08 August 2016
Hyderabad
కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ 'నిర్మలా కాన్వెంట్'. ఈ చిత్రంలో నాగార్జున ఓ కీలకపాత్రలో నటించారు. రోషన్ సాలూరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం(సెప్టెంబర్ 8) హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.
ఆడియో బిగ్ సీడీని అల్లు అరవింద్ విడుదల చేశారు. ఆడియో సీడీలను నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల చేసి తొలి సీడీని అల్లు అరవింద్ కు అప్పగించారు. ఈ సందర్భంగా .....
నాగార్జున మాట్లాడుతూ - ''నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో నా గొంతు పీలగా ఉంటుందని అందరూ అనేవారు. అలాంటి నన్ను రోషన్ సాలూరి మీ గొంతు బావుంది పాట పాడుతారా..అని అడగడంతో వెంటనే ఒప్పేసుకున్నాను. ఇక శ్రీకాంత్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. చాలా సినిమాల్లో కలిసి నటించాం. ఇప్పుడు తన అబ్బాయి రోషన్‌తో కలిసి యాక్ట్ చేశాను. తను చాలా కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేశాడు. తను చాలా హ్యండ్ సమ్‌గా ఉన్నాడు. సినిమాను తన భుజాలపై మోశాడు. 77 సంవత్సరాల క్రితం ఘంటశాల బలరామయ్యగారు నాన్నగారిని పిలిచి చూడటానికి బాగున్నావ్..సినిమాల్లో నటిస్తావా అని కొత్తవారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అ డిగారు. ఆయనలా అడగంతోనే ఈరోజు మేం అందరం ఇక్కడ నిలబడి ఉన్నాం., అన్నపూర్ణ స్టూడియో ఏర్పడింది. ఆయన ఇన్సిపిరేషన్‌తోనే నేను కొత్తవాళ్లను ఎంరేజ్ చేస్తుంటాను. ఈ సినిమాతో చాలా మంది కొత్తవాళ్ళను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు నాగకోటేశ్వరరావుగారికి అభినందనలు. ఈ సినిమా సక్సెస్ అయితే జి.కెతో నేను ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.ఈ ఏడాది నేను ఓం నమో వేంకటేశాయ చిత్రంలో మాత్రమే నటిస్తాను. తర్వాత చైతు, అఖిల్‌లతో సినిమాలు చేయాలి. నా కెరీర్‌లోనే సోగ్గా
డే చిన్నినాయనా వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చిన కల్యాణకృష్ణ దర్శకత్వంలో చైతు హీరోగా ఓ సినిమా ఉంటుంది. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ అయితే, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు సహా చాలా మంచి టీంతో సినిమా ఉంటుంది. తర్వాత మా అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా ఉంటుంది. ఈ సినిమా అఖిల్‌కు రీ లాంచింగ్ మూవీ అవుతుంది'' అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ''నిమ్మగడ్డ ప్రసాద్ నాకు, నాగార్జునగారికి మంచి మిత్రుడు. నిబద్థత గల వ్యక్తి. బాహుబలి వంటి పెద్ద సినిమా తీయగల శక్తి ఉన్నా చిన్న సినిమాతో నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు. అలాగే కొత్తదనం ఎక్కడ ఉన్నా ఎంకరేజ్ చేసే నాగార్జునగారికి ఆల్ ది బెస్ట్. ఇక ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం జి.కె. తను ఇండస్ట్రీలో చాలా మందికి తలలో నాలుకలా ఉండే వ్యక్తి. ఈ సినిమాతో ముగ్గురు రోషన్‌లు, శ్రియా శర్మ సహా చాలా మంది కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు, అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - ''నాగార్జునగారికి థాంక్స్. దర్శకుడు నాగకోటేశ్వరరావుగారికి, జి.కెగారికి, నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి థాంక్స్. ఈ కథ వినగానే చాలా మంచి సబ్జెక్ట్ రోషన్ చేస్తే బావుంటుందని రోషన్‌ను వెళ్లి నాగార్జున, నిమ్మగడ్డప్రసాద్‌లు నిర్మాతలుగా ఓసినిమా ఉంది చేస్తావా అని అడిగాను. తను వెంటనే యాక్ట్ చేస్తానని అన్నాడు. అలాగే తను నటిస్తున్నప్పుడు ఒకసారి సెట్స్‌లోకి వెళ్ళాను. తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అది చూసి నేను ఆ తర్వాత సెట్స్ లోకి వెళ్ళడమే మానేశాను. నాగార్జునగారితో మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఈ సినిమాలో నా అబ్బాయిని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయనకు థాంక్స్. జి.కె అండ్ టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
రోషన్ మాట్లాడుతూ - ''నిర్మలా కాన్వెంట్ టీనేజ్ లవ్‌స్టోరీతో పాటు ఫ్రెష్ అండ్ ప్యూర్ లవ్‌స్టోరీ. ప్రతి ఫ్రేమ్ గుర్తుకు పెట్టుకునేలా డైరెక్టర్‌గారు సినిమాను తెరకెక్కించారు. రోషన్ సాలూరి సూపర్బ్ మూవీని తెరకెక్కించారు. అమ్మా నాన్నలకు థాంక్స్. అమ్మనాన్నలు గర్వపడేలా అందరితో నడుచుకుంటాను. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన కింగ్ నాగార్జునగారికి స్పెషల్ థాంక్స్. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి థాంక్స్'' అన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ - ''స్టోరీ లైన్ తెలుసు. మంచి డైరెక్టర్, బ్యానర్, నిర్మాతలు సహా టీంతో రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్‌గారి అబ్బాయి, కోటిగారి అబ్బాయి రోషన్ సాలూరి సహా అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
Glam galleries from the event |
|
|
నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ - ''కొత్త నటీనటులు, టెక్నిషియన్స్‌తో చేస్తున్న ఈ సినిమా గురించి జి.కె. నాకు చెప్పగానే కథ విన మంచి సినిమా అవుతుందని నిర్మాతగా చేయడానికి ముందుకు వచ్చాను. అలాగే నా స్నేహితుడు నాగార్జునగారు కూడా నిర్మాణ పరంగానే కాకుండా సినిమాలో నటించి కూడా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన కీలకపాత్రలో నటించారు'' అన్నారు.
