pizza
Premikula Pai PhD music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 September 2015
Hyderabad

 

‘ప్రేమికులపై పీహెచ్ డీ’ ఆడియో విడుదల

ఆదిత్య క్రియేషన్స్ సంస్థ ఆదిత్య హీరో గా  నిర్మిస్తున్న సినిమా ‘ప్రేమికులపై పీహెచ్ డీ’.సోనాలి, శిరీష నాయికలు. కోటా మునీష్ దర్శకుడు. లక్ష్మీ శ్రీ వాస్తవ తన కొడుకును హీరోగా పెట్టి తెరకెక్కించారు. ఆక్సాల్ట్ సమర్పిస్తున్న సినిమా ఇది.  రమేష్ ముక్కెర సంగీతం చేశారు. ఈ పాటలను హైదరాబాద్ లో శనివారం రాత్రి నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. సాయి వెంకట్ అందుకున్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘యూత్ ఫుల్ సినిమాలకు మంచిక్రేజ్ ఉంది. టైటిల్ వెరైటీగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని అన్నారు.

నిర్మాత లక్ష్మీ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకు చాలా విషయాలపై పీహెచ్ డీలు చేసి ఉంటారు. కానీ ఈ సినిమాలో మా హీరో ప్రేమపై రీసెర్చ్ చేస్తాడు. ఈ  పాయింట్ సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. షూటింగ్ పూర్తయింది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మంచి లవ్ స్టోరీ ఇది. మా హీరోకి ప్రేమ మీద నమ్మకం ఉండదు. కానీ ప్రేమపై అతను చేసే రీసెర్చ్ పూర్తయ్యే సరికి అతను ప్రేమలో పడతాడు. అదెలా జరిగింది? అనేది ఆసక్తికరం. మంచి పాటలు కుదిరాయి. దర్శకుడిగా ఇది నాకు మూడో సినిమా’’ అని అన్నారు.

సంగీత దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇందులో నాలుగు పాటలున్నాయి’’ అని చెప్పారు.

హీరో మాట్లాడుతూ ’’నాకోసం అమ్మ తెరకెక్కించిన సినిమా ఇది. యూత్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని చెప్పారు.

సాయి వెంకట్ మాట్లాడుతూ ‘‘ఈ సంగీత దర్శకుడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తారు. ఈ సినిమాకు సెన్సిటివ్ సంగీతాన్నిచ్చారు’’ అని తెలిపారు.

ఫణి మాట్లాడుతూ ‘‘హీరో తల్లి చాలా ఇష్టంగా ఈ సినిమాను తీశారు. మమ్మల్ని  కూడా తమ పిల్లల్లాగే చూసుకున్నారు. సినిమా బాగా వచ్చింది‘‘ అని అన్నారు.

హరి కృష్ణ, ఫిష్ వెంకట్, తాగుబోతు ఫణి, చిట్టి బాబు, గబ్బర్సింగ్ బ్యాచ్, సాయి బాబా, ఆంజనేయులు, ప్రవీణ్, బంటి, జీవన్ కీలక పాత్రధారులు.  ఈ సినిమాకు కెమెరా; ఆనం వెంకట్, లిరిక్స్ ; ఎం.రమేష్, సంగీతం; రమేష్ ముక్కెర, రీరికార్డింగ్; రవిశంకర్, డీఐ; జైబీ టెక్ ప్రై. లిమిటెడ్, ఆడియో; శివరంజని.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved