11 May 2016
Hyderabad
మాస్ హీరో విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'రాయుడు'. విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
బిగ్ సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను రానా విడుదల చేసి తొలి సీడీని రకుల్ ప్రీత్ సింగ్ కు అందజేశారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’హరితో మంచి పరిచయం ఉంది. మేమంతా తనని నెల్లూరు హరి అని పిలుస్తాం. రాయుడు సినిమా నిర్మాతగా మంచి బ్రేక్ కావాలి. విశాల్ అంటే మాకు చాలా ఇష్టం. విశాల్ గత చిత్రాలను మించి ఈ సినిమా హిట్ కావాలని, ముత్తయ్యగారికి ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. హరికి ఈ సినిమాతో బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
విశాల్ మాట్లాడుతూ ‘’రాయుడు సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతుంది. ముత్తయ్య మాస్ డైరెక్టర్. నాకు, ముత్తయ్యకు వినాయక్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఒక హీరో మాస్ ఇమేజ్ ద్వారా అఖరి విలేజ్ వరకు తీసుకెళ్లి చూపించాలనేదే ముత్తయ్య కోరిక. నేను కాదు ఇంతకు ముందు కార్తీకానీ, శశికుమార్ గారికి కానీ ఓ గుర్తింపు తెచ్చే సినిమా చేశాడు. ఇందులో బస్తాలు మోసే క్యారెక్టర్ చేశాను. అనంతపూర్ యాసలో మాట్లాడతాను. వాడు-వీడు తర్వాత నాకు బాగా సెట్ అయ్యే క్యారెక్టర్ ఇది. కొత్త ఎక్స్ పీరియెన్స్. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. రానా నాకు మంచి మిత్రుడు. చెన్నై వరదల సమయంలో లక్ష్మి మంచుగారు సహా ఇక్కడున్న మిత్రుల సహాయంతో ఎంతో హెల్ప్ చేశారు. ఇక్కడున్న మిత్రుల సపోర్ట్ తో సేవలు చేశాం. ఆ సమయంలో రానా కాంట్రిబ్యూషన్ మరచిపోలేదు. సౌతిండియన్ మూవీ అసోసియేషన్ ఈరోజు అప్పులు లేకుండా తొమ్మిది కోట్ల రూపాయలు బ్యాలెన్స్ తో ఉండటానికి కూడా రానా తన వంతుగా సపోర్ట్ చేశాడు. నేను తెలుగు ప్రేక్షకులకు నచ్చే హీరో కావాలని మా నాన్నగారు అనుకున్నారు. ఆయన పందెంకోడి సినిమాను పట్టుబట్టి తెలుగులో విడుదల చేశారు. ఆ సినిమా సక్సెస్ తో ఆయన అనుకున్నట్లుగానే నేను తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే హీరోనయ్యాను. కానీ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత విశాల్ సినిమాలను నెక్ట్స్ లెవల్ కు ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అందుకు తనకు ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులనే హీరోలు కోరుకుంటారు. ఈ సినిమా నాకంటే తన కోసం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇమాన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బి.ఎ.రాజుగారికి, వేల్ రాజ్ గారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.
Glam galleries from the event |
|
|
రానా మాట్లాడుతూ ‘’విశాల్ తమిళనాడులో పుట్టిన తెలుగువాడు. అక్కడ పెద్ద హీరో అయ్యాడు. తను గుడ్ సోల్. శ్రీదివ్య ఉంది కాబట్టి సినిమా హిట్ అవుతుంది. విశాల్ గారికి, ముత్తయ్యగారు సహా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘’రాయుడు సినిమా సూపర్ డూపర్ హిట్టవుతుంది.యూనిట్ సభ్యులందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
రాజా మాట్లాడుతూ ‘’యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్. నేను టీజర్, ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది’’ అన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘’విశాల్ గారు చేసిన సినిమాలన్నింటినీ చూశాను. పందెంకోడి చిత్రాన్ని చాలా సార్లు చూశాను. అది నా ఫేవరేట్ సినిమా. అలాగే పొగరు, భయ్యా సినిమాలను చూశాను. రాయుడు మంచి మాస్ టైటిల్. పందెంకోడి కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ముత్తయ్యగారు డైరెక్ట్ చేసిన కొంబన్ సినిమా చూశాను. ఈ సినిమాలో కూడా మాస్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఇమామ్ గారి మెలోడీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మాకు మంచి మిత్రుడైన డిస్ట్రిబ్యూటర్ హరిగారు ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ అవుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ సాధించి హరిగారికి బాగా లాభాలు రావాలి’’ అన్నారు.
డి.వి.వి.దానయ్య ‘’విశాల్ గారి నాన్నగారితో మంచి పరిచయం ఉంది. ఆయనతో సినిమా కూడా చేయాలనుకున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే సినిమాలో విశాల్ లుక్ కొత్తగా ఉంది. యూనిట్ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘’హరి పది సంవత్సరాలు నుండి నా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్నారు. ఈ నెలలో నిర్మాతగా రెండు సినిమాలను విడుదల చేస్తున్నాడు. అలాగే మేం విశాల్ తెలుగు స్ట్రయిట్ సినిమా ఎపుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్నాం. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
కె.దశరథ్ మాట్లాడుతూ ‘’ట్రైలర్, సాంగ్స్ బావున్నయి. ష్యూర్ షాట్ హిట్ మూవీ. హరి నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా లాభాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ‘’డైరెక్టర్ ముత్తయ్య, ప్రొడ్యూసర్ హరి, హీరో విశాల్, హీరోయిన్ శ్రీదివ్యకు ఆల్ ది బెస్ట్. ట్రైలర్ సూపర్ గా ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ ముత్తయ్య మాట్లాడుతూ ‘’నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. చెన్నైలో విడుదలైన తెలుగు సినిమాలను చూస్తాను. రాజమౌళి, వినాయక్ గారు, సుకుమార్ వంటి దర్శకుల సినిమాలను తప్పకుండా చూస్తాను. అవకాశం ఇచ్చిన విశాల్ గారికి థాంక్స్’’ అన్నారు.
శ్రీదివ్య మాట్లాడుతూ ‘’విశాల్ సార్ కు నేను పెద్ద ఫ్యాన్. ఆయన గ్రేట్ హ్యుమన్ బీయింగ్. ఏదనుకుంటే అది చేసేస్తారు. ఆయన చేసే పనులు చూసి ఆయనపై గౌరవం ఇంకా పెరుగుతుంది. ముత్తయ్య గారు తెలుగు సినిమాలను బాగా చూస్తారు. ఆయన తీసిన ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. వేల్ రాజ్ కు ప్రతి సీన్ ను చాలా అందంగా చూపించారు. నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది. తెలుగులో స్ట్రయిట్ మూవీలా ఫోకస్ చేసి విడుదల చేస్తున్నారు. ఆయనకు థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంకా జి.కె.రెడ్డి, నల్లమలుపు బుజ్జి తదితరులు పాల్గొని యూనిట్ సభ్యులను అభినందించారు.
విశాల్, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్.కె.సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్రాజ్, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: బాబా భాస్కర్, సమర్పణ: విశాల్, దర్శకత్వం: ముత్తయ్య.