pizza
Pawan Kalyan's Sardaar Gabbar Singh music launch
‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటలు విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 March 2016
Hyderabad

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ సమర్పణలో కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, డైరెక్టర్స్ బాబీ, దేవిశ్రీప్రసాద్, ఎన్.టి.వి.అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి, నిర్మాతలు జెమిని కిరణ్, ఎ.ఎం.రత్నం, కబీర్ సింగ్, సాయిమాధవ్ బుర్రా, అనంత్ శ్రీరాం, సినిమాటోగ్రాఫర్ అర్థర్ విల్సన్, అండ్రూ, ఎడిటర్ గౌతంరాజు, రామజోగయ్య, అనంత్ శ్రీరాం, రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

బిగ్ సీడీని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఆడియో సీడీలను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తొలిసీడీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘’చాలాకాలం తర్వాత తమ్ముడు పవన్ కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య సంవత్సరాలలో నేను ఎక్కువగా, రిపీటెడ్ గా చూసిన సినిమాయే ఏదైనా ఉందంటే గబ్బర్ సింగ్. గతంలో నేను కల్యాణ్ సినిమాలు చూశాను కానీ వేరే వ్యాపకం పెట్టుకుని చూసిన సినిమా గబ్బర్ సింగ్ కే జరిగింది. పవన్ కల్యాణ్ మాస్ ఎంటర్ టైనర్ ఆ చిత్రంలో అలరించాడు. ఇలా కదా పవన్ సినిమా ఉండాల్సింది. ఈరకంగా కదా అభిమానులు ఆయన అలరించాల్సింది కదా అని ముచ్చటపడి ఆ సినిమాలో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ చూస్తాను. దబాంగ్ ట్రీట్ మెంట్ వేరు. కల్యాణ్ తనదైన స్టయిల్ లో మార్చుకుని చేసిన చిత్రం. ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు. ట్రెండ్ ను సెట్ చేస్తాడని గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం మరో ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవన్ కల్యాణ్ మనసుకు దగ్గరైన సినిమా. కథ, స్క్రీన్ ప్లే తనది. డైరెక్టర్ బాబీ తన దర్శక ప్రతిభతో పవన్ కథను, కథాంశాన్ని తనదైన స్టయిల్ లో పవన్ ఇన్ పుట్స్ ను తీసుకుని అత్యద్భుతంగా తీశాడు. నేను ఈ సినిమా సెట్స్ కు వెళ్ళాను. డిఫరెంట్ గా అనిపించింది. షోలే చిత్రంలో రాంపూర్ గ్రామం సెట్ ఎలా అయితే కనిపిస్తుందో ఈ చిత్రంలో రతన్ పూర్ గ్రామం సెట్ అలా అనిపించింది. షోలే అప్పట్లో ఎలాంటి సంచలన విజయం సాధించిందో ఇప్పుడు ఈ చిత్రం మరో షోలే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ లో హ్యమన్ యాంగిల్, హ్యుమర్ యాంగిల్ ఉంది. ఈ సినిమాలో ప్రతి అంశం ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. హ్యుమర్ టచ్ తో సినిమా సాగుతూ ఆద్యంతం అలరిస్తుంది. ఆడియెన్స్ ఎంత ఉత్సాహంగా ఈ సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారో నేను అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను. కల్యాణ్ ఫ్యూచర్ డిసైడ్ చేసుకునే తరుణంలో ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. డైరెక్టర్ అవుతానన్నాడు. ఆ కోరిక తీర్చుకోవచ్చు కానీ మా అబ్జర్వేషన్ ప్రకారం తనని యాక్టర్ అవమని అంటే కన్విన్స్ అవడమే కాదు, తర్ఫీదు కూడా పొందాడు. కష్టపడి ఈరోజు ఇలా అందరితో ఆదరింపబడుతున్నాడు. పవన్ కల్యాణ్ ఎదుగుదలను చూసి మొదట గర్వపడేది మొదట నేను, తర్వాత నా తల్లిదండ్రులు. పవన్ రెండు, మూడేళ్లలో సినిమాలు మానేస్తానని చెప్పాడని నేను విన్నాను, ఎక్కడో కూడా చదివాను. ఆ నిర్ణయం కరెక్ట్ కాదు. పవన్ అన్నయ్యగా తనకు నేనిచ్చే సలహా ఏంటంటే ‘నువ్వు ఏ రంగంలో అయినా రాణిస్తావు. మంచి ఉన్నతులకు చేరుకుంటావు. అంతమాత్రాన ఇంత మందిని అలరించే సినిమా రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. నీ కెపాసిటీ నీకంటే ప్రేక్షకులకే బాగా తెలుసు. జోడు గుర్రాలపై స్వారీ చేసే కెపాసిటీ నీకుంది. ఇది నేను నీకిచ్చే సూచన కాదు. సలహా మాత్రమే. ఇంత మందిని నువ్వు డిసప్పాయింట్ చేయవని అనుకుంటున్నాను. అవకాశం ఉన్నంత వరకు జోడు గుర్రాల స్వారీ చెయ్..నీతో పాటు మేమంతా ఉన్నాం’ అంటున్నాను. నా మాట తను కాదంటాడని నేను అనుకోవడం లేదు. పవన్ ఈ సినిమాతో కనివినీ ఎరుగని రికార్డ్స్ క్రియేట్ చేయాలి. దాన్ని మరో హీరో బ్రేక్ చేయాలి. అలా రికార్డులు బ్రేక్ చేసుకునే ఆరోగ్యకరమైన పోటీ ఉంటే సినిమా పరిశ్రమ బావుంటుంది. పరిశ్రమ అత్యున్నత్త స్థాయి చేరుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. దాన్ని ఈ సినిమా దాటాలి. ఈ సినిమా రికార్డ్స్ ను మరోసినిమా క్రియేట్ చేయాలి. రికార్డ్స్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక సినిమాను మించి మరో సినిమా ఆడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలి. ఇక బాబీ గురించి తెలుసుకుంటే తను పవర్ అనే సినిమాను చేశాడని తెలిసింది. నేను ఆ సినిమాను టీవీలో కూడా చూశాను. తన టాలెంట్ ఏంటో తెలిసింది. తన టాలెంట్ ను గుర్తించిన పవన్ ఈ సినిమాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో పవన్ వేసిన వీణ స్టెప్ కోసం నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. నిర్మాత శరత్ మరార్ మా కుటుంబానికి ఆప్తుడు. దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతలకు టైం ఇవ్వనంత బిజీగా ఉన్నాడు. నా నెక్ట్స్ సినిమాకు మ్యూజిక్ చేయమని నేను అడగటానికి కూడా టైంలేనంత బిజీగా ఉన్నాడు. చాలా హ్యపీగా ఉన్నాడు. తన ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పవన్ కు హ్యాట్రిక్ ఇచ్చిన దేవి శ్రీ ఈ చిత్రంతో సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేస్తున్నాడు. సినిమా వందకోట్ల బిజినెస్ చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. హిందీలో 800 థియేటర్స్ సినిమా రిలీజ్ అవుతుంది. నార్త్, సౌత్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. యూనిట్ లో అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘’నాకు హీరో అంటే చిరంజీవిగారే. అమితాబ్ బచ్చన్ అంటే పిచ్చి ఇష్టముండేది. అన్నయ్య హీరో అయిన తర్వాత ఆయనే నాకు కనిపించాడు. ఈరోజు నేను యాక్టర్ గా మారి మీ ముందున్నానంటే కారణం అన్నయ్య వదినలే కారణం. ఎవరైనా అతిథులు వస్తే ఇంట్లో దాక్కునేవాడిని. అలాంటి నన్ను మీ మధ్యలోకి నెట్టేశారు. నాకు అన్నయ్యంటే ఎంతిష్టమో బయటెందుకు చెప్పుకోవాలని అనుకుంటాను. నేను ఇంట్లో కూర్చొని ఏ పనిచేయకుండా తింటుంటే అన్నయ్య రాత్రిపగలు కష్టపడి, కంఫర్ట్ బుల్ షూస్ లేకపోయినా అవి వేసుకోవడంతో కాళ్లు వాచిపోయేవి. నేను అన్నయ్య దగ్గరకెళ్ళి షూ తీసినప్పుడు ఆ చెమటలో నాకు ఓ వ్యక్తి తాలుకు సువాసన కనిపించేది. నాలాంటి వాడికి సినిమాల్లో రావడం తేలిక. ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి అందరికీ ఆదర్శవంతంగా, స్ఫూర్తిగా నిలిచారు. ఒక ఆలోచన, ధ్యేయాన్ని అనుకుంటే సాధించగలరని అన్నయ్యను చూసి తెలుసుకున్నాను. ఆయన నాకు అన్నయ్య కంటే స్ఫూర్తినిచ్చిన మహావ్యక్తి. సినిమాల్లో యాక్ట్ చేయాలని లేదు. కథలు చదవడం ఇష్టం. నన్ను సినిమాల్లో యాక్ట్ చేయమంటే ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకూడదని ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. అన్నయ్యతో పాలిటిక్స్ పరంగా ఆయనకు నచ్చనివి చేశాను. అదెందుకు చేశానో ఆయనకు చెప్పాను. ఆయన అర్థం చేసుకున్నారు కూడా. మా బంధం వేరు. రాజకీయాలు వేరు. అవి రెండు దారులు. నేను అన్నయ్య పంథాలో లేకపోయినా ఆయనంటే ఎంతిష్టమో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నేనెంత నిలబడగలనో నాకు తెలుసు. నా తల్లిదండ్రుల తర్వాత అన్నయ్య వదినలే తల్లిదండ్రులు. అన్నయ్యకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. అన్నీ ఉంటూనే అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉండాలనుకుంటారు. అలాంటి సినిమా ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను. అందకే ఈ వేడుకకు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాను. ఈ చిత్రంతో జానీలా డిసప్పాయింట్ చేయనని నమ్మకం ఉంది. నేను సినిమాల్లోకి రాకముందు ఖమ్మంకు బార్డర్ కు వెళ్లాను. అక్కడ ఇప్పటి చతీస్ గడ్ కూడా టచ్ అవుతుంద. ఆప్లేస్ చూడగానే ఇక్కడ ఓ లవ్ స్టోరీ చేస్తే బావుంటుందనిపించింది. తర్వాత ఆ ఆలోచనను వదిలేశాను. కౌబోయ్ తరహాలో ఉండి మనకు దగ్గరగా ఉండేలా సినిమా చేయాలనుండేది. ఈ స్క్రిప్ట్ రాయడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఇంత టైం నన్ను భరించిన శరత్ మరార్ కు థాంక్స్. ఈరోస్ సంస్థ సునీల్ లుల్లా గారికి థాంక్స్. కాజల్ పెర్ ఫార్మెన్స్ బావుంది. నాతోటి నటీనటులకు, టెక్నిషియన్స్ కు థాంక్స్. సినిమా ఏప్రిల్ లో విడుదల కావాలని నేను నిద్రపోలేదు. 50 రోజుల పాటు అందరినీ ఏడ్పించేశాను. డైరెక్టర్ బాబీ సహా అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. బాబీకి థాంక్స్. కథాంశం చతీస్ గడ్, మనకు దగ్గరకగా ఉండే కథ కాబట్టి ఈ సినిమాను సునీల్ లుల్లాగారు హిందీలో రిలీజ్ చేస్తామన్నారు. అంతే తప్పు ఏ సినిమాకు పోటీగా ఆలోచించలేదు. అందరం బావుండాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు.

Glam galleries from the event

 

నిర్మాత సునీల్ లుల్లా మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో పార్ట్ కావడాన్ని గర్వంగా భావిస్తున్నాను. పవన్ కల్యాణ్, శరత్ మరార్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఎంటర్ టీంకు ఆల్ ది బెస్ట్‘’ అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ‘’చిరంజీవిగారు, పవన్ స్టార్ గారంటే గౌరవం, భయం. చిన్నప్పట్నుంచి స్కూల్ కు వెళ్లనంటే నాన్న తిట్టేవాడు. అయితే పండుగప్పుడు మాత్రం ఆయనే దగ్గురుండి సినిమాకు తీసుకెళ్లేవాడు. ఆ పండుగ పేరే చిరంజీవి సినిమా రిలీజ్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఆయన తన స్కూటర్ పై సినిమాకు తీసుకెళ్లేవాడు. చిన్నప్పుడంతా చిరంజీవిగారి సినిమాలు చూసి పెరిగిన నేను, కాలేజ్ రోజుల్లో పవన్ కల్యాణ్ గారి సినిమాలు చూసేవాడిని. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయ్యింది. పవన్ కల్యాణ్ గారితో ఒక ఫోటో అయినా దిగాలనుకున్నా కుదరలేదు కానీ ఏకంగా సినిమా తీసే అదృష్టం కలిగింది. ఆయన నన్ను ఏ నమ్మకంతో అయితే పిలిపించారో తెలియదు కానీ, ఆయన రాసుకున్న కథను నాకు ఇచ్చి డైరెక్షన్ చేయమన్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినా ఆయన చూడలేదు. నమ్మకంతో ఫ్రీడం ఇచ్చి సినిమా చేయించుకున్నారు. అది ఆయన గ్రేట్ నెస్. యుద్ధం చేయడం ఎలానో, ఓపికతో ఉండటం నేర్చుకున్నాను. ఇలా చాలా విషయాలను నేర్చుకున్నాను. జనాలను ఆయనలా ప్రేమించే వ్యక్తిని చూడలేదు. ఏప్రిల్ 8న సినిమా రావడం కోసం జ్వరం, ఒళ్లు నొప్పులున్నా ఆయనెంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన రాజు అయితే మేమంత సేవకులుగా పనిచేశాం. దేవిశ్రీప్రసాద్ గారు మంచి ఆల్బమ్ ఇచ్చారు. స్నేహితుడి డ్రీంను నేరవేర్చడానికి శరత్ మరార్ పడ్డ కష్టం నాకు తెలుసు. అర్థర్ విల్సన్,గౌతంరాజు ఇలా అందరూ కష్టపడి చేసిన సినిమా. అందరికీ థాంక్స్’’ అన్నారు.

శరత్ మరార్ మాట్లాడుతూ ‘’సర్దార్ గబ్బర్ సింగ్ జర్నీ ఫైనెస్ట్ జర్నీ. మంచి ఎక్స్ పీరియెన్స్. పవన్ గారితో వర్క్ చేయడం అద్భుతం. దేవిశ్రీగారు నిజంగానే రాక్ స్టార్. పవన్ గారి సపోర్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రతి సీన్ ను బాగా డెవలప్ చేసిన తీరు నాకు నచ్చింద. మంచి టీం కో ఆర్డినేషన్. ప్రతి ఒక యాక్టర్, టెక్నిషియన్ సపోర్ట్ మరచిపోలేం. ఈరోస్ గారు మాకు ప్రతి అడుగులో అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’తెలుగువాడి సినిమా బలమెంటో ప్రపంచంలోని అందరికీ చాటి చెప్పిన చిరంజీవిగారు ప్రేక్షకులను ఆనందరపరచడానికి పవర్ స్టార్ నిచ్చారు. అలాగే మెగాపవర్ స్టార్ నిచ్చారు. ఈ సినిమా గురించి నాకేమీ తెలియదు. మీలాగే సినిమా చూడటానికి వెయిట్ చేస్తున్నాను. ఆవేశం, ఆదర్శం కాళ్ళుగా నడిచే మనిషి పవన్ కల్యాణ్ గారు. అంత కలిపి పిడికెడు మట్టే కావచ్చు. కానీ ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశానికి కున్న పొగరు నాకుందనే విషయం ఆయన్ను చూసినప్పుడల్లా గుర్తుకువస్తుంది. అలాంటి పొగరుకి మనస్ఫూర్తిగా సపోర్ట్ అందిస్తున్నాను. డైరెక్టర్ బాబీకి, దేవిశ్రీకి థాంక్స్ చెబుతున్నాను. సక్సెస్ మీట్ తర్వాత రికార్డ్ కలెక్షన్స్ లెక్క బెట్టుకున్న తర్వాత ఆయనతో మాట్లాడాలి. వచ్చే ప్రతి సినిమా మన పరిధులను ముందుకు తోసుకెళుతుంది. విస్తృతిని పెంచుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటి కావాలని అది ఈ సినిమాతో జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘’రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరాంగారు మంచి లిరిక్స్ ఇచ్చారు. మాస్ ను కమర్షియల్ గా చూపించడమెలాగో తెలిసిన దర్శకుడు బాబీ. పవన్ గారితో మూడు సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాలో ఆ జర్నీ ఇంకాస్తా పెరిగింది. శరత్ మరార్ గారు సహా నిర్మాతలకు థాంక్స్‘’ అన్నారు.

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘’సింగిల్ మైండెడ్ పర్సన్, డేడికేషన్ ఉన్న వ్యక్తే పవన్ కల్యాణ్ గారు. ఆయనతో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్ పీరియెన్స్. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు ఆనందగా ఉంది’’ అన్నారు.

ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘’నా లైఫ్ లో ఇంత కష్టపడే హీరోను నేను చూడలేదు. చిరంజీవిగారు, అమితాబ్, రజనీ ఇలా చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ అమీర్ ఖాన్, కమల్ హాసన్ లు క్రియేటివ్ హీరోస్ ఉన్నారు. అలాంటి క్రియేటివ్ హీరోస్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాను అనుకున్న టైంలో తీసుకురావడానికి పవన్ గారు పడ్డ కష్టమే కారణం’’ అన్నారు.

అలీ మాట్లాడుతూ ‘’బాలీవుడ్ లో పవర్ తగ్గడంతో సర్దార్ గబ్బర్ సింగ్ తో హిందీలోకి వెళుతున్నారు’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved