pizza
Neerajanam music launch
`నీరాజనం` ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

31 August 2016
Hyderaba
d

మగేష్‌సభ్యసాచికారుణ్యబన్ని ప్రకాష్‌ ప్రధాన తారాణంగా డి.జి.వి.లక్ష్మీ సమర్పణలో మహాలక్ష్మి మూవీస్‌ బ్యానర్‌పై అవన్‌ ఆళ్ళ దర్శకత్వంలో దాడి అప్పలనాయుడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం'నీరాజనం'. రవిశంకర్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. బిగ్‌ సీడీని రాజ్‌ కందుకూరి విడుదల చేయగాఆడియో సీడీలను మల్కాపురం శివకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా...

దర్శకుడు అవన్‌ ఆళ్ళ మాట్లాడుతూ - ''సంగీతం నేపథ్యంలో జరిగే సినిమా ఇది. సినిమా బాగా వచ్చింది. నిర్మాత దాడి అప్పలనాయుడుగారు కథను నమ్మి నాపై నమ్మకంతో సినిమా అంతటినీ నాకు అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. రవిశంకర్‌ చాలా మంచి సంగీతం అందించారు. మహీశేర్ల ప్రతి సీన్‌ను రిచ్‌గా చూపించారు. సినిమాను తెలుగుతమిళం,ఓరియా భాషల్లో విడుదల చేస్తున్నాం'' అన్నారు.

దాడి అప్పలనాయుడు మాట్లాడుతూ - ''దర్శకుడు అవన్‌ అళ్ళగారు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యాను. సినిమా పూర్తయ్యే వరకు దర్శకుడిపై నమ్మకంతో సెట్స్‌లోకి వెళ్లలేదు. సినిమా మేకింగ్‌లో సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

Glam galleries from the event

సంగీత దర్శకుడు రవిశంకర్‌ మాట్లాడుతూ - ''సంగీత నేపథ్యంలో సాగే చిత్రమిది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''పాటలు చాలా బావున్నాయి. రవిశంకర్‌ సంగీతం ఆకట్టుకుంది. సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను''అన్నారు.

మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ - ''దర్శక నిర్మాతలు ఒక పక్కా ప్లానింగ్‌తో సినిమాను మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. సినిమా అన్నీ భాషల్లో మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను''అన్నారు.

ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ సహా చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

బన్ని ప్రకాష్‌ఎల్‌.బి.శ్రీరాంసూర్యవైజాగ్‌ ప్రసాద్‌నల్ల వేణుఅప్పారావు తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి మాటలు: అవన్‌ఐ.రవిసినిమాటోగ్రఫీ: మహీశేర్లసంగీతం: రవిశంకర్‌నిర్మాత: దాడి అప్పలనాయుడుకథస్క్రీన్‌ప్లేదర్శకత్వం: అవన్‌ అళ్ళ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved