కన్నడంలో రూపొందిన చిత్రం నాని. ఈ హర్రర్ చిత్రాన్ని తెలుగులో భీమవరం టాకీస్ బ్యానర్‌పై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, బై జగదీష్, కల్పన, రాధ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసిని కీలకపాత్రలో నటించారు.త్యాగరాజ్-గురుకిరణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.వి.కృష్ణారెడ్డి,కె.అచ్చిరెడ్డి ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని ఓం సాయిప్రకాష్‌కు అందించారు. ఈ సందర్భంగా...
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ``రామసత్యనారాయణ సినీ శ్రామికుడు. పరిమితమైన బడ్జెట్‌లో సినిమాలను విడుదల చేసి సక్సెస్‌లు సాధిస్తున్నారు. త్వరలోనే ఆయన నిర్మాతగా వంద చిత్రాలను పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. హర్రర్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న రామసత్యనారాయణకు థాంక్స్`` అన్నారు.
కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ``ట్రైలర్స్, సాంగ్స్ బావున్నాయి. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్టవుతుందనిపిస్తుంది. చిన్న సినిమాలను ఓ ప్లానింగ్‌లో రిలీజ్ చేసి సక్సెస్ సాధిస్తున్న రామసత్యనారాయణకు ఈ సినిమా మరో సక్సెస్ అందిస్తుంది`` అన్నారు.
ఓం సాయిప్రకాష్ మాట్లాడుతూ``ప్రణాళిక ప్రకారం సినిమాలను రిలీజ్ చేస్తూ విజయం సాధిస్తున్న రామసత్యనారాయణ, రామానాయుడుగారి బాటలో ప్రయాణిస్తున్నారు. అలాగే రమేష్ జైన్‌గారికి తెలుగు సినిమా పరిశ్రమలో ఈ సినిమా మంచి చిత్రంగా మిగిలిపోతుంది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ బావున్నాయి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నిర్మాత రమేష్ కుమార్ జైని మాట్లాడుతూ‘’గుజరాత్ ఓ ఇంటిని 17 సంవత్సరాల పాటు మూసి వేశారు. ఆ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను కన్నడంలో నాని అనే పేరుతో విడుదల చేసి సక్సెస్ సాధించాం. ఇప్పుడు శివగామి అనే పేరుతో ఈ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. సినిమాలంటే ప్యాషన్. మంచి చిత్రాలను చేయడానికి ప్రాముఖ్యతనిస్తాను కానీ డబ్బుకు కాదు. కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా స్ట్రయిట్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ సుమంత్ మాట్లాడుతూ‘’ రమేష్ గారు మంచి టెస్ట్ ఫుల్ నిర్మాత. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ కుమార్ జైనిగారికి,తెలుగులో విడుదల చేస్తున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణగారికి థాంక్స్. తెలుగులో సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. సినిమాను జూలై ఫస్ట్ వీక్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ``కన్నడంలో నాలుగు కోట్లతో రూపొందిన ఈ చిత్రం తెలుగు, కన్నడంలో ఒకేసారి విడుదలవుతుంది. బేబి సుహాసిని, సీనియర్ సుహాసినిల పెర్‌ఫార్మెన్స్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. తెలుగులో ప్రముఖ గాయని గీతామాదురి, ప్రముఖ సింగర్ గజల్ శ్రీనివాస్ కుమార్తె సంస్కృతి పాడటం విశేషం. హర్రర్ సినిమాల్లో శివగామి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుందని నమ్మకముంది`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్స్ మాట్లాడుతూ ``హర్రర్ చిత్రాలకు మ్యూజిక్ చేయడం అనేది డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమా విషయానికి వస్తే సంగీతంతో పాటు చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. కన్నడం, తెలుగులో సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సురేష్, సంగీతంః త్యాగరాజ్-గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః డా.శివ వై.ప్రసాద్, సమర్పణః రమేష్ కుమార్ జైన్, నిర్మాతః తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుమంత్.