ఉదయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉదయ్, స్వప్న జంటగా ఉదయ్ కల్లూరి దర్శకత్వంలో హారిక కల్లూరి, ఉదయ్ కల్లూరి నిర్మించిన చిత్రం `రామసక్కని రాకుమారుడు`. హేమచంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాని రామకృష్ణాగౌడ్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించగా తొలి సీడీని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా....
మాజీ డిప్యూటి సీఎం రాజయ్య మాట్లాడుతూ ``కొత్త నటీనటులు సినిమాపై ఆసక్తితో చేశారు. అలాగే హేమచంద్ర అందించిన ఈ సినిమా సంగీతం బావుంది. ఉదయ్ దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా తనదైన ప్రతిభను చూపించాడు. తనతో సహా యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రం కావాలి`` అన్నారు.
సాగర్ మాట్లాడుతూ ``విజువల్స్ బావున్నాయి. హేమచంద్ర సంగీతం బావుంది. యంగ్ టీం చేస్తున్న ప్రయత్నం బావుంది. అందరికీ అభినందనలు`` అన్నారు.
ప్రతాని రామకృష్ణాగౌడ్ మాట్లాడుతూ ``తెలుగువాడైన ఉదయ్ సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో కెనడాలోనే మొత్తం సినిమాను చిత్రీకరించాడు. హేమచంద్ర మంచి సంగీతం అందించాడు. సినిమా, ఆడియో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థియేటర్స్ విషయంలో నా వంతు సహకారం అందించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను`` అన్నారు.
సాయివెంకట్ మాట్లాడుతూ ``హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా ఉదయ్ ఎంత వర్క్ చేశాడో కనపడుతుంది. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హేమచంద్ర మాట్లాడుతూ ``ఈ సినిమా కోసం ఉదయ్ ఎంత డేడికేషన్‌తో వర్క్ చేశాడో తెలుస్తుంది. కథ వినగానే నాకు నచ్చింది. దాంతో సినిమాకు మ్యూజిక్ అందించాను. మంచి ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఉదయ్ మాట్లాడుతూ ``ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు బాగా వర్క్ చేశాను. సినిమాను అంతా కెనడాలో చిత్రీకరించాం. కెనడాలో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదే. అలాగే సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. హేమచంద్ర మంచి సంగీతం కూడా అందించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.