pizza
Premikudu Music launch
‘ప్రేమికుడు’ ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 March 2016
Hyderabad

డిజి పోస్ట్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై మానస్.ఎన్, సనంశెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాకరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ప్రేమికుడు. విజయ్ బాలాజీ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, ఎ.యస్.రవికుమార్ చౌదరి, రాహుల్, షాలు, బెక్కంవేణుగోపాల్, కిషోర్ రాఠీ, ప్రసన్నకుమార్, పృథ్వీ, సాగర్, తమ్మలపల్లి రామసత్యనారాయణ, పద్మిని, సాయివెంకట్, కవిత, అనితాచౌదరి తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్ ను వి.వి.వినాయక్, ఎ.యస్.రవికుమార్ విడుదల చేశారు. బిగ్ సీడీని సాగర్, వి.వి.వినాయక్, ఎ.యస్.రవికుమార్ చౌదరి విడుదల చేశారు. ఆడియో సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేసి తొలి సీడీని సాగర్, ఎ.యస్.రవికుమార్ చౌదరికి అందించారు. ఈ సందర్భంగా....

వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’డిజి పోస్ట్ బ్యానర్ కు మా గురవుగారు సాగర్ గారికి, నాకు, రవికుమార్ కు విడదీయలేని అనుబంధం ఉంది. ఇలాంటి సినిమాలు విజయవంతం అయితే కొత్త టెక్నిషియన్స్ పరిచయం అవుతారు. సందీప్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. మానస్ బావున్నాడు. ఫ్యూచర్ లో మంచి స్టార్ అవుతాడు. అలాగే విజయ్ బాలాజీగారు అందించిన మ్యూజిక్ బావుంది. యూనిట్ కు అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఎ.యస్.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ‘’మేం అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఉప్పలపాటి సత్యనారాయణగారితో మంచి పరిచయం ఉంది. ఆయన తనయుడు కళ్యాణ్ ఈ చిత్రంతో నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది. విజయ్ బాలాజీలో మంచి ఎనర్జీ ఉంది. డెఫనెట్ గా సినిమా పెద్ద హిట్ అవుతుంది. దర్శకుడు సందీప్ కు మంచి పేరు రావాలి’’ అన్నారు.

Glam galleries from the event

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బాలాజీ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి మ్యూజిక్ రావడానికి కారణం దర్శకుడు సందీప్ గారే కారణం. ఆయనతో ట్రావెల్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

మానస్.ఎన్ మాట్లాడుతూ ‘’అందరం కలిసి కష్టపడి ఓ టీం ఎఫర్ట్ గా చేసిన సినిమా. మంచి టీంతో వర్క్ చేశాను. ప్రతి సీన్ ను దర్శకుడు సందీప్ గారు పక్కా ప్లానింగ్ తో చక్కగా తెరకెక్కించారు. ప్రతి సీన్ ను గ్రాండ్ లుక్ లో ఉండేలా చూశారు. విజయ్ బాలాజీగారు అందించిన మ్యూజిక్ చాలా బావుంది. సినిమాకు ప్లస్ అవుతుంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

దర్శకుడు కళాసందీప్ మాట్లాడుతూ ‘’కథ వినగానే నిర్మాతలు వెంటనే సినిమా చేద్దామని అన్నారు. గ్రాండియర్ గా సినిమా రావడానికి వారే కారణం. నాకు అండగా నిలబడి ఎంకరేజ్ చేశారు. డిజి పోస్ట్ నా మాతృసంస్థ. కళ్యాణ్ గారు, రఘుగారు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. విజయ్ బాలాజీ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఇక హీరో మానస్ గురించి చెప్పాలంటే, తను ఏకసంథా గ్రాహి. చాలా టాలెంటెడ్. తను హీరోయిన్ చాలా కో ఆపరేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ శివ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాండ్ విజువల్స్ ను అందించారు. నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

పద్మిని మాట్లాడుతూ ‘’సినిమా అంటే ప్యాషన్ ఉన్న దర్శకుడు, టీం రూపొందించిన చిత్రం. ఓ లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చాలా గ్రాండ్ లుక్ లో కనపడుతుంది. విజయ్ బాలాజీ మ్యూజిక్ సూపర్. నిర్మాతలకు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. టీం ఎఫర్ట్ తో చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు మానస్, సనంశెట్టి, అజీజ్, షకలక శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, భాను చందర్, అనితా చౌదరి, సనా, శశాంక్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కేరింత మధు, కెమెరా: శివ.కె, సంగీతం: విజయ్ బాలాజీ, నిర్మాతలు: లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళా సందీప్ బి.ఎ.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved