సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్‌కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'తిక్క'. లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరోయిన్స్ గా నటించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో జానారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సాయిధరమ్‌తేజ్, సునీల్‌రెడ్డి, మన్నార్‌చోప్రా, చిత్ర నిర్మాత సి.రోహిణ్‌కుమార్ రెడ్డి, కె.యస్.రామారావు, ఎ.యస్.రవికుమార్ చౌదరి, లారిసా బోనేసి, కోనవెంకట్, అంజన్ కుమార్ యాదవ్, మాగంటి గోపినాథ్, దిల్‌రాజు, ఎస్.ఎస్.థమన్, వంశీపైడిపలి, బివిఎస్.రవి, కార్తీక శ్రీనివాస్, కిరణ్‌కుమార్, ప్రభాస్‌శ్రీను తదితరులు హాజరయ్యారు.
థియేట్రికల్ ట్రైలర్‌ను జానా రెడ్డి విడుదల చేశారు.
బిగ్ సీడీని వంశీపైడిపల్లి విడుదల చేశారు. ఆడియో సీడీలను వంశీపైడిపల్లి విడుదల చేసి తొలి సీడీని సాయిధరమ్‌తేజ్‌కు అందించారు.
జానారెడ్డి మాట్లాడుతూ''దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ కు అభినందనలు. తిక్క అంటే అత్యంత ఇష్టమో, ఏదైనా విషయాన్ని సీరియస్ తీసుకోవడమో అని అనుకుంటున్నాను. భవిష్యత్‌లో ఇంకా మంచి సినిమాలు చేసి నిర్మాత మంచి స్థాయికెళ్లాలి. సినిమా విడుదలై అందరి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ''సాయి తెలుగులో నెంబర్‌వన్ హీరో అవుతాడు. మా రోహిణ్‌రెడ్డి పట్టిందంతా బంగారమై, సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. దర్శకుడు ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడు'' అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ''చిరంజీవి, పవన్‌కల్యాణ్‌గారి ఆశీర్వాదాలతోనే ఇక్కడకు రాగలిగాను. జీవితాంతం వారికెప్పుడూ నేను రుణపడే ఉంటాను. కథ వినగానే, బ్రేకప్ లవ్‌స్టోరీ, నేను బాగా కనెక్ట్ అయ్యాను. సునీల్‌రెడ్డిగారితో ఎప్పటి నుండో మంచి పరిచయం ఉంది. రోహిణ్ అన్న బ్రదర్‌లా సపోర్ట్ చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. థమన్ స్పోర్టివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. గుహన్‌గారు మంచి సినిమాటోగ్రఫీ అందించారు. అలీ, రఘుబాబు సహా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం మరచిపోలేను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
డైరెక్టర్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ''మా ఫ్యామిలీ సభ్యులు, సాయిధరమ్‌తేజ్, రోహిణ్‌రెడ్డిగారికి థాంక్స్ చెప్పినా సరిపోదు. ప్లాప్ డైరెక్టర్ అయిన నన్ను నమ్మి సాయి, రోహిణ్గారు అవకాశం ఇచ్చారు. థమన్ బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
వంశీపైడిపల్లి మాట్లాడుతూ''నేను సినిమా లవర్‌గానే ఉండాలనుకుంటాను. తేజు సక్సెస్‌ఫుల్ హీరో అయ్యాడు. తను భయంతో కెరీర్ మొదలు పెట్టాడు. ఇంత సక్సెస్ అయినా ఆ భయం అలాగే ఉంది. ఆ భయాన్ని అలాగే పెట్టుకుంటే తను ఇంకా ఎదుగుతాడు. ఇది తనకు బిగినింగ్ మాత్రమే. తను ఎన్నో ఉన్నత స్థానాలు చేరుకోవాలి. తనకు తాను నిచ్చెన వేసుకుని ఎదుగుతున్నాడు. తనతో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సునీల్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా, బిజినెస్ పరంగా ఎంతో సక్సెస్ అయిన నిర్మాత ప్యాషన్‌తో ఈ సినిమా చేశాడు. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ తిక్కకు ఓ లెక్కుంటుందని అనుకుంటున్నాను'' అన్నారు.
ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ''తేజ్ నాకు మంచి క్రికెట్ పార్ట్ నర్. డైరెక్టర్ సునీల్ రెడ్డితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నా నుండి మంచి మ్యూజిక్‌ను రాబట్టుకున్నాడు. ఈ సినిమా కోసం ఒక సంవత్సరం పాటు వర్క్ చేస్తున్నాం. ఎగ్జయిటింగ్‌గా ఉంది. ధనుష్, శింబు ఈ సినిమాలో పాటలు పాడినందుకు వారికి థాంక్స్. సాయిధరమ్‌లో చాలా ఎనర్జీ ఉంది. సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్'' అన్నారు.
సి.రోహిణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ''మెగాఫ్యామిలీ అంటే చిన్నప్పట్నుంచి నాకు అభిమానం. ఈ సినిమా విషయంలో తేజుతో వర్క్ చేస్తున్నప్పుడు నా బ్రదర్‌తో చేస్తున్నట్లు అనిపించింది. సునీల్‌రెడ్డి, తేజుతో మొదటి సినిమా పనిచేయడం హ్యాపీగా ఉంది. థమన్ మంచి మ్యూజిక్ అందించాడు. ధనుష్, శింబుగారు మా సినిమాలో పాటలు పాడినందుకు థాంక్స్. లారిస్సా, మన్నార్ ఇద్దరూ చక్కగా యాక్ట్ చేశారు. ఆగస్ట్ 13న సినిమా రిలీజ్ అవుతుంది. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డెఫనెట్‌గా హిట్ అవుతుంది'' అన్నారు.
కె.యస్.రామారావు మాట్లాడుతూ''మా హీరో చిరంజీవి ఫ్యామిలీకి చెందిన హీరో సాయిధరమ్‌తేజ్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చూశాను. కచ్చితంగా సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని యూనిట్‌ను అభినందిస్తున్నాను''అన్నారు.
ఎ.యస్.రవికుమార్ చౌదరి''సాయిధరమ్‌తేజ్ నా హీరో. ఇంకా ఆయన ఎక్కాల్సిన మెట్లు 146 ఉన్నాయి. తన ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. రోహిణ్‌కుమార్‌రెడ్డిగారు నిర్మించిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించాలి. థమన్‌కు ఆల్ ది బెస్ట్. యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.
మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ''నిర్మాత రోహిణ్‌రెడ్డిగారు నాకు మంచి మిత్రుడు. ఆయన సాయిధరమ్‌తో తొలి సినిమా చేస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. డెఫనెట్‌గా సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.
అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ''నిర్మాత రోహిణ్‌రెడ్డిగారికి , హీరో హీరోయిన్లకు అభినందనలు. రోహిణ్‌రెడ్డిగారు నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
కోనవెంకట్ మాట్లాడుతూ''చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారి తిక్కెంటో మేం చూశాం. ఇప్పుడు తేజు తిక్కెంటో చూడాలనుకుంటున్నాం. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ''నిర్మాత రోహిణ్‌రెడ్డిగారు రాజకీయాల నుండి సినిమాల్లోకి వచ్చారు. ఆయనకు, దర్శకుడు సునీల్‌రెడ్డికి, టీంకు ఆల్ ది బెస్ట్. సాయిధరమ్ ఈ సినిమాతో తన తిక్క చూపించి మరో సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాను''అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ''సునీల్‌రెడ్డి అందరి వెళ్ళే రూట్‌లో కాకుండా డిఫరెంట్‌గా వెళ్తాడు, అదే అతని తిక్క. ఈ సినిమా సాయిధరమ్ కెరీర్‌లో పెద్ద కమర్షియల్ హిట్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే బ్లాక్‌బస్టర్ కళ కనపడుతుంది. సాయి డిఫరెంట్ కథలను ఎన్నుకుంటూ ముందుకు వెళుతున్నాడు. థమన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్‌ను అభినందించారు.