పద్మశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో శ్రీ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం 'అమీర్ పేటలో...'. ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో...
ప్రతాని రామకృష్ణాగౌడ్ మాట్లాడుతూ ''ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్‌పేటలో ప్రాంతంలో రకరకాల మనుషులు ఉంటారు. ఆ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని ప్రకారం కథను రాసుకుని చేసిన సినిమా ఇది. మంచి టైటిల్. ఇందులో నటించిన వారందరికీ మంచి బ్రేక్ తెచ్చే చిత్రం కావాలి. అలాగే ప్రమోషన్స్ విషయంలో మంచి ప్లానింగ్ చేసుకుని సినిమాను మంచి రిలీజ్ డేట్ చూసుకుని విడుదల చేయాలి. థియేటర్స్ విషయంలో నావంతు సహాయం చేయడానికి నేను సిద్ధమే'' అన్నారు.
Ashwini Glam gallery from the event
సాయివెంకట్ మాట్లాడుతూ ''మంచి టైటిల్. ఎవరైనా హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం, చదువుకోవడానికి వస్తే వారు సందర్శించే ప్రాంతం అమీర్‌పేట్. అదే పేరుతో చేస్తున్న యూత్‌ఫుల్ మూవీ ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను తీయడం కంటే సినిమాను రిలీజ్ చేయడం కష్టమే. కానీ నిర్మాతలు మంచి ప్లానింగ్‌తో రిలీజ్ విషయంలో ముందడుగు వేయాలి'' అన్నారు.
దర్శకుడు, హీరో శ్రీ మాట్లాడుతూ ''నేను ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే అమీర్‌పేటలోని పరిస్థితులను అధ్యయనం చేసి కథ రాసుకున్నాను. అప్పుడు నిర్మాత మహేష్ నాకు అండగా నిలబడ్డాడు. టైటిల్, పోస్టర్, టీజర్, సాంగ్స్ ఓ సినిమా విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకనే నేను వీటి విషయంలో కేర్ తీసుకుని ముందడుగువేశాను. థియేటర్‌కు వెళ్లే ఆడియెన్ శాటిస్పాక్షన్ అయ్యేలా సినిమా ఉంటుంది. అలాగే వైజాగ్, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం ఇలా చాలా చోట్ల ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్త ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
నిర్మాత మహేష్ మాట్లాడుతూ ''మా బ్యానర్‌లో వస్తున్న మొదటి చిత్రమిది. ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. మురళి బెస్ట్ మ్యూజిక్ అందించారు. శ్రీ డైరెక్టర్ కంటే నాకు మంచి మిత్రుడు. బాహుబలి చిత్రం పెద్ద చిత్రాల్లో ఓ టార్గెట్ క్రియేట్ చేస్తే, చిన్న చిత్రాల్లో మాది ఓ టార్గెట్‌ను క్రియేట్ చేస్తుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ అశ్వని, శేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ మురళి, రతిక, రాజు తదితరులు పాల్గొన్నారు.