pizza
Superstar Krishna birthday celebrations 2016
అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా సూప‌ర్‌స్టార్ పుట్టిన‌రోజు వేడుక‌లు...
ou are at idlebrain.com > News > Functions
Follow Us

31 May 2016
Hyderabad

సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న 74వ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. మంగ‌ళవారం హైద‌రాబాద్ నాగారంలోని ప‌ద్మాల‌యా స్టూడియోలో జ‌రిగిన పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీమ‌తి విజ‌య‌నిర్మల‌, కుటుంబ స‌భ్యుల‌తో పాటు శ్రీశ్రీ సినిమా యూనిట్, ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేని శివ త‌దిత‌రులు పాల్గొన్నారు. కేక్ క‌టింగ్ అనంత‌రం ...

సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ``సాధార‌ణంగా నా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఊటీలో జ‌రుపుకుంటాను. కానీ రెండేళ్లుగా హైద‌రాబాద్‌లోనే జ‌రుపుకుంటున్నాను. న‌టుడిగా 50 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యింది. తేనె మ‌న‌సులు చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి హీరోగా ప‌రిచ‌యం అయిన నేను గూఢ‌చారి 116, అల్లూరి సీతామ‌రాజు, సింహాస‌నం, ఈనాడు, తెలుగు వీర లేవ‌రా ఇలా ఎన్నో చిత్రాల్లో న‌టించాను. త్వ‌రలోనే శ్రీశ్రీ చిత్రంతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ చిత్రం నా అభిమానుల‌కు నా పుట్టిన‌రోజు కానుక‌గా భావిస్తున్నాను. థియేట‌ర్‌తో పాటు, తొలిసారి ఆన్‌లైన్ లో విడుద‌ల‌వుతున్న చిత్ర‌మిదే కావ‌డం విశేషం. ఇన్ని సంవ‌త్స‌రాలు న‌న్ను, నా కుటుంబాన్ని ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు. `` అన్నారు.

శ్రీమ‌తి విజ‌య‌నిర్మల మాట్లాడుతూ
``కృష్ణ‌గారు అభిమానుల మ‌ధ్య‌న ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది ఆయ‌న పుట్టినరోజు కానుక‌గా శ్రీ శ్రీ చిత్రాన్ని అందిస్తున్నాం. ముప్ప‌ల‌నేని శివ‌గారు సినిమాను ఎంతో చక్క‌గా తీశారు. నిర్మాత‌లు సినిమాను ఎంతో క్వాలిటీతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు`` అన్నారు.

ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ
``కృష్ణ‌గారి పండంటి కాపురం చూసి ఆయ‌న‌కు అభిమానిన‌య్యాను. ఆయ‌న న‌టించిన చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. ఆయ‌న ద్వారానే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాను. ఇప్పుడు 50 ఏళ్ల ఆయ‌న న‌ట ప్ర‌స్థానం త‌ర్వాత న‌టించిన శ్రీశ్రీ చిత్రాన్ని నేను డైరెక్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved