బీప్‌టోన్ స్టూడియోస్, శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా `నన్ను వదిలి నీవు పోలేవులే`. బాలకృష్ణ కోలా, వామికా జంటగా నటించారు. కల్యాణ్ నటరాజన్, శరణ్, పార్వతి నాయర్ ఇతర పాత్రధారులు. శ్రీరాఘవ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వం వహించారు. కోలా భాస్కర్, కంచర్ల పార్థసారథి నిర్మాతలు. అమృత్ సంగీతాన్ని సమకూర్చారు. అనంతశ్రీరామ్ పాటలు రాశారు. ఆ పాటలను హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్లో ఆదివారం రాత్రి విడుదల చేశారు. తొలి సీడీని వేద విడుదల చేశారు. తొలి సీడీని చిత్ర కథానాయిక వామిక అందుకున్నారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ``కోలాభాస్కర్‌గారు ఎడిటర్‌గా ఎంతటి సుప్రసిద్ధులో మనందరికి బాగా తెలుసు. ఆయన సినిమాలే లోకంగా బతికారు. ఒకటిన్నరేళ్ళు కష్టపడి ఈ సినిమాను చేశారు. తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ హీరో డబ్బింగ్ చెబుతున్నప్పుడు విన్నాను. చాలా మంచి వాయిస్ అతనిది. తప్పకుండా సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. హీరో పేరును క్రిష్ అని పెడితే బావుంటుందని అనుకుంటున్నాను. టీజర్ చాలా బావుంది. పాటలు తప్పకుండా యువతను ఆకట్టుకుంటాయి`` అని చెప్పారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ ``ఈ సినిమాకు తమిళంలో ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే ఆసక్తిని కలిగించింది. తెలుగులోనూ, తమిళంలోనూ ఒకేసారి విడుదల చేయడానికి ఇక్కడ నేను కొనుక్కోవాలని ప్రయత్నించాను. ఆ క్రమంలోనే ప్రసాద్ ల్యాబ్‌లో ఒక పాటను చూశాను. చాలా బాగా అనిపించింది. హీరో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. శ్రీరాఘవ చేసిన ‘7/ జి బృందావన్ కాలనీ’ కన్నా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు ఉంది. కోలా బాలకృష్ణను ఈ సినిమా గ్రాండ్ లాంచ్‌గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను`` అని అన్నారు.
ఏసీపీ కాళేశ్వరరావు మాట్లాడుతూ ``సినిమా సూపర్ హిట్ కావాలి. క్రిష్‌కి మంచి పేరు రావాలి`` అని చెప్పారు.
సీవీ రెడ్డి మాట్లాడుతూ ``కోలా భాస్కర్ నాకు 4,5 సినిమాలు చేశారు. నాకు ఆయన ఎడిటింగ్‌లో గురువు. నేను ఆయన దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నాను. దర్శకుడు అనే వాడికి ఎడిటింగ్ తెలిసి ఉండాలి. ఎడిటర్‌కి డైరక్షన్ తెలుస్తుంది. ఆ రెండు శాఖలకు సంబంధం తప్పకుండా ఉంటుంది. కోలా భాస్కర్ భవిష్యత్తులో దర్శకత్వం చేయాలని ఆకాంక్షిస్తున్నా. కోలా భాస్కర్ వాళ్ళబ్బాయిని హీరోగా పెట్టి సినిమాను డైరక్ట్ చేయాలని కూడా ఆశిస్తున్నా`` అని అన్నారు.
అమర్‌నాథ్ మాట్లాడుతూ ``తమిళంలో ‘మాలైనేరత్తు మయక్కం’ అనే సినిమాను చూశాను. ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి`` అని అన్నారు.
అనంతశ్రీరామ్ మాట్లాడుతూ ``ఖర్చు గురించి ఆలోచించకుండా కథ గురించి ఇంత ఖర్చుపెట్టి సినిమా చేస్తారని అనుకోలా. అమృత్ తొలి సినిమాకు నేను తెలుగులో పాటలు రాస్తానని అనుకోలా. శ్రీరాఘవగారి సినిమాలకు పాటలన్నీ రాస్తానని అనుకోలా. కోలాగారు చేసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. కోలా బాలకృష్ణ తొలి సినిమాకే శ్రీరాఘవగారితో పనిచేయడం చాలా గొప్ప విషయం. తను చాలా నలిగాడు. అలాగే గొప్పగా నటనను ప్రదర్శించగలిగాడు`` అని చెప్పారు.
అమృత్ మాట్లాడుతూ ``సంగీతానికి లాంగ్వేజ్ లేదని నమ్ముతాను నేను. టాలీవుడ్‌లోకి ఈ సినిమాతో ఎంటర్ కావడం ఆనందంగా ఉంది. కోలా భాస్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని మర్చిపోలేను. తెలుగు, తమిళ్‌లో శ్రీరాఘవగారితో, గీతాంజలిగారితో ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అనంతశ్రీరామ్ చాలా బాగా లిరిక్స్ రాశారు. తమిళంలో ఏ ఫీలింగ్‌తో సాహిత్యం సాగుతుంటుందో, తెలుగులో కూడా అదే ఫీలింగ్‌తో పాటలు సాగడం హ్యాపీ. హీరో నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. చాలా వండర్‌ఫుల్‌గా పెర్ఫార్మెన్స్ చేశాడు. వామికా చక్కగా నటించింది. ఆమె ఇప్పుడు నా ఫేవరేట్ యాక్ట్రెస్`` అని అన్నారు.
అర్చన మాట్లాడుతూ ``అమృత్ పాటలు బావున్నాయి. శ్రీరాఘవగారు ఈ సినిమాకు అమృత్‌ను ఎంపిక చేసుకున్నారంటేనే అతనిలో ఉన్న పొటన్షియాలిటీ ఏంటో అర్థమైపోతుంది. అరేంజ్ మేరేజ్ పాట, ఇంకో రొమాంటిక్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్లు బావున్నాయి. కోలా బాలకృష్ణ కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. పోస్టర్లు చూస్తుంటేనే తను ఎంత బాగా నటించాడో అర్థమవుతుంది`` అని చెప్పారు.
పూనమ్ కౌర్ మాట్లాడుతూ ``టీజర్ చూస్తుంటేనే ఈ టీమ్ పడ్డ హార్డ్ వర్క్ ఏంటో అర్థమైపోతోంది. తప్పక హిట్ కావాలి`` అని అన్నారు.
జ్యోతి మాట్లాడుతూ ``టీజర్లు, ట్రైలర్లు చాలా బావున్నాయి. హార్డ్ వర్క్ తప్పకుండా క్లిక్ అవుతుంది`` అని అన్నారు.
శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ``మా భలే మంచి రోజు సినిమాలో వామిక నాయికగా నటించింది. ఈ సినిమాలోని హీరో నాకు జూనియర్. శ్రీరాఘవగారితో తొలి సినిమా చేశాడంటే అతని పొటన్షియల్ అర్థమవుతోంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్ కావాలి`` అని చెప్పారు.
కోలా బాలకృష్ణ మాట్లాడుతూ ``నాకు క్రిష్ అనే పేరు కన్నా కోలా బాలకృష్ణ అనే పేరే చాలా ఇష్టం. ఈ సినిమాను చేసిన శ్రీరాఘవగారికి, గీతాంజలిగారికి, మా నాన్నగారికి, పార్థసారథిగారికి చాలా థాంక్స్. అమృత్ నాకు మంచి ఫ్రెండ్. వామిక చక్కగా నటించింది. ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అవుతుందని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను`` అని అన్నారు.
వామిక మాట్లాడుతూ ``తెలుగులో భలే మంచి రోజు హిట్ కావడం, రెండో సినిమాగా నన్ను వదలి నీవు పోలేవులే విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా ఉండాలనుకునే శ్రీరాఘవగారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. గీతాంజలి చాలా కూల్ డైరక్టర్. నాకు శ్రీరాఘవ గొప్ప గురువుగా వ్యవహరించారు. సెట్‌లో ఆయన దగ్గర చాలా డిసిప్లిన్‌గా ఉండాలని అందరూ చెప్పేవారు. కానీ ఆయన మాత్రం సరదాగానే ఉండేవారు. కోలా బాలకృష్ణ, నేను కలిసి చేసిన సన్నివేశాలన్నీ యువతకు చాలా బాగా నచ్చుతాయనే నమ్మకం ఉంది. నేటి ట్రెండ్‌కి తగ్గ సినిమా ఇది. కోలాభాస్కర్‌గారి నిర్మాణ విలువలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు`` అని అన్నారు.
బి.ఎ.రాజు మాట్లాడుతూ ``భాస్కర్ ఎడిటర్‌గా సక్సెస్ ఫుల్ అయ్యారు. ఈ సినిమా తమిళంలో సక్సెస్ అయింది. తెలుగులోనూ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అని చెప్పారు.
కృష్ణతేజ మాట్లాడుతూ ``రాఘవగారి సినిమా అంటేనే ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ఎంత బాగా తీశారంటే నేను ప్రతి డైలాగును పది వెర్షన్లలో రాసుకుని చూసుకునేలా తీశారు. అంత ఇంప్రెస్ చేసింది ఈ సినిమా. యువత తప్పకుండా చూడాల్సిన సినిమా. హీరో, హీరోయిన్ల జంట తప్పకుండా యువతకు నచ్చుతుంది. నేటి యువతకు ప్రతిరూపంగా వారు తెరపై కనిపిస్తారు. అందరూ చూడాల్సిన సినిమా అయినప్పటికీ, ముఖ్యంగా యువతకు మరింతగా చేరువయ్యే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా మౌత్‌టాక్‌తో హిట్ అవుతుంది`` అని అన్నారు.
కోలా భాస్కర్ మాట్లాడుతూ ``శ్రీరాఘవగారితో జర్నీ మొదలైనప్పటి నుంచి బయటి సినిమాలు దాదాపుగా వదిలేశాను. ఎందుకంటే అతనితో సినిమా అంటే అదో లోకం. ఆయన నా ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చిన వేల్యూ ఈ సినిమా. ఆయనతో సినిమా చేయడమంటే పెద్ద సాహసం చేసినట్టు. ఆయనలో ఉన్న క్రియేటర్‌ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే క్రియేటర్ ఆయన. ఎవరి మాటా వినరు. కానీ నేనేం చెప్పినా వినేవారు. ప్రతి రూపాయినీ క్వాలిటీ కోసమో ఖర్చుపెట్టే డైరక్టర్ ఆయన. ఈ సినిమాను మేం తీసే తీరు చూసి చాలా మంది ఓ స్టేజ్‌లో చాలు అని కూడా హెచ్చరించారు. కానీ ఎడిటర్ తీస్తున్న సినిమా బయటికి వచ్చిన తర్వాత అందరి మన్ననలు పొందాలి అని ఎక్కడా రాజీ పడకుండా చేశాం. మా అబ్బాయి పేరును క్రిష్ అని పెడదామని షూటింగ్ సమయంలో చాలా సార్లు తర్జనభర్జనలు పడ్డాం. అయితే శ్రీరాఘవగారికి ఆ పేరు ఎందుకో నచ్చలేదు. మా అబ్బాయి బాలకృష్ణగారికి పెద్ద ఫ్యాన్. వాడికి ఆయన పేరంటే చాలా ఇష్టం. అందుకే కోలా బాలకృష్ణ అనే పేరునే ఇష్టపడ్డాడు. మా అబ్బాయి, వామి జంట మెప్పిస్తుంది. ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా తీశాం. అందుకు నాకు వెన్నుదన్న
ుగా ఉన్న వ్యక్తి పార్థసారథిగారు. అంతటి పాజిటివ్ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. నాకు ఆయన అందించిన సహకారం మరువలేనిది. అలాగే ఎడిటర్‌గా నా తొలి నాళ్ళలో నన్ను ప్రోత్సహించిన నాగేశ్వరరావుగారిని కూడా మరువలేను`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతల శ్రేయోభిలాషులు కిశోర్, సిరిచందన, వాసు, పీవీఆర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో థింక్ మ్యూజిక్ ద్వారా విడుదలైంది.