pizza
Varun Sandesh' Mister 420 Music Launch
మిస్టర్ 420` ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 August 2016
Hyderaba
d

వరుణ్ సందేశ్ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జల హరికుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `మిస్టర్ 420`. రియాన్ ముస్తఫా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. సి.కల్యాణ్ బిగ్ సీడీ,ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

సి.కల్యాణ్ మాట్లాడుతూ ``మంచి టైటిల్. పాటలు బావున్నాయి. వరుణ్ సందేశ్ పెళ్ళి తర్వాత విడుదలవుతున్న సినిమా. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

తమారెడ్డి  భరద్వాజ మాట్లాడుతూ ``వరుణ్ పెళ్ళి తర్వాత వస్తున్న సినిమా పెద్ద హిట్ అవుతుంది. మ్యూజిక్ డరెక్టర్ ముస్తఫా మంచి మ్యూజి అందించాడు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారవి భావిస్తున్నాం`` అన్నారు.

చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ ``నేను దర్శకుడిగా చేసిన తొలి చిత్రం ప్రేమ ప్రయాణం. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించి, ప్రేక్షకుల ఆశీర్వాదం లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను. ముఖ్యంగా నిర్మాత హరికుమార్ గారు నన్ను నమ్మి సినిమా చేశారు. టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది`` అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ``నిర్మాత హరిగారు సపోర్ట్ తోనే అనేక సమస్యుల ఎదురైనా సినిమాను పూర్తి చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నా కెరీర్ కు ఈ చిత్రం మంచి టర్నింగ్  పాయింట్ అవుతుందనుకుంటున్నాను`` అన్నారు.

Priyanka Bhardwaj Glam gallery from the event

నిర్మాత హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ``మంచి సినిమా చేశాం. వరుణ్ సందేశ్, డైరెక్టర్ అందరూ కలిసి మంచి సినిమా చేయగలిగాం‘‘ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. వరుణ్ సందేశ్ నటన సినిమాకు హైలైట్. మ్యూజిక్ విషయంలో  ముస్తఫా చక్కటి తోడ్పాటు అందించారు. ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. మంచి టీం కుదిరింది‘‘ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ముస్తఫా మాట్లాడుతూ ``మంచి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.

కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ``సాంగ్స్, ట్రైలర్ బావున్నాయి. సినిమా పెద్ద హిట్ అయ్యి దర్శక నిర్మాతలతో సహా అందరికీ మంచి పేరు రావాలి`` అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

నటీనటులు 

వరుణ్ సందేశ్ప్రియాంక భరద్వాజ్సాయాజి షిండేరఘు బాబుపృథ్వీ (30 ఇయర్స్)సాయి (ఈరోజుల్లో) షానిశేఖర్ (ఛత్రపతి)జీవారఘు కారమంచిరచ్చ రవిమీనా  

టెక్నీషియన్స్ ,కొరియో గ్రాఫర్ - రఘుస్వర్ణశేఖర్సుధీర్ , స్టంట్స్ – నందు, లిరిక్స్ - చంద్రబోస్అనంత శ్రీరామ్ 

ఎడిటింగ్ - నందమూరి హరి, సినిమాటోగ్రాఫర్ - జశ్వంత్ , మ్యాజిక్ - రియాన్ ముస్తఫా,  డైలాగ్స్ - మోహన్ చంద్ర 

డైరెక్టర్ - ఎస్.ఎస్.రవికుమార్, ప్రొడ్యూసర్ - హరికుమార్ రెడ్డి గజ్జల.



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved