pizza
Pelli Chupulu music launch
'పెళ్ళి చూపులు' ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

07 July 2016
Hyderabad

విజయ్ దేవరకొండరీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌వినూతన గీత బ్యానర్స్ పై  రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ 'పెళ్ళి చూపులు'.  నిర్మాత రాజ్ కందుకూరియస్ రాగినేనితో కలిసి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది.

థియేట్రికల్ ట్రైలర్ ను సందీప్ కిషన్, తమ్మారెడ్డి భరద్వాజ, క్రాంతిమాధవ్ లు విడుదల చేశారు.

బిగ్ సీడీ, ఆడియో సీడీలను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేయగా, తొలి ఆడియో సీడీని తమ్మారెడ్డి భరద్వాజ అందుకున్నారు. ఈ సందర్భంగా....

కె.ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ ``విజువ‌ల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. టైటిల్ క్యాచీగా ఉంది. ఈ సంద‌ర్భ‌గా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా బెస్ట్ విషెష్ `` అన్నారు.

రామ‌రాజు మాట్లాడుతూ ``రాజ్ కందుకూరితో నాకు చాలా ప‌ర్స‌న‌ల్ ప‌రిచ‌యం ఉంది. వివేక్ మ్యూజిక్ చాలా బావుంది. విజ‌య్ దేవ‌ర‌తో కూడా ప‌రిచ‌యం ఉంది. విజ‌య్ దేవ‌రకొండ‌నందు స‌హా అంద‌రికీ మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అశోక్ కుమార్ మాట్లాడుతూ ``క్యాచీ టైటిల్‌. పెళ్ళిచూపులు అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో కీల‌క‌మైన‌ది. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. పెళ్ళైన వారు గుర్తుకు తెచ్చుకునే సందర్భం. టైటిల్‌తోనే సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు`` అన్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ``వివేక్ సాగ‌ర్  చాలా చ‌క్క‌ని మ్యూజిక్ ఇచ్చారు. ఈ క‌థ‌ను త‌రుణ్ భాస్క‌ర్‌విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర విన్నాను. చాలా మంచి క‌థ‌. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

అల్లాణి శ్రీధ‌ర్ మాట్లాడుతూ ``ఆనంద్‌ఉయ్యాలా జంపాలా త‌ర్వాత అదే జోన‌ర్‌లో క‌న‌ప‌డుతున్న చిత్ర‌మిది. రాజ్ కందుకూరిగారు ఈ సినిమాతో ఇంకా పెద్ద నిర్మాత అవుతారు`` అన్నారు.

లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ ``మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. త‌రుణ్ భాస్క‌ర్‌విజ‌య్ దేవ‌ర కొండ మంచి టీం క‌లిసి చేసిన సినిమా. సినిమా విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నాను`` అన్నారు.

ర‌ఘుకుంచె మాట్లాడుతూ ``బాలీవుడ్ లో య‌ష్ రాజ్ సంస్థ ఎంత పెద్ద సంస్థో మ‌న‌కు తెలిసిందే. ఇక్క‌డ రాజ్ గారుయ‌ష్ రంగినేనిగారు క‌లిసి చేస్తున్న ఈ సినిమాతో వారు కూడా ఆస్థాయి నిర్మాత‌లు కావాల‌ని కోరుకుంటున్నాను. వివేక్ సంగీతం,లిరిక్స్ ఫ్రెష్‌గా ఉంది. చిన్న సినిమాకు సౌండింగ్‌సినిమాటోగ్ర‌ఫీ బావుంటే చాలా అందంగా ఉంటుంది. ఆ రెండు అంశాలు ఈ సినిమాలో బావున్నాయి. టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``విజ‌య్‌లో చాలా మంచి ఎన‌ర్జీ ఉంది. డైరెక్ట‌ర్ భాస్క‌ర్‌మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్‌లో మంచి స్ట‌ఫ్ ఉంది. మంచి టీంతో క‌లిసి చేసిన ప్ర‌య‌త్న‌మిది. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

మామిడిప‌ల్లి గిరిధ‌ర్ మాట్లాడుతూ ``పెళ్ళిచూపులు క‌థ నాకు తెలుసు. బ్యూటీఫుల్ డైరెక్ట‌ర్‌ప్రొడ్యూస‌ర్‌టీం క‌లిసి చేస్తున్న సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది`` అన్నారు.

అడివిశేష్ మాట్లాడుతూ ``టీజ‌ర్ చూడ‌గానే నాకు రీతువిజ‌య్ దేవ‌ర‌ల‌ యాక్ష‌న్ చాలా బాగా న‌చ్చింది. విజ‌య్ కోసం నేను ఒక స్క్రిప్ట్ రాయాల‌నుకుంటున్నాను. అలాగే వివేక్‌తో కూడా సినిమా చేయాల‌నేంత బాగా ట్యూన్స్ ఉన్నాయి. రాజ్‌,శ్రీధ‌ర్‌గారుయ‌ష్ గారు నాకు బాగా ప‌రిచ‌యం ఉంది. అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

Glam gallery from the event

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ ``ట్రైల‌ర్ బావుంది. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ విన‌గానే చాలా న‌చ్చేసింది. సాంగ్స్ బావున్నాయి. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం పేమ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో ఆ సినిమా కంటే టెట‌ర్ గా చేసుంటాడ‌ని అనుకుంటున్నాను. రాజ్ కందుకూరియష్ రంగినేని గారు స‌హా టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

క్రాంతిమాధ‌వ్ మాట్లాడుతూ ``విజువ‌ల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ టీంతో నాకు మంచి ప‌రిచ‌యం ఉంది. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ ``ట్రైల‌ర్ చూడ‌గానే నాకు న‌చ్చేసింది. ఈ ట్రైల‌ర్‌ను అంద‌రికీ చూడాల‌నిపించి మా గ్రూప్‌లోని ఫ్రెండ్స్‌కు పంపాను. భాస్క‌ర్ గ‌తంలో చేసిన షార్ట్ పిలిం గురించి తెలిసింది. త‌నకు ఆల్ ది బెస్ట్‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న బాగా న‌చ్చింది. త‌న నెక్ట్స్ సినిమా అర్జున్ రెడ్డి గురించి కూడా బాగా తెలుసు. నిర్మాత‌లు స‌హా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``ఈ సినిమా చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సురేష్‌బాబుగారే. ఆయ‌నే ఈ ద‌ర్శ‌కుడిని త‌రుణ్ భాస్క‌ర్‌ను పంపి క‌థ విన‌మ‌న్నారు. క‌థ విన‌గానే బాగా న‌చ్చింది. ఈ సినిమా కోసం య‌ష్ కూడా క‌లవ‌డం చాలా ప్ల‌స్ అయ్యింది. మంచి యంగ్ టీం క‌లిసి చేసిన సినిమా. త‌రుణ్‌నుఈ టీంను ఇంట్ర‌డ్యూస్ చేసినందుకు ఫ్యూచ‌ర్ లో గ‌ర్ప‌ప‌డ‌తాను. భ‌విష్య‌త్‌లో నేను చేసే సినిమాల్లో పెళ్ళి చూపులు నేను గ‌ర్వ‌ప‌డే సినిమా అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. వివేక్ సాగ‌ర్ వండ‌ర్ ఫుల్ మ్యూజిక్ అందించాడు. స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత య‌ష్ మాట్లాడుతూ ``రాజ్ కందుకూరి చాలా కాలంగా మంచి ప‌రియం ఉంది. సురేష్ బాబుగారు మొద‌టి నుండి బాగా స‌పోర్ట్ చేస్తున్నారు. ఆయ‌న‌కి థాంక్స్‌. ప్రేక్ష‌కులు ఆశీర్వాదంతో సినిమా పెద్ద హిట్ అవుతుంది. త‌రుణ్ భాస్క‌ర్ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. త‌ను యూనిక్ ఐడియా ఉన్న ద‌ర్శ‌కుడు. త‌న ఆలోచ‌న‌ల‌కు వెల‌క‌ట్ట‌లేం. విజ‌య్‌రీతూ చ‌క్క‌గా యాక్ట్ చేశారు. వివేక్‌సాగ‌ర్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. టీంకు థాంక్స్‌`` అన్నారు.

వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ `` నిర్మాత‌లు చాలా స్వేచ్చ‌నిచ్చారు. త‌రుణ్ తో చాలా కాలంగా మంచి ప‌రిచ‌యం ఉంది. త‌ను ఓపెన్‌గా ఉంటూ మంచి మ్యూజిక్ రాబ‌ట్టుకుంటాడు. మంచి టీం నాకు అండ‌గా నిల‌బ‌డింది. సింక్ సౌండ్‌లో మ్యూజిక్ చేశాను. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ ``నాకు చాలా ఎమోష‌నల్ మూమెంట్ ఇది. అంద‌రూ అండ‌గా నిల‌బ‌డ్డారు. నిర్మాత‌లు చాలా ఫ్రీడం ఇచ్చారు. నాకు తండ్రుల్లా స‌పోర్ట్ చేశారు. ఇది నిజ వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థ‌. మా అమ్మ‌గారుభార్య నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. సురేష్ బాబుగారికి స్పెష‌ల్ థాంక్స్`` అన్నారు.

డి.సురేష్ బాబు మాట్లాడుతూ ``చాలా యంగ్ టీం ఈ సినిమా కోసం వ‌ర్క్ చేసింది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్‌. చాలా మంచి సినిమా చేశారు. నాగేష్ సినిమాటోగ్ర‌పీవివేక్ మ్యూజిక్ చాలా బావుంది. విజ‌య్‌రీతూ స‌హా అంద‌రూ చాలా బాగా వ‌ర్క్ చేశారు. డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ మా బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను. ట్రైల‌ర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

విజ‌య్ దేవ‌ర కొండ మాట్లాడుతూ ``వివేక్ ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించారు. మంచి నిర్మాత‌లు దొరికారు. త‌రుణ్ మా నుండి మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుక‌న్నారు. అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేసే చిత్ర‌మవుతుంది. స‌హకారం అందించిన అంద‌రికీ థాంక్స్`` అన్నారు. 

గోవిసిద్ధుసుధాక‌ర్ కోమాకుల, నందు తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.

విజయ్ దేవర కొండరీతూవర్మప్రియదర్శినిఅభయ్ బేతిగంటికేదార్ శంకర్గురురాజ్అనీష్ కురువిల్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్మ్యూజిక్: వివేక్ సాగర్ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రంజిత్ కుమార్నిర్మాతలు: నిర్మాత రాజ్ కందుకూరియస్ రాగినేని దర్శకత్వం: తరుణ్ భాస్కర్ ధాస్యం.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved