pizza
Havish Birthday celebrations 2015
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 June 2015
Hyderabad

అంగరంగ వైభవంగా హీరో హవీష్ పుట్టినరోజు వేడుకలు

జీనియస్, రామ్ లీలా చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హవీష్ పుట్టినరోజు నేడు (25.06.). ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నిర్మాతలు దాసరి కిరణ్ కుమార్, కోనేరు సత్యనారాయణ, సత్యారెడ్డి, బుచ్చిరెడ్డి, మల్టీ డైమన్షన్ వాసు, దర్శకులు దశరథ్, సముద్ర, మారుతి, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, విసు, సీనియర్ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతిథుల సమక్షంలో హవీష్ బర్త్ డే కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - ''హవీష్ తో జీనియస్, రామ్ లీలా.. రెండు సూపర్ హిట్ మూవీస్ తీశాను. తనతో మరో చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నాను. ఈసారి మరింత బలమైన కథతో సినిమా చేయాలనుకుంటున్నాను. హవీష్ లో అద్భుతమైన నటుడు ఉన్నాడు. సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతున్నాడు. తనలో నటుణ్ణి మరింత ఆవిష్కరించే విధంగా మా తదుపరి చిత్రం ఉంటుంది'' అని చెప్పారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved