయినాఏ కథకుడైనా చెప్పగలిగితే సమాజానికి మేలు జరుగుతుందని ఈ మనలో ఒకడు సినిమా చెబుతుంది. ఆర్‌.పి. తను తీసే సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత లేకుంటే సినిమా ఆ సబ్జెక్ట్‌ను ముట్టుకోడు. ఇదొక గొప్ప ప్రయోగం. ఇలాంటి సినిమాను ఏ పదిమందైనా ఆదరిస్తే సమాజానికిసినిమాకు మేలు జరుగుతుందని,జరగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ - ''మీడియాలో వచ్చేది న్యూస్‌ కాదువ్యూస్‌ అని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఒక్కొక్క కోణాన్ని చూపిస్తున్నారు కానీ వాస్తవాన్ని చూపడం లేదు. కన్‌స్ట్రక్టివ్‌ క్రిటిసిజమ్‌ ఉన్నప్పుడే మీడియా కానీసినిమా కానీ ఇంకేదైనా కానీ రిఫైన్‌ అయ్యి బాగుపడుతుంది'' అన్నారు. 

జె.డి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ - ''ఆర్‌.పి.పట్నాయక్‌ ఓ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. నా మిత్రుడు భాస్కర్‌ తీసిన ప్రభంజనం సినిమా సమయంలో ఆర్‌.పి. ని కలిశాను. టీజర్‌సాంగ్స్‌ బావున్నాయి. సమాజంలో సామాన్యుడికి ఉన్న రోల్‌ ఏంటిసామాన్యుడుకున్న శక్తి ఏంటని చూపే చిత్రమని తెలుస్తుంది. సమాజంలో ఫోర్త్‌ ఎస్టేట్‌ అని పిలువబడే మీడియాది చాలా కీలకపాత్ర. పొలిటీషియన్‌జర్నలిస్ట్‌ రోల్స్‌ సమాజంలో చాలా కీలకం. సామాన్యుడి శక్తిని తెలియజేసే సినిమా. ప్రతి సామాన్యుడులో ఉన్న శక్తిని పెంపొందించాలి. ఈ సినిమాతో సామాన్య వ్యక్తికి కాన్ఫిడెన్స్‌ పెరుగుతుందనిమార్పు వస్తుందని భావిస్తున్నాను'' అన్నారు.

Anita Hassanandani Glam gallery from the event

ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ - నా మనసులో మాటలను సినిమాలో చెప్పాను. ఈ సినిమా పూర్తవడానికి కారణమైన గీతాంజలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌గారికి థాంక్స్‌. నిర్మాత జగన్‌గారుబాలుగారుఉమేష్‌గారు ఎంతో సపోర్ట్‌ చేసి సినిమాను ముందుకు తీసుకొచ్చారు. నిజాయితీగా నమ్మకంతో చేసిన సినిమా ఇది. ప్రోమోస్‌కు హ్యుజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మీడియాపై చేసిన సినిమాకు మీడియా మిత్రుల నుండి అభినందనలు వచ్చింది. మీడియాలో ఉన్నవారందరూ మంచివారే. అయితే ఎక్కడో మీడియాలో ఉన్న ఈగో ప్యాక్టర్‌ను ప్రశ్నించాలని చేసిన సినిమా. సపోర్ట్‌ చేసివ అందరికీ థాంక్స్‌'' అన్నారు.

చిత్ర నిర్మాత జి.సి.జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ - ''కవితజె.డి లక్ష్మీనారాయణగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

టి.ఆదిత్య మాట్లాడుతూ - ''ఆర్‌.పి.పట్నాయక్‌ మ్యూజిక్‌ గురించి నేను చెప్పనక్కర్లేదు. మంచి సంగీత దర్శకుడే కాదుమంచి వ్యక్తి కూడా. నిర్మాత జగన్‌ మోహన్‌గారికి ఆల్‌ ది బెస్ట్‌. ఇటువంటి మంచి సినిమాను అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

చంద్రసిద్ధార్థ్‌ మాట్లాడుతూ - ''ఆర్‌.పి. సామాజిక సందేశంతో కూడిన సినిమాలు చేస్తూపట్టుదలను కోల్పోకుండా ముందుకు పోతున్నారు. ఆయన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఈ సినిమాతో ఆర్‌.పి. మనలో అసాధ్యుడు కావాలి'' అన్నారు.

శంకర్‌  యాదవ్ మాట్లాడుతూ - ''నేనుజగన్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పనిచేశాం. సినిమా మంచి పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తూ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

సాయికుమార్నాజర్తనికెళ్ల భరణిజయప్రకాశ్ రెడ్డిశ్రీముఖిరఘుబాబుబెనర్జిగొల్లపూడి మారుతీరావురాజా రవీంద్ర, 'జెమినిసురేశ్దువ్వాసి మోహన్సందేశ్గిరిధర్,వరుణ్గుండు సుదర్శన్కృష్ణవేణి, 'జబర్దస్త్రాకేశ్ తదితరులు నటించిన  ఈ చిత్రానికి కెమెరా: ఎస్.జె. సిధ్ధార్ధ్ఎడిటింగ్: ఉద్ధవ్ఆర్ట్: కృష్ణమాటలు: తిరుమల్ నాగ్పాట‌లు:  చైత‌న్య‌ప్ర‌సాద్‌వ‌న‌మాలిపుల‌గం చిన్నారాయ‌ణ‌స‌హనిర్మాతలు: ఉమేశ్ గౌడబాలసుబ్రహ్మణ్యంనిర్మాత: జి.సి. జగన్ మోహన్కథ-స్ర్కీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ఆర్.పి. పట్నాయక్.

 



Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved