బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియో బ్యానర్ పై ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం రాణిగారి బంగళా. డి.దివాకర్ దర్శకుడు. ఈశ్వర్ పేరవల్లి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడువదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోజరిగింది. ఎస్.వి.కృష్ణారెడ్డి బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీలను కె.అచ్చిరెడ్డి ఆవిష్కరించి ఎస్.వి.కృష్ణారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా...
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’ఇప్పుడున్న ట్రెండ్ లో మంచి కథతో దర్శకుడు దివాకర్, బాలాజీ నాగలింగంగారు ఈ రాణిగిరి బంగళా చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే యూనిట్ పడ్డ కష్టం. ఆనంద్ మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడు. మంచి స్పిరిట్ తో టీం చేసిన ఎఫర్ట్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘’టైటిల్ వినడానికి హిట్ సౌండింగ్ తో ఉంది. ఈశ్వర్ మ్యూజిక్ బావుంది. ఆంనద్ పెద్ద కమర్షియల్ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ ‘’మంచి హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం. ఈశ్వర్ మంచి సంగీతాన్నదించాడు. నిర్మాతల సహకారంతో మంచి సినిమాను చేయగలిగాను. హీరో ఆనంద్ చక్కగా యాక్ట్ చేశాడు. ఫ్యూచర్ మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో ఆనంద్ మాట్లాడుతూ ‘’చిన్నప్పట్నుంచి హీరో కావాలనే ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అందరం కష్టపడి చేసిన సినిమా ఇది. సినిమా బాగా వచ్చింది. ఈశ్వర్ గారు మంచి సంగీతం అందించారు. దివాకర్ గారు సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు.
పూర్ణిమ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను’’ అన్నారు.
ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘’టైటిల్ చాలా బావుంది. ఆనంద్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. యూనిట్ కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సి.కల్యాణ్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.
శివకృష్ణ, వైజాగ్ ప్రసాద్, పూర్ణిమ, కాశీవిశ్వనాథ్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ పేరవల్లి, కథ: వి.లీనా, ప్రసాద్ వనపల్లె, ఎడిటర్: అనిల్ మల్ నాడు, కెమెరా: జె.ప్రభాకర్ రెడ్డి, కోప్రొడ్యూసర్: శ్రీనివాసరావు, నిర్మాణం: వి.సినీ స్టూడియో, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డి.దివాకర్.