pizza
Panthulu Gaari Ammayi music launch
‘పంతులుగారి అమ్మాయి’ ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 February 2016
Hyderabad

కన్నడంలో విజయం సాధించిన ‘రోజ్’ చిత్రాన్ని శ్రీమతి చంద్రకళ సమర్పణలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సహన హెచ్.ఎస్. దర్శకత్వంలో వరప్రసాద్ నిర్మాతగా తెలుగులో ‘పంతులుగారి అమ్మాయి’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ‘ప్రేమకథ’ అనేది ట్యాగ్ లైన్. సాయికుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. కృష్ణ అజయ్ రావు, శ్రావ్య హీరో హీరోయిన్లు. బుల్లెట్ ప్రకాష్, సాధుకోకిల ఇతర తారాగణంగా నటిస్తున్నారు. అనూప్ సిలీన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీలను సాగర్ విడుదల చేయగా, టి.ప్రసన్నకుమార్ తొలి సీడీని అందుకున్నారు.

నిర్మాత వరప్రసాద్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా కన్నడంలో పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్ లో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నాను. సాయికుమార్ గార స్పెషల్ క్యారెక్టర్ చేశారు. ఫిభ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు మార్చిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సినిమాను ఆదరించి పెద్ద హిట్ చేయాలి’’ అన్నారు.

రచయిత శ్రీ సాయి మాట్లాడుతూ ‘’పాటలు, డైలాగ్స్ బాగా వచ్చాయి. యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు

సాగర్ మాట్లాడుతూ ‘’ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే కన్నడ సినిమా అయినా తెలుగు నెటివిటీ కనపడుతుంది. కన్నడలో విజయం సాధించిన విధంగానే తెలుగులో పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు.

టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘’సాయికుమార్ గారి పాత్ర ప్లస్ అవుతుంది. ఈ నిర్మాతలు తెలుగులో నేరుగా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు మూడువేల మినీ థియేటర్స్ కట్డడానికి అనుమతినిచ్చారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారు అమ్మ థియేటర్స్ కోసం 50 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా చర్చలు చేపట్టాలి’’ అన్నారు.

ఈ చిత్రానికి మాటలు, పాటలు: శ్రీసాయి, శ్రీమతి వెల్లంకి విజయలక్ష్మి, సహ నిర్మాతలు: శ్రీమతి అందాల రాజేశ్వరి, ముద్దం రామచంద్రుడు, నిర్మాత: వరప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సహన హెచ్.ఎస్.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved