pizza
Savitri music launch
‘సావిత్రి’ ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

04 March 2016
Hyderabad

నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్, నందిత, తారకరత్న, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్, పవన్ సాధినేని, శ్రవణ్, ప్రవీణ్ సత్తారు, సాయికార్తీక్, సాయికొర్రపాటి, కిట్టు విస్సా ప్రగడ, సినిమాటోగ్రాఫర్ వసంత్, శ్రధ్ధాదాస్, రష్మీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

బిగ్ సీడీ, ఆడియో సీడీలను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘’సినిమా నేపథ్యం చూస్తుంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా కనపడుతుంది. అలాగే టైటిల్ చూస్తుంటే లెజెండ్ లో స్త్రీల గురించి,వారి గొప్పతనాన్ని గురించి నేను చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తుంది. చక్కటి టైటిల్ పెట్టినందుకు యూనిట్ ను అభినందిస్తున్నాను. నారారోహిత్ తన స్టయిల్ లో మేథడికల్ యాక్టింగ్ తో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నాడు. మంచి ఇమేజ్ ఉన్న నారారోహిత్ ఇలాంటి టైటిల్ ఉన్న సినిమాలో చేసినందుకు తనని అభినందిస్తున్నాను. సంగీతానికి చలించని వారు ఉండరు. సంగీతం చాలా గొప్పది. కొన్ని రోగాలను కూడా నయం చేయవచ్చునని చరిత్ర చెబుతుంది. అలాంటి సంగీతాన్ని వినసొంపుగా మార్చిన శ్రవణ్ ను అభినందిస్తున్నాను. పాటలు బావున్నాయి. నేను పాట పాడాలనుకుంటే ఎవరూ పాడించడం లేదు. అయితే రోహిత్ ఈ సినిమాలో పాట పాడాడు. అందుకు తనను అభినందించాలి. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నారారోహిత్ మాట్లాడుతూ ‘’నేను ఈ స్టేజ్ కు రావడానికి కారణం మా పెద్దనాన్న చంద్రబాబునాయుడుగారు, నాన్నగారు. నేను సినిమాల్లోకి వెళాతనని అనగానే వారు బాగా సపోర్ట్ చేశారు. అలాగే బాలకృష్ణగారు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నారు. రెండు సంవత్సరాలు క్రితం ఈ కథ విన్నాం. లేట్ గా స్టార్టయినా, మంచి నిర్మాత రాజేంద్రప్రసాద్ దొరకడంతో సినిమా క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. పవన్ సాధినేని సినిమాను బాగా హ్యండిల్ చేశాడు. సోలో తర్వాత అలాంటి సినిమా సావిత్రి అవుతుంది. ఆ సినిమాలాగానే ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రవణ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ థాంక్స్’’ అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ ‘’అద్భుతమైన దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ సహా అద్భుతమైన టీం దరూపొందించిన సినిమా సావిత్రం. సోలో తర్వాత ఈ సినిమా పవన్ బావ, నారారోహిత్ బావకు పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ’’ ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎటువంటి వల్గారిటీ లేకుండా చక్కగా ఉంటుంది. నారారోహిత్ గారి ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అవుతుంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ ‘’మా నాన్నగారు బాలకృష్ణగారికి పెద్ద అభిమాని. రాజేంద్రప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఎంటర్ టీంకు మా పెద్దన్నయ్యలా ఉండి, సపోర్ట్ చేశారు. శ్రవణ్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. యూత్ సినిమాకైతే ఒక టికెట్ తెగితే, ఫ్యామిలీ సినిమాకు ఇంట్లోని టికెట్స్ అన్నీ తెగుతాయని అనడంతో సావిత్రి లాంటి ఫ్యామిలీ సినిమా చేశాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

Glam galleries from the event

 

మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ ‘’ఈ ఆల్బమ్ లో నారా రోహిత్ గారు పాడటటమే హైలైట్. చాలా డేడికేషన్ తో సాంగ్ పాడారు. ఆ పాట పెద్ద హిట్టయింది. పవన్ సాధినేనితో మంచి పరిచయం ఉంది. అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘’పవన్ సాధినేని మంచి కమిట్ మెంట్ ఉన్న దర్శకుడు. తనతో నేను ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా చేశాను. శ్రవణ్ మంచి మ్యూజిక్ అందించారు. సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు.

అజయ్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో అందరం ఫ్యామిలీ మెంబర్స్ లా పనిచేశాం. హీరోయిన్ బాబాయ్ రోల్ చేశాను. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.

ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘’పవన్ కెపాబిలిటీ ఏంటో నాకు తెలుసు. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇస్తాడు. బాణం, అసుర వంటి డిఫరెంట్ మూవీస్ చేసిన నారా రోహిత్ గారు అండ్ టీంకు మరో సక్సెస్ గ్యారంటీ. ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘’రోహిత్ గారు ప్రతి సినిమాను డిఫరెంట్ గా చేస్తుంటారు.

నందిత మాట్లాడుతూ ‘’ఫ్యాబులస్ మూవీ. నాకు ఇలా ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి టీంతో పినచేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.

నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు

సాంకేతిక విభాగం : సినిమాటోగ్రఫీ - వస్సంత్ , డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ, ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, కో డైరెక్టర్: సురేష్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved