సందీప్ కిషన్, అనీషా అంబ్రోస్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రన్'. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం 'నేరం' రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎ.ఎమ్.రత్నం, దర్శకుడు అని కన్నెగంటి, అనీల్ సుంకర, వీరుపోట్ల, కాశీవిశ్వనాథ్, అల్లరి నరేష్, జి.నాగేశ్వరరెడ్డి, జెమిని కిరణ్, వి.ఆనంద్, శ్రీని అవసరాల, రాజ్ తరుణ్, కె.దశరథ్, క్రాంతి మాధవ్, బాబీ సింహ, అనీషా అంబ్రోస్, శరత్, రాజసింహ, దూళిపాళ నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్ ఎ.ఎం.రత్నం విడుదల చేశారు. ఆడియో సీడీలను అల్లరి నరేష్ విడుదల చేసి తొలి సీడీని రాజ్ తరుణ్ కు అందించారు.
ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘’సాంగ్స్, ట్రైలర్ బావుంది. చాలా కాలం క్రితం తమిళంలో ఇదే టైటిల్ తో నేను సినిమా చేస్తే పెద్ద హిట్టయింది. ఈ సినిమా కూడా అలాగే పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా టైంను సూచించే సినిమా. సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది. యూనిట్ కు అభినందనలు’’ అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘’అనీల్ సుంకరగారు ఓకే సమయంలో నాలుగైదు సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఆయన గుడ్ టైం, బ్యాడ్ టైం వచ్చినా మారని వ్యక్తి. నా స్వంత బ్యానర్ కంటే మించిన బంధం ఉండే బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది. సందీప్ మంచి హార్డ్ వర్కర్. ఈ సినిమా మలయాళంలో, తమిళంలో కంటే పెద్ద హిట్ సాధించి సందీప్ కు మంచి పేరు రావాలి. బాబీగారు ఏ ఎక్స్ ప్రెషన్స్ అయినా చేయగల నటుడు. సాయికార్తీక్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు అని కన్నెగంటి డేడికేటెడ్ పర్సన్. ఈ సినిమాతో యూనిట్ సభ్యులంరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘’బెస్ట్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, మంచి యాక్టర్ సందీప్, సాయికార్తీక్ మ్యూజిక్ ఇలా చాలా కారణాలతో సినిమా పెద్ద హిట్టవుతుందని చెప్పగలను. బాబీ సింహగారికి పెద్ద ఫ్యాన్ ని. దర్శకుడు అని కన్నెగంటి ఎప్పుడూ సినిమా గురించి ఆలోచించే దర్శకుడు. మహత్ కు చాలా మంచి పేరు వస్తుంది. రాజశేఖర్ గారు బెస్ట్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇలా అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
అనీల్ సుంకర మాట్లాడుతూ ‘’ఒక సంవత్సరం క్రితం ఈ సినిమా చేద్దామని సందీప్ తో అన్నాను. రైట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారి దగ్గర నుండి రైట్స్ మాకు రాగానే సుధాకర్ గారు వెంటనే సినిమా చేద్దామని అన్నారు. వెంటనే సందీప్ కిషన్ కు ఫోన్ చేసి నాపై నమ్మకంతో సినిమా చేయమని అన్నాను. తను సరేనన్నాడు. ఈ సినిమాను తెలుగులో మేం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. బెస్ట్ కాన్సెప్ట్. అని కన్నెగంటి మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్. మలయాళంలోని సోల్ మిస్ కాకుండా ఎలా బాగా వర్కవుట్ చేసి తెరకెక్కించాడు. మూవీని చూడగానే మనం కోరుకునే మూవీ వచ్చిందని అందరూ అనుకుంటారు. మహత్ చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. బాబీ సింహ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు. తనని తెలుగులో పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయనది మన బందరు. ఆయన చేసిన ఈ రోల్ చూస్తే, ఆయన తప్ప ఎవరూ చేయలేరని అంటారు. సందీప్ ఫుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశాడు. అనీషాకు మంచి బ్రేక్ ఇస్తుంది. సాయికార్తీక్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తను ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. మార్చి 23న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘’గత సంవత్సరం నేను గుడ్, బ్యాడ్ టైం చూసేశాను. చాలా నేర్చుకున్నాను. చాలా మారాను. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం వచ్చింది. అనీల్ సుంకరగారు ఎప్పుడూ నా వెల్ విషర్. నిర్మాతలు మంచితనానికి మారు పేరు. బాబీ ఫెంటాస్టిక్ యాక్టర్. తను గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. అనీషా మంచి కో స్టార్. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. దర్శకుడు అని కన్నెగంటి సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
బాబీ సింహ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు అని, నిర్మాత సుధాకర్, అనీల్ సుంకర గారికి థాంక్స్. సినిమా డిఫరెంట్ గా ఉంది. టైటిల్ లాగానే సినిమాలో ఎనర్జీ ఉంటుంది. రాజశేఖర్ గారు ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. సందీప్ కిషన్ తో కలిసి వర్క్ చేసినందుకు హ్యపీగా ఉంది. మహత్ కు ఈ సినిమాతో మంచి మూవీ అవుతుంది. సాయికార్తీక్ అందించిన సౌండింగ్ వేరే లెవల్ లో ఉంది. తన మ్యూజిక్ లో మంచి రిథమ్ ఉంది. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా తనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. గ్యారంటీగా ఈ సినిమా అందరినీ ఎంగేజ్ చేస్తుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
దర్శకుడు అని కన్నెగంటి మాట్లాడుతూ ‘’నాకు బాగా నచ్చిన సినిమా. రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉండే సినిమా. నేను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సాయి బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలా ఫాస్ట్ గా ట్యూన్స్ అందించాడు. బాబాయ్.. సాంగ్ కు ప్రేక్షకులు ఎవరైనా డ్యాన్స్ చేసి ఆ వీడియోను మాకు పంపిస్తే అందులో బెస్ట్ డ్యాన్సులు ఐదారింటిని సెలక్ట్ చేసి సినిమాలో యాడ్ చేస్తాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
సాయికార్తీక్ మాట్లాడుతూ ‘’ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నేను చేస్తున్న రెండో సినిమా. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా తెరకెక్కించిన సినిమా. ఆడియో, సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
మహత్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో పార్ట్ అయినందుకు, అనీల్ గారి బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యపీగా ఉంది. బాబీ సింహతో కలిసి నటించడం డ్రీమ్ కమ్ ట్రూ అయింది’’ అన్నారు.
అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ ‘’వండర్ ఫుల్ టీంతో వర్క్ చేశాను. అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. సాయికార్తీక్ తన మ్యూజిక్ తో మూవీని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళారు. ఆడియో, మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
Anisha Ambrose Glam gallery from the event
కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ ‘’రీమేక్ ను చాలా ప్లానింగ్ తో చేశారు. దర్శకుడు అని కన్నెగంటి సినిమాను చక్కగా తెరకెక్కించాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చేశాడు. సినిమా పెద్ద సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.
వీరుపోట్ల మాట్లాడుతూ ‘’టైమ్ బేస్ చేసుకున్న మూవీ. కాన్సెప్ట్ వినగానే బాగా నచ్చింది. డెఫనెట్ గా మంచి సినిమా అవుతుంది. టీజర్ చూడగానే దర్శకుడుకి మెసేజ్ పెట్టి అభినందించాను. సందీప్, అని కన్నెగంటికి సహా యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
వి.ఆనంద్ మాట్లాడుతూ ‘’సందీప్ కిషన్ తో టైగర్ సినిమా చేశాను. మంచి యాక్టర్. అనీల్ సుంకరగారికి, సందీప్ కి టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘’ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ దర్శకుడు అనికి మంచి సక్సెస్ తెస్తుంది. సందీప్ నాకు చాలా ఇష్టమైన హీరో. టైం వస్తే తనతో సినిమా చేస్తాను. అనీల్ సుంకరగారు క్లాస్, మాస్ ను ఇష్టపడే నిర్మాత. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.
క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘’టైం గురించి సినిమా. హండ్రెడ్ డేస్ రన్ కావాలని కోరుకుంటూ యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
కె.దశరథ్ మాట్లాడుతూ ‘’ట్రైలర్ చూస్తుంటే చాలా పాజిటివ్ గా, హై స్టాండర్డ్ లో ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. యూనిట్ కు అభినందనలు’’ అన్నారు.