కోటి మాట్లాడుతూ - ''ఏఎన్నార్, నాన్నగారి కాంబినేషన్‌లో ఎన్నో గొప్ప మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్నాయి. అలాగే నేను, నాగార్జునగారు కలిసి నాలుగు సినిమాలు చేశాం. అన్నీ మంచి మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు నా అబ్బాయి రోషన్ సాలూరి నాగార్జునగారితో పాట పాడించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సినిమా ఆడియో వేడుకతో పాటు నా పెద్దబ్బాయికి పెళ్ళి నిశ్చయమైంది. అలాగే నా గురువు చక్రవర్తిగారి పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం విశేషం'' అన్నారు.
చిత్ర దర్శకుడు జి.నాగకోటేశ్వరరావ మాట్లాడుతూ - ''నేను ధవళ సత్యంగారి వద్ద ఆర్టిస్టు కావాలని వెళ్లి ఆయన ప్రోత్సాహంతో దర్శకత్వ శాఖలో చేరాను. ఇప్పుడు కింగ్ నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారి సపోర్ట్‌తో దర్శకుడిగా నిర్మలా కాన్వెంట్‌తో పరిచయం అవుతున్నాను. ప్రపంచంలో ప్రేమకు ఇన్‌స్పిరేషన్ ఏదీ లేదని చెప్పే కథ ఇది. ఈ సినిమాలో రోషన్, శ్రియా శర్మ, రోషన్ సాలూరి, రోషన్ కనకాల సహా చాలా మంది కొత్తవారు పరిచయం అవుతున్నారు. కింగ్ నాగార్జునగారు ఈ సినిమాలో నటించడం చాలా గొప్ప విషయం. ఆయన కోసం రాసుకున్న పాత్ర. ఆయన ఒప్పుకోకుంటే ఈ సినిమాను ఆలస్యమై ఉండేది. అయితే ఆయనకు కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆయనకు థాంక్స్. రోషన్ సాలూరి అద్భుతమైన సంగీతానందించారు. ఎ.ఆర్.రెహమాన్‌గారి తనయుడు అమీన్ పాట పాడటం, అలాగే నాగార్జునగారు నటించడంతో పాటు పాడటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలను అందుకునే సినిమా అవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి తర్వాత ఈ చిత్రంతో నాగార్జునగారు హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తారు'' అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.
కింగ్ నాగార్జున ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రోషన్, శ్రేయాశర్మ, ఎల్.బి.శ్రీరాం, ఆదిత్య మీనన్, సమీర్, రవిప్రకాష్, సూర్య, ప్రసన్నకుమార్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, ప్రభు, ప్రవీణ్, సత్యకృష్ణ, అనితా చౌదరి, భార్గవి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: కాన్సెప్ట్ ఫిలింస్, రచనా సహకారం: లిఖిత్ శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, సంగీతం: రోషన్ సాలూరి, ప్రొడక్షన్ డిజైనర్: చునియా, లైన్ ప్రొడ్యూసర్: పద్మ ఇరువంటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి.వెంకటేశ్వరరావు, ఆర్ట్: రమణ వంక, డాన్స్: రఘు, భాను, విజయ్, ఫైట్స్: మార్షల్ రమణ, ఎడిటింగ్: మధుసూదనరావు, అసోసియేట్ డైరెక్టర్ కోలా రామ్మోహన్, కో-డైరెక్టర్: గంగాధర్ వర్థనీడి, నిర్మాతలు: నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, రచన-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.