యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్‌గా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బేనర్స్ పై పి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించిన చిత్రం 'మనసుకు నచ్చింది'. రాదాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ఫిబ్రవరి 8న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ అమైరా దస్తూర్, దర్శకురాలు మంజుల ఘట్టమనేని, నిర్మాతలు పి.కిరణ్, సంజయ్ స్వరూప్, నటి అనితా చౌదరి, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, ఆర్ట్ డైరెక్టర్ హరి పాల్గొన్నారు. ఈ చిత్రం ఆడియో బిగ్ సీడిని ప్రముఖ జర్నలిస్ట్‌లు ఇన్‌కేబుల్ శ్రీను, నాగేంద్ర ప్రసాద్, చల్లా భాగ్యలక్ష్మీ లాంచ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
దర్శకురాలు మంజుల ఘట్టమనేని మాట్లాడుతూ - ''నేను ఇండస్ట్రీలోనే పుట్టాను. ఇండస్ట్రీ మనిషిని. ఎంతోమంది డైరెక్టర్స్‌ని, ప్రొడ్యూసర్స్‌ని చూశాను. ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి నేను ఏదో ఒక సినిమా డైరెక్ట్ చెయ్యాలని ఈ సినిమా తియ్యలేదు. అలాంటి అవసరం నాకు లేదు. ఈ సినిమా తీశానంటే దానిలో ఏదో ఒక మంచి విషయం వుండబట్టే తీశాను. ఇది చాలా చాలా మంచి సినిమా. నేను ఏంటి అనేది ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడుగారు ఈ సినిమా చూశారు. చూశాక ఎక్స్‌లెంట్‌గా వుంది. ఒన్ ఆఫ్ ది బెస్ట్ లవ్‌స్టోరి అన్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. నచ్చనివారుండరు. హార్ట్ వున్న ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా ఇది. మా ఆయన ఈ చిత్రంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. రీసెంట్‌గా 'దూకుడు' తర్వాత అర్జున్‌రెడ్డి చేశారు. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది. ఆయన చాలా లక్కీ యాక్టర్. అలాగే మా పాప జాన్వి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. వారిద్దరూ ఈ చిత్రంలో నటించడం చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. సూరజ్ క్యారెక్టర్‌లో సందీప్, అమైరా దస్తూర్ పర్‌ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బ్యూటిఫుల్‌గా నటించింది. బేసిగ్గా నేను రొమాంటిక్ పర్సన్‌ని. నాకు లవ్‌స్టోరిస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక అందమైన లవ్‌స్టోరిని కథగా రాసుకున్నాను. ఫస్ట్ ఈ కథ కిరణ్‌గారు విని చాలా బాగుంది అన్నారు. అదే రోజు రైటర్ సాయిమాధవ్ బుర్రా విని చాలా అద్భుతంగా వుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి లవ్‌స్టోరీస్ రాలేదు అనడంతో కిరణ్‌గారికి, నాకు ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. అలా ఈ చిత్రం స్టార్ట్ అయ్యింది. కిరణ్‌గారు బడ్జెట్‌కి వెనకాడకుండా చాలా రిచ్‌గా గ్రాండ్‌గా పెద్ద బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ నా మాట అస్సలు వినడు. నేను డైరెక్షన్ చేస్తున్నానంటే ఇప్పటికీ నమ్మడు. సాంగ్స్, ట్రైలర్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈ సినిమాకి మహేష్ నేచుర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సినిమాకి ఇది హైలెట్‌గా నిలుస్తుంది. నా దగ్గర ఒక అద్భుతమైన సబ్జెక్ట్ వుంది. అది పవన్‌కళ్యాణ్‌గారికి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఆయన చాలా జెన్యూన్ పర్సన్. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా డిఫరెంట్‌గా వుంటారు. ఆ కథ పవన్‌కళ్యాణ్ విన్నారంటే తప్పకుండా నాకు సినిమా చేస్తారు. ఈ సినిమా ఒక్కటి చేశాక ఆయన పొలిటికల్ సైడ్ వెళ్ళొచ్చు. మహేష్ ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చూసి షాక్ అయ్యాడు. వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. నా నెక్స్‌ట్ మూవీ మూవీ కూడా కిరణ్‌గారే ప్రొడ్యూసర్'' అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ - ''ఫన్ అండ్ స్వీట్ లవ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని మంజులగారు రూపొందించారు. ఇది ఓ జానర్ మూవీ అని కొంతమంది అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. సినిమా చూశాక ఇది ఒక మంచి కాఫీలాంటి సినిమా అన్పించింది. నాకు కథ ఏమైతే చెప్పారో యాజ్‌టీజ్‌గా అదే స్క్రీన్‌పై తీశారు మంజులగారు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసేవిధంగా కలర్‌ఫుల్‌గా ఈ చిత్రం వుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తుకు తెచ్చే అందమైన సినిమా ఇది. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యని ఒక ఇంట్రెస్టింగ్ మెస్సేజ్ ఈ చిత్రంలో వుంటుంది. అమైరా దస్తూర్, త్రిదా చౌదరి ఫెంటాస్టిక్‌గా నటించారు. మా ముగ్గురు మధ్య కథ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ప్రియదర్శి, ఆదిత్, పునర్వి ఫ్రెండ్స్‌గా నటించారు. రియల్ లైఫ్‌లో ఫ్రెండ్స్ ఎలా వుంటారో అలా జెన్యూన్‌గా జెల్ అయి కలిసి నటించాం. రాదాన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో యష్‌రాజ్ ఫిలింస్‌లా వుండాలని మా డిఓపి రవియాదవ్ ఈ చిత్రాన్ని అందంగా చిత్రీకరించారు. ఇందిరా ప్రొడక్షన్‌లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన కిరణ్‌గారి ఆనంది ఆర్ట్స్‌లో ఇది నా మూడవ సినిమా. ఈ సినిమా చూసి బయటికి వచ్చాక అందరూ మంచి సినిమా. బాగా ఎంజాయ్ చేశాం అనే మాట చెప్తారు అని కాన్ఫిడెన్స్‌గా వున్నాం'' అన్నారు.
మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ - ''ఈ సినిమా అందరి ప్రేక్షకుల మనసులకి నచ్చే కథ. అందరికీ నచ్చే డైలాగ్స్ రాయడానికి ట్రై చేశాను. ఈ క్రెడిట్ అంతా మంజులగారికే దక్కుతుంది. ప్రతిదీ పక్కా క్లారిటీతో మనసులకి హత్తుకునేలా డైలాగ్స్ రాయించుకున్నారు. ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్‌ని ఎవరికి వారు ఐడెంటిఫై చేసుకుంటారు. అది పెద్ద ఎస్సెట్‌గా నిలుస్తుంది. కనిపించే యాక్షన్ వుండదు. కానీ మనసుకి నచ్చే యాక్షన్ సీన్స్ వుంటాయి. ప్రతి ఒక్కరికీ ఇలాంటి సినిమా అవసరం. ఏ సినిమాకైనా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటాం. కానీ ఈ సినిమా రిలీజ్ కోసం ఇంకా ఎక్కువగా చూస్తున్నాను'' అన్నారు.
నిర్మాత పి.కిరణ్ మాట్లాడుతూ - ''మంజుల కథ చెప్పగానే బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా తీశాను. బేసిగ్గా నాకు లవ్‌స్టోరి మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకే అందరికీ నచ్చుతుందని ఈ సినిమా తీశాను. సినిమా బాగా నచ్చింది. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
నిర్మాత సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ - ''సినిమా చూశాక హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా వున్నాం. అందరికీ నచ్చేలా ఒక మంచి సినిమా తీసిన మంజులకి నా కంగ్రాట్స్. కిరణ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో హార్డ్‌వర్క్‌తో ఈ సినిమాకి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్. ఒక మంచి సినిమా చూశామని ఆడియన్స్ అంతా ఫీలవుతారు'' అన్నారు.
హీరోయిన్ అమైరా దస్తూర్ మాట్లాడుతూ - ''కొత్త నటినైనా నామీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన మంజులగారికి నా థాంక్స్. కిరణ్‌గారు అందరి కంటే ముందుగా సెట్‌కి వచ్చి లొకేషన్స్‌లో అందర్నీ బాగా చూసుకునేవారు. సంజయ్ స్వరూప్‌గారు వెరీ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్. సందీప్‌కిషన్ వెరీ స్వీట్ కో-ఆర్టిస్ట్. ఇంతమంచి చిత్రంలో నటించినందుకు ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను'' అన్నారు.