15 May 2016
Hyderabad
వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో సుమంత్ అశ్విన్ హీరోగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్`. జె.బి.సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోజరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకరత్న డా.దాసరి నారాయణరావు బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. తొలి సీడీలను వి.వి.వినాయక్, ఎం.ఎస్.రాజు అందుకున్నారు. ఈ సందర్భంగా....
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘’సుమంత్ మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. చాలా డిఫరెంట్ పాత్రలో నటించాడు. నటనే కాకుండా సినిమాలో అద్భుతమైన డ్యాన్సులు కూడా చేశాడు. హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న కుర్రాడు. కొన్ని సీన్స్ చూశాను. చాలా బావున్నాయి. అలాగే పాటలు కూడా విన్నాను. మంచి మెలోడీ సాంగ్స్. విలన్ గా నటించే ప్రభాకర్ సెన్సిటివ్ పాత్రలో కనిపించాడు. సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుదని భావిస్తున్నాను’’ అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా గుర్తుకు వస్తుంది. ఆశ్విన్ చక్కగా నటించాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది. మంచి టైటిల్. దర్శకుడిగా పరిచయమవుతున్న మనుకు, హీరో సుమంత్ ఆశ్విన్ సహా అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ‘’బాహుబలిలో విలన్ గా చేసిన ప్రభాకర్ గారు ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. మంచి టీం కుదిరింది. క్షణం, ఊపిరి వంటి సినిమాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్రభాకర్ గారి పాత్ర చాలా సెన్సిటివ్ గా సాగుతుంది. ఆయన పాత్ర అందరికీ నచ్చుతుంది. మా సినిమాను పెద్ద సక్సెస్ చేయాలి’’ అన్నారు.
దర్శకుడు మను మాట్లాడూ ‘’ఓ డ్రైవర్, కండెక్టర్ కు మధ్య జరిగే కథ. కథ వినగానే ఎం.ఎస్.రాజుగారు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సుమంత్ చక్కగా యాక్ట్ చేశాడు. అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
ప్రభాకర్ మాట్లాడుతూ ‘’నాకు, సుమంత్ మధ్య మంచి రిలేషన్ ఏర్పడటంతో సినిమాలో కూడా మా పాత్రలు కూడా బాగా వచ్చాయి. నా రోల్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. దర్శకుడు మనుగారు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. జెబిగారు మంచి సంగీతాన్నిచ్చారు. ఎంటర్ టైనింగ్ గా సాగే చిత్రం. పెద్ద సక్సెస్ సాధిస్తుంది’’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘’సుమంత్ లవర్స్, కేరింత వంటి వరుస విజయాలను సాధించాడు. ఈ చిత్రంలో మంచి రోల్ చేశాడు. ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తాడు. యూనిట్ అందరికీ థాంక్స్’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జెబి మాట్లాడుతూ ‘’అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కోటి, బి.గోపాల్, ఎ.కోదండ రామిరెడ్డి, సాయికిరణ్ అడివి, చంటి తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.
నాజర్, ధనరాజ్,షకలక` శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర, భరత్‌రెడ్డి, వినోద్, పావని, కరుణ,జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, మాటలు: `డార్లింగ్` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్.రాజీవ్, కో ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు.