19 August 2016
Hyderabad
కోటి కిరణ్, ఆషా హీరో హీరోయిన్లుగా సుహాసిని, బుజ్జి సమర్పణలో బుజ్జి వినాయక పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `వేటాడే పులి`. పి.మహేష్ కుమార్ దర్శకత్వంలో పి.బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ కిరణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ఫిలించాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, సాయివెంకట్, ఆర్.కె.గౌడ్,సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను ప్రతాని రామకృష్ణారెడ్డి విడుదల చేసి నిర్మాతకు అందజేశారు. ఈ సందర్భంగా....
రామసత్యనారాయణ మాట్లాడుతూ ``ఈ సినిమాను దర్శకుడు మహేష్ లేకపోయినప్పటికీ పట్టుదలతో నిర్మాతగారు సినిమాను పూర్తి చేసి ఇక్కడ వరకు తీసుకు రావడం గొప్ప విషయం. టైటిల్ బావుంది. చిన్న సినిమాలు సక్సెస్ సాధిస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలి`` అన్నారు.
ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ ``సాంగ్స్ బావున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను మంచి ప్రమోషన్స్ చేసుకుని రిలీజ్ చేసుకుంటే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. విడుదల సమయంలో ఏమైనా సమస్యలుంటే సహకరిస్తాను. టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
సాయివెంకట్ మాట్లాడుతూ ``టైటిల్ చాలా బావుంది.మాస్ టైటిల్. రాజ్ కిరణ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. చిన్న సినిమాలను పెద్ద సినిమాలతో పోటీగా కాకుండా మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేసుకుంటే మంచిది`` అన్నారు.
నిర్మాత పి.బుజ్జి మాట్లాడుతూ ``నా భర్త మహేష్‌గారి ఆశయం కోసం నా కొడుకు హీరోగా ఈ సినిమా చేశాం. అబ్బాయిని హీరోగా చూడాలనే కోరిక తీరకముందే ఆయన మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. సినిమా పూర్తి చేయడానికి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
హీరో కోటి కిరణ్ మాట్లాడుతూ ``నాన్నగారి ఆశయం కోసం, సినిమా మధ్యలో ఆగిపోయినప్పటికీ, మా అమ్మగారు దైర్యంగా సినిమాను పూర్తి చేశారు. రాజ్ కిరణ్ మంచి మ్యూజిక్ అందించారు. సహకారం అందించిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి సంగీతం కుదిరింది. అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
హీరోయిన్ ఆషా మాట్లాడుతూ ``వ్యక్తి ఆశయం కోసమే తప్ప సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా చేసిన సినిమా`` అన్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్: విజయ్, ఫైట్స్: అవినాష్, కొరియోగ్రఫీ: కళాధర్, మ్యూజిక్: రాజ్ కిరణ్, కెమెరా: చందు, గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. శివప్రసాద్, కో ప్రొడ్యూసర్: గణేష్ సింగ్ థాకూర్, ప్రొడ్యూసర్: పి.బుజ్జి, సాహిత్యం, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.మహేష్ కుమార్.