pizza
Tick Tock music launch
`టిక్ టాక్` ఆడియో విడుద‌ల‌!
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 May 2017
Hyderabad

పి.హెచ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న హార్ర‌ర్‌, ఫ‌న్‌, ల‌వ్ కాన్సెప్ట్ మూవీ సినిమా `టిక్ టాక్‌`. పోలిచ‌ర్ల హ‌ర‌నాథ్ నిర్మిస్తూ న‌టిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో చాలా గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.పి.ప‌ట్నాయ‌క్ సీడీల‌ను ఆవిష్క‌రించారు.

అనంత‌రం ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ...``పాట‌లు, ట్రైల‌ర్ చాలా బాగున్నాయి. హ‌ర‌నాథ్ గారు అమెరికాలో ఎంతో బిజీగా ఉండే డాక్ట‌ర్ అయినప్ప‌టికీ సినిమాల మీద పాష‌న్ తో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది కి పైగా చిత్రాలు నిర్మించి దాదాపు రెండు వేల మందికి ఉపాధి క‌ల్పించారు. ఇలాంటి నిర్మాతల‌కు విజ‌యాలు అందిస్తే ఇంకా మ‌రిన్ని చిత్రాలు చేసి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తార‌``న్నారు.

అమెరికాలో తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కులు బండారు శ్రీధ‌ర్ మాట్లాడుతూ...``హ‌ర‌నాథ్ గారు చాలా కాలంగా తెలుసు. వారికి సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్స్ చూశాక మంచి విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌``న్నారు.

డిజిక్వెస్ట్ బ‌సిరెడ్డి మాట్లాడుతూ...``హ‌ర‌నాథ్ గారు నాకు అమెరికాలో ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం. ప్ర‌తి సినిమా గురించి నాతో డిస్క‌స్ చేస్తాడు. సినిమా అంటే పిచ్చి త‌న‌కు. ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్స్ చాలా బాగున్నాయి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ `` అన్నారు.

Glam gallery from the event

హీరో-నిర్మాత హ‌ర‌నాథ్ పొలిచ‌ర్ల మాట్లాడుతూ...``టైం అనుస‌రించి మ‌నం కొన్ని కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ ఉంటాం. హార్ర‌ర్‌, కామెడి జోన‌ర్‌లో అన్నీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది. సినిమా మొత్తం పూర్త‌యింది. సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో ఉన్నాం. ఈ నెలలోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం``అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్య మాట్లాడుతూ...``హ‌ర‌నాథ్ గారు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చి నాతో మూడు పాట‌లు చేయించుకున్నార‌ని``అన్నారు

పోలిచ‌ర్ల హ‌ర‌నాథ్‌, నిషిగంద, మౌనిక‌, రాహుల్‌, సందీప్ ఆనంద్‌, సాయికృష్ణ‌, అల్లూ ర‌మేష్‌, ర‌మ‌ణి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః పి.వంశీకృష్ణ‌, ఎడిట‌ర్ః వెంక‌ట ర‌మ‌ణ‌, ఆర్ట్ః ఇ.గోవింద్‌, మూల‌క‌థః లిఖిత్ శ్రీనివాస్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, నిర్మాత‌, డైరెక్ష‌న్ః పొలిచ‌ర్ల హ‌రినాథ్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved