
18 February 2025
Hyderabad
వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫెబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. స్టార్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందూ మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. బాపు మూవీ టీంకి థాంక్ యూ. బాపు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చివర్లో ఓ డోర్ దగ్గర ఫ్యామిలీ అంతా చూస్తూ వుంటుంది. అసలు ఏం చూస్తున్నారనే క్యురియాసిటీ కలిగింది. ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం వుంది. సినిమా టాక్ బావుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్ ఫుల్ చేస్తారు. ఈ సినిమాకి అన్నీ గుడ్ వైబ్స్ వున్నాయి. మ్యూజిక్, స్టార్ కాస్ట్ అంతా ఇంప్రెసివ్ గా వుంది. మణి స్క్రీన్ మీద ఇంటెన్స్ గా ఉంటాడు. బ్రహ్మాజీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎంత నాలెడ్జ్ వుంది అసలు(నవ్వుతూ). టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 21న థియేటర్స్ లో కలుద్దాం'అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పదానికి రెండు మూడు రీజన్స్ వున్నాయి. ముఫ్ఫై ఏళ్ళుగా ఎవరికీ కనిపించకుండా దాచుకున్న బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది(నవ్వుతూ). ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. అంత నేచురల్ గా చేశారు. బ్రహ్మాజీ అన్న తన భుజంపై వేసుకొని ప్రమోట్ చేశారు. ట్రైలర్ లో రా ఎమోషన్ కనిపిస్తోంది. టీం అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ... చిన్న సినిమా పెద్ద సినిమా అని వుండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద సినిమానే. బాపు ట్రైలర్ చూస్తే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఫెబ్రవరి 21 కోసం ఎదురుచూస్తున్నాను' అన్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ... బాపు సినిమా ట్రైలర్ చూశాను. చాలా బావుంది. ట్రైలర్ డైరెక్టర్ హీరోలా కనిపించారు. దయ గారు చాలా బాగా తీశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ'అన్నారు.
యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ.. మా ముఖ్య అతిధులందరికీ థాంక్ యూ. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆడియన్స్ టికెట్స్ కొని కలెక్షన్స్ వస్తే అందులో నుంచి ఇస్తానని చెప్పారు. ప్లీజ్ అందరూ థియేటర్స్ కి వెళ్లి మా రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి(నవ్వుతూ). ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. ఈ సినిమా క్రెడిట్ మా డైరెక్టర్ గారికి దక్కుతుంది. మా టీం అందరికీ థాంక్ యూ'అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ద్రువన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బాపు అద్భుతమైన కథ. ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి నన్ను ఎంచుకున్న డైరెక్టర్ దయకి థాంక్ యూ. లిరిక్ రైటర్స్ కి థాంక్ యూ. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాని చూసి ఆడియన్స్ గొప్ప అనుభూతిని పొందుతారు'అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ...బాపు సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ. ద్రువన్ నాకు ఎప్పటినుంచో తెలుసు. బాపు సినిమా పెద్ద హిట్ కావాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత భాను ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కిస్మత్ తర్వాత ఇది నా రెండో సినిమా. దయ ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. ఇంత అద్భుతమైన సినీ ప్రముఖులతో ఈ వేదిక పంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇదొక గౌరవంగా భావిస్తున్నాను. నాగ్ అశ్విన్ గారి మహానటి చూసి మెస్మరైజ్ అయ్యాను. బ్రహ్మజీ గారి థాంక్ యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.
డైరెక్టర్ దయ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాగ్ అశ్విన్ గారికి, చందు గారికి, బుచ్చిబాబు గారికి సత్యదేవ్ గారికి థాంక్ యూ. మా నిర్మాతలకు థాంక్ యూ. నా కథని నమ్మి నిర్మించారు. మా టీం అందరికీ పేరుపేరున థాంక్ యూ. బ్రహ్మాజీ గారి వలనే ఈ సినిమాకి ఇంత బజ్ క్రియేట్ అయ్యింది. ప్రివ్యుస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరంతా సినిమా చూసి పెద్ద హిట్ చేశారని కోరుకుంటున్నాను'అన్నారు
యాక్టర్ బలగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నేను సినీ పరిశ్రమకు కొత్తవాడిని. మల్లేశం నా మొదటి పిక్చర్. బలగంతో ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాపుతో వస్తున్నాం. మీ అందరి ప్రోత్సాహం కావాలి. ఈ సినిమా పది మందికి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను'అన్నారు.
యాక్టర్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ..బాపు నా కెరీర్ లో మర్చిపోలేని సినిమా. ఫస్ట్ టైం మా బాపు ఫోన్ చేసిన నేను చాలా గర్వంగా వున్నానని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. ఈ సినిమా నా కెరీర్ లో బిఫోర్ బాపు ఆఫ్టర్ బాపు అన్నట్టుగా వుంటుంది. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. బ్రహ్మాజీ కలసి నటించడం మంచి ఎక్స్ పీరియన్స్. ఆమనీ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి. తప్పకుండా మీకు నచ్చుతుందనే నమ్మకం వుంది'అన్నారు.
యాక్టర్ మణి ఏగుర్ల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాకి ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. ప్రిమియర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసి నచ్చితే మిగతా వారికి షేర్ చేయండి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.
లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నేను సినిమా రంగంలో ఉండటానికి కారణం మా బాపు. మా టీం చాలా హైలో వున్నారు. సినిమా సక్సెస్ అందరి మొహంలో కనిపిస్తుంది. ఇందులో రేలా అనే పాట రాశాను. నేల తల్లి గురించే గొప్పగా చెప్పే అవకాశం వచ్చింది. బలగం సినిమాలానే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'అన్నారు
యాక్టర్ రచ్చరవి మాట్లాడుతూ.. బాపు అనేది గొప్ప ఎమోషన్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. గుర్తుండిపోయే పాత్ర ఇది. సినిమాకి చాలా మంచి పేరు వస్తుంది. బ్రహ్మాజీ గారికి చాలా ప్రశంసలు వస్తాయి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది. ఇది ప్రతి కుటుంబం సినిమా. గొప్ప సినిమా అవుతుంది'అన్నారు.
లిరిక్ రైటర్ పూర్ణ చారికి మాట్లాడుతూ.. బాపు గుండెల నుంచి వచ్చే శబ్దం. ఇందులో ఓ పాట రాశాను. మంగ్లీ గారు పాడారు. ద్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ దయ కష్టానికి ఈ సినిమా ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ కి వెళ్లి చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.
ఎడిటర్ అనిల్ మాట్లాడుతూ.. ఫాదర్ ఎప్పుడూ హీరోనే. ఈ సినిమా ఆడియన్స్ టైం, మనీని రెస్పెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.
సినిమాటోగ్రఫర్ వాసు పెండెం మాట్లాడుతూ.. బాపు హానెస్ట్ అండ్ జెన్యూన్ స్టొరీ. దయ నాకు ఐదేళ్ళుగా తెలుసు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరికీ థాంక్ యూ'అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ మాచర్ల మాట్లాడుతూ.. బాపు చాలా స్పెషల్ ఫిల్మ్. అందరూ సెట్ లో ఫ్రెండ్లీ గా వున్నారు. టీం అందరికీ థాంక్ యూ. ఈ సినిమా చేసినందుకు దయకి థాంక్ యూ'అన్నారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

